ఆడి ఎ3 ఎస్-లైన్ ఎంత వరకు సరైనది: కంప్లీట్ రివ్యూ
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారతీయ మార్కెట్లో తమఎంట్రీ లెవల్ వేరియంట్లలో టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఎస్-లైన్ స్పోర్టి వెర్షన్‌కు చెందిన రివ్యూ. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎ3 సెడాన్ కారు కన్నా ఈ ఎస్- లైన్ కారు ఎంతో స్పోర్టివ్‌గా ఉంటుది.
ఆడి ఎ3 ఎస్-లైన్ కారులో ఉన్న ప్రీమియమ్ మరియు సెగ్మెంట్లో మొదటిసారిగా అందిస్తున్న ఫీచర్లతో పాటు పూర్తి రివ్యూ వివరాలు క్రింది స్లైడరల్లలో కలవు.

మీకు తెలుసా ?
మొదటిసారిగా ఆడి తమ ఎ3 కార్లను 1996 లో ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ ఎ3 కారు మూడవ తరానికి చెందినది. అయితే ఈ ఎ3 సెడాన్ కారును వోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ఫ్లాట్ మీద అభివృద్ది చేశారు.

డిజైన్
ముందు వైపున విశాలమైన ఫ్రంట్ గ్రిల్, రివర్స్ టిక్ మార్క్ ఉండే విధంగా ఉన్న పగటి పూట వెలిగే లైట్లు, మస్కలర్ స్టేన్స్ గల ఫ్రంట్ డిజైన్ మరియు ఏరోడైనమిక్ రూపంతో దీనిని డిజైన్ చేశారు.

దీనికి స్పోర్టివ్ తత్వాన్ని మరింత జోడించడానికి ప్రక్కవైపున 17-అంగుళాల చక్రాలు మరియు నూతన బంపర్ అందించారు. వీటితో పాటు ఎస్-లైన్ బ్యాడ్జింగ్ నేమ్ మరియు వెనుక వైపున అన్ని ఆడి కార్ల డిజైన్ మాదిరిగానే దీనిని కూడా రూపొందించారు కాకపోతే స్పోర్టివ్ లుక్ కోసం రెండు ఎగ్జాస్ట్ సిస్టమ్‌లను అందించారు.

ఇంజన్ వివరాలు
ఆడి ఈ ఎ3 ఎస్-లైన్ సెడాన్ కారులో 1.8-లీటర్ కెపాసిటి గల టిఎఫ్‌ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ మరియు టర్బోఛార్జర్‌ను కలిగి ఉంది.

పవర్ వివరాలు
ఆడి ఎ3 ఎస్-లైన్‌లోని శక్తివంతమైన ఇంజన్ 178 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
ఇందులో గల ఇంజన్‌కు ఆడి సంస్థ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

ఇంధన సామర్థ్యం
ఆడి వారి కథనం ప్రకారం ఈ ఎ3 ఎస్-లైన్ కారు లీటర్‌కు 16.6 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. అయితే ఏఆర్ఏఐ ప్రకారం కూడా దీని మైలేజ్ ఇంతే ఉంది.

డ్రైవింగ్ మోడ్స్
ఆడి తమ ఎ3 ఎస్-లైన్ కారులో రెండు రకాల డ్రైవింగ్ మోడ్స్‌ను పరిచయం చేసింది. అవి హై వే మరియు సిటి మోడ్.

ఇంటీరియర్
ఆడి వారి లగ్జరీకి గుర్తు కారు బాహ్య భాగాలే కాదు అంతర్గతంగా కూడా లగ్జరీకి అంతే చిరునామాగా ఉటుంది. ఎమ్ఎమ్ఐ స్క్రీన్, ఎయిర్ కండీషనర్,
గ్లూవ్ బాక్స్, సిడి ప్లేయర్ మెమోరీ కార్డ్ రీడర్, అంతే కాకుండా 20 జిబి వరకు స్టోరేజ్ సామర్థ్యం గల మ్యూజిక్ సిస్టమ్ కలదు.

సెంటర్ కంన్సోల్‌ను వివిద రంగుల్లో తీర్చి దిద్దారు. ముఖ్యగా బ్లాక్ కలర్ బ్యాగ్రౌండ్ మీద ఎరుపు రంగు బటన్‌లు మరియు తెలుపు రంగు గల అక్షరాలు కలవు. డ్రైవర్ కోసం ప్రత్యేకంగా మల్టీమీడియా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు స్టీరింగ్ ద్వారా ఫోన్ లిఫ్ట్ చేయడం, మాట్లాడటం, కాల్ కట్ చేయడంతో పాటు వినోదానికి సంభందించిన చాలా వాటిని నింత్రించవచ్చు.

సీటింగ్ మరియు సౌకర్యాలు
ఈ ఆడి ఎ3 ఎస్-లైన్ మోడల్ కారులో వెనుకవైపున ఇద్దరు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మరియు పొడవుగా ఉన్న వ్యక్తులకు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దీనికి హెడ్ రూమ్ తక్కువగా ఉంది. ఇందులోని అన్ని సీట్లు కూడా స్పోర్టివ్ మరియు బ్లాక్ ప్రీమియమ్ లెథర్తో వచ్చాయి.

డ్రైవింగ్ సౌలభ్యం
మీరు దీనిని సాధారణ డ్రైవింగ్ మోడ్‌లో మార్చుకుని డ్రైవ్ చేయవచ్చు. దీనిని మీరు ఎంతో సులంభంగా డ్రైవ్ చేయవచ్చు. అయితే దీనిని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆనందాన్ని కోరుకుని చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటే కారును ఎస్ మోడ్‌లోకి మార్చుకుని యాక్సిలరేటర్ పెడల్‌ను నేలకు తాకే విదంగా నొక్కండి మెరుపు వేగంతో డ్రైవింగ్‌ను అనుభవిస్తారు.

భద్రత ఫీచర్లు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్
- ట్రాక్షన్ కంట్రోల్
- బ్రేక్ అసిస్ట్
- హిల్ హోల్డ్ కంట్రోల్‌ను భద్రతలో బాగంగా అందించారు.
- ప్రీమియమ్ మరియు స్పోర్టివ్ ఎక్ట్సీరియర్ డిజైన్
- ఎక్స్‌క్లూజివిటి
- డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్
- భద్రత ఫీచర్లు
- ఒకే విధమైన ఆడియో డిజైన్
- స్టిఫ్ సస్పెన్షన్
- ప్రీమియమ్ ప్రైస్ ట్యాగ్
- విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
- భారతదేశపు సుదూర రైలు వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు

అనుకూల ఫీచర్లు

ప్రతికూలతలు

ధర వివరాలు
ఆడి సంస్థ వారి ఎ2 ఎస్-లైట్ కారు యొక్క ధర రూ. 31.40 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

తీర్పు
మీరు ఈ ఆడి ఎ3 ఎస్-లైన్ లోని అత్భుతమైన ఇంజన్ ద్వారా డ్రైవింగ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంజన్ ద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అవసరం ఉండదు. దీనికి తోడు ఇందులో భద్రత పరంగా ముఖ్యమైన ఫీచర్లను అందించారు.



Click it and Unblock the Notifications








