ఫిబ్రవరి 3, నుండి ప్రారంభం కానున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో
దేశవ్యాప్తంగా జరిగే అతి పెద్ద వాహన ప్రదర్శన ఇండియన్ ఆటో ఎక్స్ పో. ఈ ఇండియన్ ఆటో ఎక్స్ పో కు 2016 సంవత్సరం వేదిక కానుంది. అవును కేవలం మరో నెల కాలంలో ఈ షో ప్రారభం కానుంది. ఇక్కడ వివిధ రకాల వాహన తయారీ సంస్థలు వారి నూతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అయితే డ్రైవ్‌స్పార్క్ గత నాలుగు సంవత్సరాల కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా గల వాహన సమాచారాన్ని తెలుగులో అందిస్తోంది.
2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో జరిగే ప్రదర్శనలను పాఠకుల కోసం అందివ్వడానికి ఇప్పటికే డ్రైవ్‌స్పార్క్ టీం మొత్తం సన్నద్దం అయ్యింది. అక్కడ జరిగే ప్రతి ప్రదర్శన గురించి కూడా డ్రైవ్‌స్పార్క్ మీకు తెలుగులో అందిస్తుంది. ఫిబ్రవరి 3 వ తేదీ నుండి ఈ షో ప్రారంభ కానుంది అంతవరకు తెలుగు డ్రైవ్‌స్పార్క్ తో కలిసి ఉండండి.
అయితే 2016 ఎక్స్ పోలో ప్రదర్శనకు వేచి కొన్ని ముఖ్యమైన వాహనాల గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

మారుతి సుజుకి వితారా బ్రిజా
మారుతి సుజుకి ఈ ఆటో ఎక్స్ పో వేదిక మీద కొన్ని నూతన కార్లను పరిచయం చేయనుంది. అందులో మారుతి సుజుకి వారి వైబిఎ ఎస్‌యువి కారు. దీనికి వితారా బ్రిజా అని కూడా పేరు పెట్టారు.

మారుతి సుజుకి ఆల్టో ఫేస్ లిఫ్ట్
దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాగిస్తున్న ఏకైక కారు ఆల్టో కారు. అత్యంత ఆదరణ పొందిన ఈ కారును మారుతి సుజుకి వారు ఫేస్ లిఫ్ట్ మోడల్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిని కూడా 2016 ఇండియన్ ఆటో లో ప్రదర్శించనున్నారు.

ఇగ్నిస్ క్రాసోవర్
క్రాసోవర్ రంగంలో కూడా మారుతి సుజుకి కాలు మోపింది. తమ సరికొత్త ఇగ్నిస్ క్రాసోవర్ కారును ఇంతకు ముందు జరిగిన టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడింది. దీనిని ఇప్పుడు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో నిలయంగా ప్రదర్శించనుంది.

ఫోర్డ్ మస్టాంగ్
ఫోర్డ్ మోటార్స్ వారు మస్టాంగ్ మస్కల్ కారును భారతీయ మార్కెట్లోకి అతి త్వరలో విడుదల చేయనున్నారు. ఇది ఢిల్లీ వాహన ప్రగదర్శనలో మెరవనుంది. ఇందులో 5-లీటర్ వి8 లేదా 2.3-లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

హోండా బిఆర్-వి
హోండా మోటార్స్ వారు ప్రస్తుతం ఒక్క ఎస్‌యువి కారును మాత్రమే అందుబాటులో ఉంచింది. దీనికి అదనంగా హోండా మోటార్స్ వారు ఈ ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త బిఆర్-వి ని పరిచయం చేయనున్నారు. దీనిని ఇప్పటికే ఇండోనేషియాలో విడుదల చేశారు.

హోండా జాజ్ ఆర్‌ఎస్
హోండా మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి జాజ్ కారును విడుదల చేసి ఆరు నెలల కావస్తోంది. అయితే జాజ్ మోడల్ కారును ఆర్‌ఎస్ బ్యాడ్జితో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిని ఎక్స్ పోలో ప్రదర్శించనుంది.

డాట్సన్ గో
డాట్సన్ మోటార్స్ వారు, సబ్-కాంపాక్ట్ ఎస్‌యువీ వేదిక ఆధారంగా రూపొందించిన డాట్సన్ గో కారును విడుదల చేయనున్నారు. ఇది రెనో వారి క్విడ్ కారుకు సరాసరి పోటిగా నిలిచింది. ఈ రెండింటి ధర కూడా దాదాపుగా సమానంగా ఉంటుంది.

రెనో డస్టర్
రెనో మోటార్స్ వారికి బాగా గుర్తింపును తీసుకువచ్చిన మోడల్ ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది రెనో డస్టర్. అందుకోసమే రెనో మోటార్స్ వారు తమ డస్టర్ కారును కొత్త మార్పులతో ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించనున్నారు. ఇది ఎయమ్‌టి ఆప్షన్‌లో రానుండటం మరో ప్రత్యేకత.

బెనెల్లీ
ఇటలీకి చెందిన బెనెల్లీ టూ వీలర్స్ సంస్థ 2016 లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పో కోసం పెద్ద పథకమే వేశారు. విసృతంగా వారి టూ వీలర్లను ఇందులో ప్రదర్శించనున్నారు.

ట్రయంప్
బ్రటీష్ కు చెందిన టూ వీలర్ తయారీదారులు ట్రయంప్ మోటార్ సైకిల్స్ వారు 2015 ఎకిమాలో జరిగిన మోటార్ షోలో విసృత శ్రేణి టూ వీలర్లను ప్రదర్శించారు. అయితే 2016 ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించడానికి సిద్దమైపోయింది.

యుఎమ్ మోటార్ సైకిల్స్
యుఎమ్ మోటార్ సైకిల్స్ వారు దేశీయంగా మొదటిసారిగా ద్విచక్రవాహనాలను ప్రవేశపెడుతున్నారు. దీని కోసం 2016 ఢిల్లీ ఎక్స్ పో ను వేదికగా చేసుకోనున్నారు. అయితే వీరు కూడా తమ విసృత స్థాయి ద్విచక్రవాహనాలను మనకు పరిచయం చేయబోతున్నారు.

2016 ఫిబ్రవరిలో జరగే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడే అన్ని వాహనాలకు చెందిన సమాచారం డ్రైవ్‌స్పార్క్ తెలుగులో అందిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా డ్రైవ్ స్పార్క్‌ను అనుకరించండి. మరియు మీ ఇ-మెయిల్ ను క్రింద గల బాక్స్ లో ఎంటర్ చేసి వాహనాలకు చెందిన తాజా సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








