రూ. 2.55 కోట్ల ప్రారంభం ధరతో విడుదలైన ఆడి ఆర్8 వి10 ప్లస్

By Anil

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి, ఇండియా విభాగం ముంబాయ్‌లో తమ ఆర్8 వి10 ప్లస్ కారును విడుదల చేసింది. మొదటి సారిగా దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు. ఆడి ఆర్8 వి10 ప్లస్ ప్రారంభ ధర రూ. 2.55 కోట్లు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ప్రకటించారు.

ఆడి ఆర్8 వి10 ప్లస్

ఆడి సంస్థ అత్యంత శక్తివంతమైన ఈ ఆర్8 వి10 ప్లస్ కారులో 5.2-లీటర్ సామర్థ్యం ఉన్న వి10 ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 602 బిహెచ్‌పి పవర్ మరియు 560ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్‌ను నాలుగు చక్రాలకు సరఫరా చేస్తుంది.
Also Read: పుతిన్ ఆవిష్కరించిన ఈ విమానం 2 గడియల్లో భూమ్మీద ఏ మూలకైనా చేరుకోగలదు
ఆడి ఆర్8 వి10 విడుదల సందర్బంగా ఆడి ఇండియా ముఖ్య అధికారి జోయ్ కింగ్ మాట్లాడుతూ, మునుపటి మోడల్ కన్నా ఇది మరింత స్పోర్టివ్‌గా ఉంటుంది మరియు దీనిని డిజైన్ పరంగా ఆడి ఆర్8 తర్వాత తరానికి చెందినదిగా సంభోదించవచ్చని తెలిపాడు. ఇది ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ రెండింటిలోనూ అత్యంత శక్తివంతమైన పనితీరును కనబరుస్తుందని తెలిపాడు.
Also Read: మహీంద్రా వాహనాలు మరీ ఇంత చీపుగానా...
ఇందులో వినియోగించిన సుమారుగా 50 శాతం వరకు విడి భాగాలను ఆర్8 నుండి సేకరించినవే. త్వరలో తర్వాత తరానికి చెందిన ఆడి ఆర్8 వి10 ప్లస్‌ను కూడా అభివృద్ది చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది రోజూ అవసరాలకు ఎంతో చక్కగా ఉంటుంది.
ఆడి ఆర్8 వి10 ప్లస్ ను సూచించే కొన్ని ఫోటోలు
Article Published On: Wednesday, July 20, 2016, 9:00 [IST]
English summary
New Audi R8 V10 Plus Launched In Mumbai For Rs. 2.55 Crore
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+