ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

By Anil

ఆడి ఇండియా దేశీయ విపణిలోకి సరికొత్త పెట్రోల్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడుఎ6 సరికొత్త మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్‌తో పాటు 35 టిఎఫ్ఎస్ఐ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 52.75 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఆడి ఎ6 మ్యాట్రిక్స్ 35 టిఎఫ్ఎస్ఐ

ఆడి సంస్థ తమ ఎ6 లో1.8-లీటర్ సామర్థ్యం ఉన్న ఎ6 మ్యాట్రిక్స్ 35 టిఎఫ్ఎస్ఐ మోడల్ అందించింది. ఇది సుమారుహా 190బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు. డీజల్ ఇంజన్ వేరియంట్ల కన్నా పెట్రోల్ వేరియంట్లు మంచి ఆదరణ పొందుతున్న తరుణంలో దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

సర్వోన్నత న్యాయ స్థానం ఢిల్లీలో డీజల్ వాహనాల మీద నిషేధాన్ని తొలగించడం ద్వారా ఆడి ఉత్పత్తులకు ఊరట లభించింది. అయితే నిషేదాన్ని మళ్లీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు తమ ఉత్పత్తులను పెట్రోల్ వేరియంట్లలో అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది ఆడి.
Also Read: ఇండియాలోని ఈ రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు జర భద్రం
ప్రస్తుతం విడుదలైన ఎ6 మ్యాట్రిక్స్ 35 టిఎఫ్ఎస్ఐ లో 8-అంగుళాల ప్రతి స్పందించే మల్టీ మీడియా తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అడాప్టివ్ సస్పెన్షన్ మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు. అంతేకాకుండా ఇందులో ఐదు రకాలా డ్రైవింగ్‌ మోడ్‍‌లు కలవు.

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2016, 18:26 [IST]
English summary
Audi Launches The A6 Matrix 35 TFSI In India For Rs. 52.75 Lakh
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+