స్పోర్టివ్ లక్షణాలు, కత్తెర డోర్లతో మోడిఫికేషన్‌కు గురైన మారుతి బాలెనో

సూపర్ కార్ తరహాలో మెరవడానికి మారుతి సుజుకి బాలెనోకు స్పోర్టివ్ లుక్ జోడింపుతో అదే విధంగా కత్తెర వంటి డోర్లతో మోడిఫికేషన్‌కు గురైంది.

By Anil

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఇండియన్ మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. ఒకానొక దశలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సైతం వెనక్కు నెట్టింది. ఎక్ట్సీరియర్ స్పోర్టివ్ లుక్‌తో మరియు ఇంటీరియర్ ప్రీమియమ్ ఫీచర్లతో మారుతి 2016 విపణిలోకి విడుదల చేసింది.

మారుతి సుజుకి బాలెనో

ప్రస్తుతం మారుతి లైనప్‌లో అత్యంత స్పోర్టివ్‌ లుక్‌ను సొంతం చేసుకున్నది బాలెనో మాత్రమే. అయితే ఇది మీరనుకున్నటువంటి స్పోర్టివ్ ఆకృతిలో లేదనుకుంటే బెంగళూరు ఆధారిత కార్ల కస్టమైజేషన్ సంస్థ ఎమ్.బి డిజైన్ మోటోట్రెండ్ వారు మోడిఫై చేసిన బాలెనో గురించి తెలుసుకోవాల్సిందే.

మారుతి సుజుకి బాలెనో

ఎక్ట్సీరియర్ పరంగా దీనికి నిర్వహించిన మోడిఫికేషన్ ఒకింత ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. క్రోమ్ తరహాలో మెరుస్తున్న బ్లాక్ సొబగులు, ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు రూఫ్ టాప్ వంటివి ముఖ్యంగా మోడిఫికేషన్‌కు గురయ్యాయి.

మారుతి సుజుకి బాలెనో

కారుకు ముందు వైపు ఆకృతిని మరింత స్పోర్టివ్ చేయడానికి ఫ్రంట్ బంపర్ మీద సమురాయ్ లిప్ ను అందించారు. దీని ద్వారా ఇది మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. బాలెనో ఎక్ట్సీరియర్ మీద ఉన్న మొత్తం ఎరుపు రంగు తయారీదారుని నుండి వచ్చింది. ఇందులో ఏ విధమైన మార్పులు జరగలేదు.

మారుతి సుజుకి బాలెనో

మోడిఫైడ్ బాలెనోలో ప్రధాన హైలైట్ ఏమిటంటే కత్తెర వంటి డోర్లను కలిగి ఉండటం. ముందు వైపున్న రెండు డోర్లకు సిజర్ మెకానిజమ్ అందించారు. దీని ద్వారా డోర్లను తెరిచినప్పుడు పైకి విచ్చుకుంటాయి. సాధారణంగా ఇలాంటి డోర్లను పాపులర్ ఇకానిక్ సూపర్ కార్ల తయారీ సంస్థ ల్యాంబోర్గిని కార్లలో గమనిస్తుంటాం.

మారుతి సుజుకి బాలెనో

మోడిఫికేషన్‌కు గురైందని స్పష్టం చేయడానికి కాబోలు, ఎక్ట్సీరియర్ మీద ఈ మోడిఫిషన్ సంస్థ ఎక్కువ దృష్టిపెట్టింది. అందుకోసం ప్యానరోమిక్ సన్‌రూఫ్ మరియు 17-అంగుళాల మల్టిస్పోక్ రిమ్ ను అందించింది.

మారుతి సుజుకి బాలెనో

ఎమ్.బి డిజైన్స్ వారి మోడిఫికేషన్ ప్రభావం ఈ బాలెనో ఇంటీరియర్ మీద కూడా పడింది. ఇందులోని స్టాక్ సీట్లకు బదులుగా బ్రిడ్ బకెట్ సీట్లను అందించింది. తద్వారా ఈ కారులో ప్రయాణిస్తున్నపుడు రేస్ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.

మారుతి సుజుకి బాలెనో

ఇవే కాకుండా ఇంటీరియర్ లోని డ్యాష్ బోర్డ్ మరియు అప్‌హోల్‌స్ట్రే మొత్తం ఎర్రటి రంగుని పులుముకుంది.

మారుతి సుజుకి బాలెనో

మోడిఫికేషన్ కోసం ఎమ్.బి డిజైన్స్ వినియోగించిన కారులో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి సివిటి ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

మారుతి సుజుకి బాలెనో

సాధారణ బాలెనోతో పోల్చితే డిజైన్ మరియు పనితీరు పరంగా దీనిని మరింత ప్రత్యేకం చేయడానికి డిజైన్ మార్పులతో పాటు సాంకేతికంగా కూడా స్వల్ప మార్పులు చేశారు.

మారుతి సుజుకి బాలెనో

కెఅండ్ఎన్ ఎయిర్ ఫిల్టర్ మరియు ఎఫ్ఆర్‌కె ఫ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ లను అందించారు. తద్వారా ఇది గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

మారుతి సుజుకి బాలెనో

  • రూ. 56,283 లకే బజాజ్ వి12 విడుదల
  • మార్కెట్లో సునామీ సృష్టించేందుకు ఎన్ఫీల్డ్ రహస్య ప్రణాళికలు
  • మారుతి సుజుకి బాలెనో

    తరువాత తరం కోసం తెర వెనుక డాసియా డస్టర్

    తరువాత తరం కోసం యూరోపియన్ కార్ల తయారీ సంస్థ డాసియా నూతన 2017 డస్టర్ ను అభివృద్ది చేస్తోంది. వచ్చే ఏడాది దీనిని ప్రపంచ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

Most Read Articles

English summary
This Blinged Up Baleno Is The Wildest Modified Car
Story first published: Saturday, December 31, 2016, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X