నార్వే రాజు కోసం ప్రత్యేకంగా పొడవైన ఆడి ఏ8ఎల్
ఆడి అనగానే ముందుగు గుర్తు వచ్చేది, లగ్జరీ బ్రాండ్‌కు మారు పేరు అయితే ఈ ఆడి సంస్థ ఒక ప్రత్యేక కారును అది కూడా ప్రత్యేక రూపంలో అందులోను కేవలం ఒక్క కారును ఒక్క వ్యక్తి కోసమే ఉత్పత్తి చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద బ్రాండ్ సంస్థగా విస్తిరించిన ఆడికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ? అతనెవరే నార్వే కింగ్ అట కేవలం అతని కోసం మాత్రమే ఈ కారును తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఆడి ఉత్పత్తి చేస్తున్న అరుదైన కారు మరియు నార్వే రాజు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

యూరప్‌లో భాగంగా ఉన్న నార్వే అత్భుమైన దేశం, ఈ దేశానికి రాజుగా ఉన్న ఐదవ హరాల్డ్ కోసం ఆడి నుండి ప్రత్యేకంగావిస్తరించబడిన ఆడి ఏ8ఎల్ కారును తయారు చేయిస్తున్నారు.

కారు మోడల్
నార్వే రాజు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఆడి ఏ8ఎల్ కారు ఆరు డోర్లను కలిగి ఉంటుంది.

సౌకర్యవంతమైన కారుకు మారుపేరుగా తయారవుతున్న ఈ కారు సుమారుగా 6.36 మీటర్లు పొడవు కలదు.

సాధారణ ఆడి ఏ8ఎల్ (5.27 మీటర్ల పొడవు) కన్నా 1.09 మీటర్లు ఎక్కువగా ఉంటుంది ఈ ప్రత్యేక ఆడి ఏ8ఎల్ కారు పొడవు.

అంతే కాకుండా సాధారణం ఆడి ఏ8ఎల్ కారు యొక్క వీల్ బేస్ కన్నా ఎక్కువగా 4.22 మీటర్లుగా ఉంది.

ఇందులో ప్రయాణిస్తున్నపుడు చీకటిని తరిమివేయడానికి దీని రూఫ్ పైన సుమారు 2.40 మీటర్లు చొప్పున పొడవాటి గ్లాస్ ప్యానెల్ కలదు, తద్వారా ఎక్కువ శాతం కాంతి లోపలికి అందుతుంది.

ఈ పొడవాడి ఆడి ఏ8ఎల్ కారులో మూడు వరుసలలో ఆరు మంది ప్రయాణించే వీలుగా ఆరు సీట్లు కలవు.

రెండవ మరియు మూడవ వరుసలో ఫోల్డింగ్ సీట్లు కలవు మరియు ఇందులోని సీట్లు అన్ని కూడా బీజి వాల్కోనా రంగులో ఉన్న లెథర్‌తో తయారయ్యాయి.

మూడవ వరుసలో ప్రయాణించే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కనుమరుగు కాకుండా ప్రత్యేకమైన డిస్ల్పే కలదు మరియు రిఫ్రిజిరేటెడ్ స్టోరేజ్ బాక్స్‌లు కూడా కలవు.

విస్తారమైన పొడవులో రూపొందుతున్న ఆడి ఏ8ఎల్ కారులో 3.0-లీటర్ కెపాసిటి గల సూపర్ ఛార్జ్‌డ్ వి6 ఇంజన్‌ను అందిస్తున్నారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 306 బిహెచ్‌పి పవర్ మరియు 440 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ అరుదైన ఆడి ఏ8ఎల్ లగ్జరీ కారు కేవలం 7.1 సెకండ్ల కాలవ్యవధిలోనే పుంజుకుంటుంది.

ఈ లగ్జరీ కారులోని ఇంజన్ ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి సహాయపడుతుంది.

పొడవైన ఆడి ఏ8ఎల్ కారు బరువు సుమారుగా 2.41 టన్నులుగా ఉంది

ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ కోసం ఆడి ఎస్8 కారులోని బ్రేకింగ్ వ్యవస్థను వినియోగించారు.

ఇంతకీ ఈ కారును నార్వే కింగ్ హరాల్డ్‌కు ఎందుకు ఇస్తున్నారో తెలుసా ? నార్వే దేశాన్ని 25 సంవత్సరాల పాటు పాలించినందుకు గాను గుర్తుగా దీనిని ఆ దేశ రాజుకు అందిస్తున్నారు.

అత్యంత విలాసవంతమైన లగ్జరీ కారు: విమాన వసతులను తలదన్నే రీతులో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన లగ్జరీ హెలికాప్టర్ల గురించి


Click it and Unblock the Notifications