అద్దెకు ఆడి కార్లు: గంటకు రూ. 5,000 /- మాత్రమే
ఎకో రెంట్ కార్ అనేది కార్లను అద్దెకు ఇచ్చే అతి పెద్ద సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ ఆడికి చెందిన ఆర్8 వి10 ప్లస్ కారును అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపింది.
సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మీరు కోరిన ప్రదేశాలకు లగ్జరీ కార్లలో వెళ్లాలనుకుంటున్నారా ? ఇంతటితో మీ ప్రయత్నాలు అపేయండి ఎందుకంటే లగ్జరీ కార్లను అద్దెకు ఇచ్చే సంస్థ దొరికిపోయింది. ఆడికు చెందిన ఆర్8 వి10 కారు గంటకు 5000 రుపాయల అద్దెతో అందుబాటులో ఉంది. పది కిలోమీటర్ల తరువాత తిరిగే ప్రతి కిలోమీటర్‌కు 300 రుపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదండోయ్ కారును తీసుకుల్లేముందు పూచికత్తుగా రెండు లక్షల రుపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: టాప్-10 లో ఐదు స్థానాలలో మారుతి సుజుకి కార్లు
ఎకో రెంట్ సంస్థ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2500 కార్లను అద్దెకు తిప్పుతున్నారు. ఇండియన్ లగ్జరీ కార్ మార్కెట్లో 2015 నుండి 2018 వరకు ప్రతి ఏడాది కూడా ఆదాయంలో 15 శాతం వృద్ది నమోదు అవుతుందని ఎకో రెంట్ సంస్థ ఎమ్‌డి మరియు సిఈఓ ఆదిత్యా ల్యాంబు తెలిపారు .



Click it and Unblock the Notifications






















