ఆ పోలీసుకి ఏకంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారు
ఆస్ట్రేలియాలోని పోలీస్ సాదా సీదా కారు కాకుండా ఏకంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 నే కొనుగోలు చేసాడు. ఇందులో గొప్పేముంది అనకుంటున్నారా ? మన ఇండియాలో ఇలాంటి కారు ప్రస్తుతానికి సచిన్ వద్ద మాత్రమే ఉంది.
ఆస్ట్రేలియాలోని పోలీస్ సాదా సీదా కారు కాకుండా ఏకంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 నే కొనుగోలు చేసాడు. మన ఇండియాలో దీనిని కొనాలంటే కోటీశ్వరులైనా కాస్త ఆలోచిస్తారు. ఇక మన పోలీసులకైతే అలాంటి కారు ఉంటుందా అన్న ప్రశ్న మదిలో మెదలడం కూడా కష్టమే.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోలీసుల్లో దుబాయ్ పోలీసులు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారు. కనీసం వారు విధులు నిర్వర్తించడానికి కూడా లగ్జరీ కార్లనే వినియోగారు, ఇది దుబాయ్ పోలీసుల తీరు. అయితే వీరి సరసన ఇప్పుడు ఆస్ట్రేలియా పోలీసులు కూడా చేరిపోయారు.

అవును ఆస్ట్రేలియాలోని ఓ పోలీసు అధికారి ఏకంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారునే కొనుగోలు చేశాడు. మన ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి కారు సచిన్ టెండూల్కర్ వద్ద మాత్రమే ఉంది.

అత్యంత అరుదైన కారును ఓ పోలీసు కొనుగోలు చేయడం కాస్త గొప్ప విషయమే కదా.. పోలీసుల వాహన శ్రేణలోకి ఆడి ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ ను ఎంచుకున్న తరువాత ఈ బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారును ఎంచుకున్నారు. ప్రస్తుతం దీనిని రోస్ బే అనే ప్రాంతీయ పోలీస్ అధికారి ఉపయోగిస్తున్నాడు.

చూడటానికి ఇది పోలీసు కారులా ఉండకపోవచ్చు. అయితే ప్రాంతీయంగా ఉండే స్థానికులకు మరియు పోలీసులకు మధ్య సత్సంభందమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ కారును కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు తెలిపాడు.

ఇది పోలీసు కారు అని ప్రజలు గుర్తించేందుకు నీలం మరియు తెలుపు గళ్లతో ఉన్న స్టిక్కరింగ్, ప్రత్యేకాకర్షణగా పసువు రంగు స్టిక్కరింగ్ మరియు పోలీస్ సైరన్ ను ఇందులో అమర్చుకున్నాడు.

సాధారణంగా ప్రజలు పోలీసులతో ముచ్చటించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఈ కారును కొనుగోలు చేసిన తరువాత ఈ కారు గురించి పోలీసుల వద్ద ఆరా తీయడం మొదలుపెట్టారంట.

- పబ్లిక్ బస్ డ్రైవర్ వద్ద ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు
- లీటర్ కు 42 కిమీల మైలేజ్: ఇవి పాటిస్తే మీ కారు కూడా ఇస్తుంది
- మీరు డ్రైవింగ్ చేసే విధానం మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందా..?


Click it and Unblock the Notifications








