ఇండియన్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆటోమేటిక్ కార్లు
ఇండియాలో ఏ నగరాన్ని పరిశీలించినా రద్దీ అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అందుకోసం కార్లను కోనుగోలు చేసే వారు ఎక్కువగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లను ఎంచుకుంటున్నారు. గత రెండు సంత్సరాల నుండి చూస్తే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్ల అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ తరుణంలో మీరు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ క్రింది కథనంలో ఆటోమేటిక్ కార్లను ఓసారి గమనించండి...

టాటా నానో
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కార్లలో టాటా నానో ఒకటి. టాటా నానోలో రెండు రకాల ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. అవి ఎక్స్ఎమ్‌ఎ మరియు ఎక్స్‌టిఎ వీటి ధరలు వరుసగా 2.80 మరియు 3.0 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

ఇంజన్ మరియు ఇతర వివరాలు
నానో ఆటోమేటిక్ వేరియంట్లో 624 సీసీ సామర్థ్యం ఉన్న రెండు సిలిండర్ల ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 38 బిహెచ్‌పి పవర్ మరియు 51 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ టాటా నానోలో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

మారుతి ఆల్టో కె10 ఆటోగేర్‌షిఫ్ట్
మారుతి వారి ఆల్టో కె10 ఆటోగేర్‌షిఫ్ట్ కారు రెండవ అతి చౌకైన ఆటోమేటిక్ కారు. ఏఎమ్‌టి లో విఎక్స్‌ఐ అనే వేరియంట్ అందుబాటులో ఉంది. ఆల్టో కె10 ఆటోమేటిక్ ధర రూ. 4.87 లక్షలు అన్ రోడ్ (హైదరాబాద్)గా ఉంది.

ఆల్టో కె10 ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
మారుతి సుజుకి ఈ ఆల్టో కె10 ఆటోమేటిక్‌లో 1.0 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏజిఎస్
ఇండియన్ మార్కెట్లోకి ఎక్కువగా ఆటోమేటిక్ కార్లను అందిస్తున్న సంస్థగా మారుతి సుజుకి నిలిచింది. ఈ సంస్థకు మాగ్నెట్టీ మారెల్లీ అనే సంస్థ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను సరఫరా చేస్తోంది. మారుతి వారి వ్యాగన్ఆర్ ఏజిఎస్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి విఎక్స్ఐ ఎజిఎస్ మరియు విఎక్స్ఐ ఆప్షన్ ఏజిఎస్. వీటి ధరలు వరుసగా 5.76 మరియు 6.14 లక్షలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.

ఇంజన్ మరియు ఇతర వివరాలు
మారుతి ఈ వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి లో 1.0 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇదే ఇంజన్‍ను ఆల్టో కె10 మరియు సెలెరియో వంటి కార్లలో కూడా అందించారు. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

మారుతి సెలెరియో ఆటోమేటిక్
మారుతి వారి మరొక ఆటోమేటిక్ కారు సెలెరియో ఆటోమేటిక్,
ఎల్ఎక్స్ఐ ఆటోమేటిక్ ధర రూ. 5.65
విఎక్స్ఐ ఆటేమేటిక్ ధర రూ. 5.68
జడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ ధర రూ. 6.03

ఇంజన్ మరియు ఇతర వివరాలు
సెలెరియో ఆటోమేటిక్ లో 1000సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంది సుమారుగా 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో ఆటోమేటిక్ లోని ఇంజన్‌ను 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
మార్చి 2016 లో హ్యుందాయ్ మోటార్స్ వారు గ్రాండ్ ఐ10 కారును రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్లలో పరిచయం చేశారు. అవి మ్యాగ్నా ఏటి మరియు ఆస్టా (ఒ) ఏటి. వీటి ధరలు వరుసగా 6.98 మరియు 8.00 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉన్నాయి.

ఇంజన్ మరియు ఇతర వివరాలు
హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 లో ఉన్న ఈ రెండు ఆటోమేటిక్ వేరియంట్లలో కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి 4-స్పీడ్ కన్వెన్షల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇందులోని ఇంజన్ సుమారుగా 82 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హోండా బ్రియో
హోండా మోటార్స్ చిన్న కార్ల సెగ్మెంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను పరిచయం చేసిన మొదటి కారు బ్రియో. హోండా బ్రియో లోని రెండు వేరియంట్లో ఆటోమేటిక్‌ను అందించారు. అవి బ్రియో విఎక్స్ ఏటి మరియు బ్రియో విఎక్స్(ఒ) ఏటి. వీటి ధరలు వరుసగా 7.65 మరియు 8.20 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉన్నాయి.

బ్రియో ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
బ్రియోలో అందుబాటులో ఉన్న రెండు ఆటోమేటిక్ వేరియంట్లలో 1.2 లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్‌ను అందించారు, వీటికి 5-స్పీడ్ ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది 87 బిహెచ్‌పి పవర్ మరియు 109 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్
నిస్సాన్ వారి మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా రెండు ఆటోమేటిక్ పేరియంట్లు ఉన్నాయి. అవి ఎక్స్ఎల సివిటి మరియు ఎక్స్‌వి సివిటి. వీటి ధరలు వరుసగా 7.80 మరియు 8.57 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉన్నాయి.

మైక్రా ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ మరియు ఎక్స్‌వి ఆటోమేటిక్ వేరియంట్లలో 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు, ఇది గరష్టంగా 76 బిహెచ్‌పి పవర్ మరియు 104 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి బాలెనొ
ఇండియన్ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న రెండవ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనొ. ఇందులో కూడా మారుతి సుజుకి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది.బాలెనొలోని డెల్టా పెట్రోల్ మరియు జీటా పెట్రోల్ వేరియంట్లలో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ కలదు. వీటి ధరలు వరుసగా 8.27 మరియు 8.98 లక్షలు ఆన్ రోడ్ (హైజరాబాద్)గా ఉన్నాయి.
బాలెనొ ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు

బాలెనొ ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
బాలెనొలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉన్న రెండు వేరియంట్లలో కూడా 1.2 లీటర్ విటివిటి పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ ను అనుసంధానం చేసారు.

ఫోర్డ్ ఫిగో
ఉత్తమ డ్రైవింగ్ సౌలభ్యం మరియు శక్తివంతమైన ఇంజన్ గల ఫోర్డ్ ఫిగో కూడా ఆటోమేటిక్ వేరియంట్లో లభిస్తోంది. ఫోర్డ్ వారి ఫిగో లోని టైటానియమ్ వేరియంట్లో ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. దీని ఆన్ రోడ్ ధర రూ. 8.60 లక్షలు ఎక్స్ షోరూమ్ (హైదరాబాద్)గా ఉంది.

ఫోర్డ్ ఫిగో ఇంజన్ మరియు ఇతర వివరాలు
ఫోర్డ్ సంస్థ ఈ ఫిగో టైటానియమ్ ఆటోమేటిక్ వేరియంట్లో 1.5 లీటర్ టిఐ-విసిటి పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 110 బిహెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

హోండా జాజ్
హోండా మోటార్స్ జూలై 2015 లో ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. జాజ్ లోని ఎస్ మరియు వి అనే రెండు వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. వీటి ధరలు వరుసగా 8.56 మరియు 9.60 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉన్నాయి.

జాజ్ ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
ఇందులో 1.2 లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 89 బిహెచ్‌పి పవర్ మరియు 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో, మారుతివే ఏడు కార్లు...!!
గరిష్ట మైలేజ్ ఇవ్వగల పది డీజల్ ఎస్‌యువిలు
పాత ఇన్నోవాకి కొత్త ఇన్నోవాకి మధ్య తేడా ఏంటి...?


Click it and Unblock the Notifications








