ఏకే-47 మెషీన్ గన్‌తో కాల్చినా కూడా చెక్కుచెదరదు: ఆడి ఎ8 ఎల్
ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద వివిధ రకాలకు చెందిన కార్ల తయారీ సంస్థలు నూతన టెక్నాలజీలతో సరికొత్త ఆవిష్కరణలతో తమ ఉత్పత్తులను వారికి కేటాయించిన స్టాల్స్‌లో ప్రదర్సించి చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాని మీకు ఈ విషయం తెలుసా ? అదే 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద ఒక సంస్థ తమ కారును అత్యంత రహస్యంగా ప్రదర్శనకు ఉంచింది. ఏ సంస్థకు చెందిన కారు ఇది, కారణం ఏమిటి ?
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత అత్భుతమైన రైలు మార్గాలు
సమాదానం దొరికింది, పాఠకుల కోసం ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ప్రతి కారు గురించిన సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అత్యంత రహస్యంగా ప్రదర్శించబడిన ఈ కారు వివరాలు కూడా సేకరించి మీకు ఈ కథనం ద్వారా అందిస్తున్నాము. ఆటో ఎక్స్ పోలో మా కన్నులుగప్పి ప్రదర్శించిన దీని గురించి పూర్తి వివరాలు క్రింది గల స్లైడర్లలో దాగున్నాయి.

కారు వివరాలు
ఆడికు చెందిన ఈ ఎ-8 కారు ఎల్ సెక్యూరిటీ ఫీచర్లతో ఆటో ఎక్స్ పోలో కొలువుదీరింది. ప్రజల సందర్శనకు దూరంగా కేవలం దీనిని కొనగలిగే వారికి మాత్రమే అందుబాటులో ఉంచారు. ఏమిటి దీని ప్రత్యేకత అనుకుంటున్నారా ? ఇందులోని ప్రతి పార్ట్ కూడా అత్యంత భద్రత ప్రమాణాలతో తయారు చేయబడ్డాయి. దాదాపుగా అన్ని కూడా బుల్లెట్ ప్రూఫ్ ప్రమాణాలతో తయారయ్యాయి.

ధృడమైన నిర్మాణం
మీరు రోడ్ల మీద అప్పుడప్పుడు ఈ ఆడి ఎ-8 కారును చూసుంటారు. అయితే దానికి, దీనికి పెద్దగా తేడా ఉండదు. కాని స్టాల్‌లో రహస్యంగా ప్రదర్శించిన ఇందులో ఎల్-ఆధారిత భద్రత ఫీచర్లు ఉన్నాయి. కారు బాడీ మరియు చక్రాలను అర్మాటిక్ ఫైబర్ మరియు అల్యూమినియం అల్లాయ్ ద్వారా తయారు చేశారు. వీటి సమ్మేళనం ఎంత ధృడంగా ఉంటుంది అంటే ఏకే-47 కాల్పుల ద్వారా కూడా దీనికి ఏమీ కాదు. మరియు ఈ కారులో ఉపయోగించిన అన్ని అద్దాలు కూడా మామూలు మందం కన్నా ఆరు రెట్లు ఎక్కువ మందంతో తయారు చేశారు.

తయారీ
ఒక్క ఆడి ఎ-8 ఎ-సెక్యురిటీ కారును తయారు చేయడానికి దాదాపుగా 450 పని గంటలు పనిచేయాల్సి ఉంటుంది.

ఇంజన్
ఆడి తమ ఎ-8 ఎల్- సెక్యురిటీ కారులో 4.0-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్‌ను కలిగి ఉంది.

పవర్
ఇందులోని 4.0-లీటర్ ఇంజన్ దాదాపుగా 429 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులోని సహజసిద్దమైన డబ్ల్యూ8 ఇంజన్ దాదాపుగా 493 బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సులభంగా తప్పించుకునే అవకాశం
ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏవిధమైన అత్యవసర పరిస్థితులు ఎదురైతే సులభంగా ప్రత్యేతకమైన దారులను నుండి తప్పించుకునేందుకు ఆధునిక రూట్ మ్యాప్‌ను ఇందులో కల్పించారు. అంతే కాకుండా సీటుకు ప్రక్క వైపుల మైకు మరియు స్పీకర్‌ను కల్పించారు. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు వీటి ద్వారా దగ్గరలోని పోలీసులకు సమాచారం చేరవేయవచ్చు.

డోర్లు తెరుచుకునే ప్రత్యేక టెక్నాలజీ
కారు ఒకవేళ ప్రమాదానికి గురైతే కారు మొత్తం డ్యామేజ్ అయినపుడు ఎట్టి పరిస్తులలో కూడా కారు తలుపులు తెరుచుకోవు. కాని కారులో ఉన్నవారు మాత్రమే వీటిని తెరవగలిగే విధంగా ఏర్పాట్లు చేశారు. కారు తెరుచుకునే ప్రదేశంలో ప్రేలుడు పదార్థాలను ఉంచుతారు. ప్యాసింజర్ కారులో గల బటన్ ప్రెస్ చేయడం ద్వారా లాక్ బ్లాస్ట్ అయ్యి తలుపు తెరుచుకుంటుంది. అంటే ఇది ఎంతో సేఫ్ అన్నమాట.

టైర్లు
ఈ కారులో 19-అంగుళాల చక్రాలను అందించారు. వీటికి మిచేలియన్ టైర్ల సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన టైర్లను కల్పించారు. వీటి రిమ్‌లకు పాలిమర్ తొడుగులు వేశారు, తద్వరా గాలి లీక్ అవ్వడం అనే వాటికి ఏ మాత్రం చోటులేదు. పంక్ఛర్లు, టైరు పేలడం అనే సమస్యలు ఇందులో ఏ మాత్రం ఉండదు.

అగ్నిమాపక పరికరాలు
కారు లోపల అగ్నిని ఆర్పివేసే పరికరాలు, అత్యవసర సమయంలో తాజా గాలిని అందించే వ్యవస్థ మరియు అత్యవసర సమయంలో బయటకు వెళ్లిపోయే అవకాశం కల్పించారు.

ధర
ఈ బాలిస్టిక్ ఆడి ఎ-8 ఎల్-ఫీచర్ సెక్యురిటీ కారు ధర రూ. 9.15 కోట్లు ఎక్స్ షోరూమ్ , (ఢిల్లీ)గా ఉంది.

విఐపి కారు
నిజమే ఇది విఐపిలకు ఎంతో అవసరం. శత్రువుల నుండి ప్రాణ హాని ఉన్న ప్రముఖలు, రాజకీయ మరియు వ్యాపార వేత్తలు ఈ కార్లను వినియోగించడం ద్వారా వారి ప్రాణానికి ఎటువంటి ముప్పువాటిళ్లదు.

- ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భయంకరమైన ఎయిర్ పోర్ట్ రన్‌వేలు
- టైటానిక్-1 షిప్ గురించి మరిచిపోండి, ఎందుకంటే టైటానిక్-2 అతి త్వరలో వస్తోంది.


Click it and Unblock the Notifications








