విపణిలోకి ఆడి ఏ4 విడుదల: ప్రారంభ ధర రూ. 38.1 లక్షలు

By Anil

జర్మనీకి చెందిన ప్రముక లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి నేడు (08 సెప్టెంబర్ 2016) తమ సరికొత్త ఏ4 లగ్జరీ సెడాన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త ఏ4 సెడాన్ ఐదవ తరానికి చెందినదిగా ఆడి తెలిపింది. ఆడి 80 మోడల్‌కు కొనసాగింపుగా తరువాత వచ్చిన చివరి ఏ4 స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. ఈ ఆడి 80 1994 లో పరిచయం అయ్యింది.

2016 ఆడి ఏ4

సరికొత్త ఆడి ఏ4 సెడాన్ ప్రారంభ ధర రూ. 38,10,000 లుగా ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. మరియు ఆడి ఏ4 ప్లస్ వేరియంట్ ధర రూ. 41,20,000 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

2016 ఆడి ఏ4

సరికొత్త ఆడి ఏ4 సెడాన్ లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మాత్రమే కలదు. ఇది సుమారుగా 148బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2016 ఆడి ఏ4

ఆడి ఏ4 లోని శక్తివంతమైన ఇంజన్‌కు 7-స్పీడ్ ఎస్-ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. మరియు డ్రైవర్‌ ఎంచుకునే విధంగా ఐదు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్‌లను ఇందులో అందించారు.

2016 ఆడి ఏ4

ఐదవ తరానికి చెందిన ఏ4 సెడాన్ కేవలం 8.5 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంది.

2016 ఆడి ఏ4

మునుపటి ఏ4 తో పోల్చుకుంటే ఇందులోని 1.4-లీటర్ ఇంజన్ 43 శాతం అత్యంత ప్యూయల్ ఎఫీషియంట్ ఇంజన్. ఇది లీటర్‌కు 17.48 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

2016 ఆడి ఏ4

మునుపటి ఏ4 స్థానంలోకి వచ్చిన ఈ సరికొత్త ఏ4 సెడాన్‌లో చాలా ఆకర్షణీయంగా ఉండే ఫీచర్లతో వచ్చింది. ఎల్‌ఇడి పగటి పూట వెలిగే లైట్లతో పాటుగా ఉన్న యాంగులర్ హెడ్‌ల్యాంప్స్ కలవు. ఈ రెండు హెడ్ లైట్లకు మద్యలో అతి పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ కలదు. ఇలాంటి దానినే ఆడి ఆర్8 సూపర్ కారులో గుర్తించవచ్చు.

2016 ఆడి ఏ4

వెనుక వైపున స్పోర్ట్స్ తరహా ఎల్‌ఇడి టెయిల్ లైట్లను మరియు డైనమిక్ ఇండికేటర్లను అందించారు. బూట్ లిడ్ మీద చిన్న స్పాయిలర్ అందించారు. ఈ ఐదవ తరానికి చెందిన 17-అంగుళాల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించారు.

2016 ఆడి ఏ4

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో ఉన్న కన్వెన్షనల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో ఆడి యొక్క అతి పెద్ద కాక్‌పిట్ డిస్ల్పే అందించారు. ఇందులోని తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పేలో న్యావిగేషన్ మరియు మల్టీమీడియా ఫీచర్లు ఉన్నారు.

2016 ఆడి ఏ4

సీటింగ్ మొత్తాన్ని మరియు ఇంటీరియర్‍‌లోని పై భాగాన్ని పూర్తిగా లెథర్‌తో ఫినిషింగే చేశారు. ముందు డ్యాష్ బోర్డ్‌లో అక్కడక్కడ కలపతో చేసిన తొడుగులు వినియోగించారు. ఏ4 లో మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్‌ సిస్టమ్‌ను అందించారు.

2016 ఆడి ఏ4

భద్రత పరంగా ఇందులో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్, పార్కింగ్ కెమెరా, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇతర భద్రత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2016 ఆడి ఏ4

ఆడి వారి ఐదవ తరానికి చెందిన ఏ4 లగ్జర సెడాన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జాగ్వార్ ఎక్స్ఇ, బిఎమ్‌డబ్ల్యూ 3సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆడి అవుట్‌లెట్లలో ఇది అమ్మకాలకు అందుబాటులో ఉంది.

2016 ఆడి ఏ4

కారు ఇన్సూరెన్స్ కోసం ఎన్నో ఏళ్ల నుండి వినియోగదారులు దళారులను నమ్ముతూ వచ్చారు. ఈ పద్దతి ద్వారా చాలా వరకు నష్టపోతున్నారు వినియోగదారులు. ఈ ధోరణి మార్చడానికి సరికొత్త కార్ ఇన్సూరెన్స్ విధానం మార్కెట్లోకి వచ్చింది. దానికి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2016, 15:54 [IST]
English summary
Audi A4 Launched In India; Prices Start At Rs. 38.1 Lakh
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+