హ్యుందాయ్, మారుతి మహీంద్రా బాటలోనే ఆడి

ఆడి ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది.

By Anil

దేశీయంగా పాత పెద్ద నోట్ల రద్దు మరియు క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు ఇయర్ ఎండ్ (సంవత్సరాంతం) వంటి కారణాల చేత ఇప్పటికే ఎన్నో కార్ల తయారీ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్ల మార్గంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా అదే బాట పట్టింది. ఆడి నవంబర్ 2016 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే వ్యతిరేక వృద్ది నమోదైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫర్ల ద్వారా వీలైనన్ని విక్రయాలు జరపాలని ఆడి ప్లాన్ చేసింది.

ఆడి ఇండియా ఆఫర్లు

నోట్ల రద్దు ద్వారా కోల్పోయిన అమ్మకాలను తిరిగి సాధించడానికి ఆడి ఇండియా తమ లైనప్‌లో ఉన్న ఉత్పత్తుల మీద గరిష్టంగా రూ. 7 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.

ఆడి ఇండియా ఆఫర్లు

ఆడి లోని ఏ3, ఏ4, ఏ6, క్యూ3 మరియు క్యూ7 వేరియంట్ల మీద ఆఫర్లను ప్రకటించింది. వీటిన్నింటి మీద వేరియంట్‌ను బట్టి రెండు నుండి ఏడు లక్షల రుపాయల వరకు డిస్కౌంట్లు ఉన్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది.

ఆడి ఇండియా ఆఫర్లు

ఆడి లైనప్‌లో ఉన్న ఏ3 వేరియంట్ రూ. 35.30 లక్షల ధరతో అందుబాటులో ఉంది. దీని మీద గరిష్టంగా రూ. 5 లక్షల రుపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది.

ఆడి ఇండియా ఆఫర్లు

అదే విధంగా ఆడి ఏ4 ధర రూ. 44.83 లక్షలుగా ఉండేది అయితే క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ తర్వాత దీని ధర రూ. 37.83 లక్షలుగా ఉంది.

ఆడి ఇండియా ఆఫర్లు

ఆడి లోని హై ఎండ్ మోడల్స్ అయిన ఏ6 మరియు క్యూ3 ల మీద క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ల తరువాత వీటి ధరలు వరుసగా రూ. 5358 లక్షలు మరియు రూ. 33.87 లక్షలుగా ఉన్నాయి.

ఆడి ఇండియా ఆఫర్లు

ఆడి ఇండియాలోని టాప్ ఎండ్ మోడల్ ఆడి క్యూ7 మీద గరిష్టంగా రెండు లక్షల రుపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆఫర్ అమలు చేసిన తరువాత దీని ధర రూ. 75.98 లక్షలుగా ఉంది.

ఆడి ఇండియా ఆఫర్లు

నోట్ల ద్వారా జరిగే చెల్లింపులు ఆగిపోవడంతో అమ్మకాలను పెంచుకునేందుకు ఆడి తమ కస్టమర్లకు జీరో డౌన్ పేమెంట్ మరియు ఆరు నెలల పాటు నెలసరి వాయిదా రహిత ఆఫర్‌ను అందిస్తోంది.

ఆడి ఇండియా ఆఫర్లు
  • వేడిని రాజేస్తున్న మారుతి సుజుకి
  • ఒక్కసారిగా నుజ్జునుజ్జయిన 120 BMW కార్లు: వీడియో

More from DriveSpark

Article Published On: Wednesday, December 7, 2016, 13:34 [IST]
English summary
Audi India Announces Discount Offers To Beat The Cash Crunch
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+