ఇటు వైపు కోహ్లి అటు వైపు ఆలియా భట్ మరి అనుష్క ఎటువైపు...?
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అనుష్క శర్మ రాంరాం చెప్పిందని ఈ మధ్య కాలంలో చాలా రూమర్లు పుట్టుకొచ్చాయి. అది ఎంత వరకు నిజమనేది ఆయనకే తెలియాలి. అయితే ఈ టెస్ట్ కెప్టెన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో తాజాగా జరిగిన 2016 ఆటో ఎక్స్ పోలో ఎంట్రీ ఇచ్చిన ఆడి ఆర్8 వి10 ప్లస్ కారు ప్రదర్శనలో జంటగా పాల్గొన్నారు. ఈ కారుకు చెందిన ఫోటోల కోసం క్రింద గల ఫోటో మీద క్లిక్ చేయండి.

ఆడి ఆర్8 వి10 ప్లస్ కారు సాంకేతిక వివరాలు:
ఇంజన్: 5.2-లీటర్
రకము: వి10
పవర్: 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 602బిహెచ్‌పి పవర్
టార్క్: 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 560 ఎన్ఎమ్ టార్క్
0-100 కిమీ వేగం: 3.2 సెకండ్ల కాలంలోనే
అత్యధిక వేగం: గంటకు 330 కిలోమీటర్లు
క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఆడి ఆర్8 వి10 ప్లస్ లోని అన్ని చక్రాలకు పవర్ అందుతుంది. ఇందుకోసం దీనిలో 7-స్పీడ్ ఎస్-ట్రోనిక్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అందించారు.
Also Read: హ్యుందాయ్ హెచ్‌ఎన్‌డి-10 కాన్సెప్ట్ ఎస్‌యువి
డిజైన్ శైలి:
ఆడి ఆర్8 వి10 కారును పదునైన కోణీయ ఆకారంలో తయారు చేశారు. ఇప్పటికే ఆర్8 విడుదలైన ఆర్ 8 కారుతో పోల్చితే వి10 కారు ముందు వైపు చక్కటి గ్రిల్ మరియు ఎయిర్ ఇంటేక్‌ను చక్కగా డిజైన్ చేశారు. ఇక ఇందులో వినియోగించిన సరికొత్త ఎల్‌ఇడి హెడ్ ల్యాంప్స్ లేజర్ టెక్నాలజీ దీనికి మరింత షార్ప్ లుక్‌ను తీసుకువచ్చింది.
Also Read: భారతీయ మార్కెట్లోకి మరొక బెస్ట్ టూవీలర్: బెనెల్లీ టొరాండో 302
అందుబాటులోకి :
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గల ఆడి షోరూమ్‌లలో ఆర్8 వి10 కారుకు చెందిన బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. మరియు ప్రస్తుతం ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన నిస్సాన్ జిటి-ఆర్ మరియు మెర్సిడెస్ ఎఎమ్జి జిటిస్, పోర్షే 911 టుర్బో వంటి కార్లకు తీవ్రపోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications



























