ఎలైట్ ఐ20 స్థానాన్ని ఆక్రమించిన మారుతి సుజుకి బాలెనొ

By Anil

హ్యుందాయ్ మోటార్స్ వారికి ప్రతి నెలా ఉత్తమ అమ్మకాల సాధించి పెట్టే ఎలైట్ ఐ20 కారుకు గట్టి పోటిగా వచ్చిన మారుతి సుజుకి ఇప్పుడు ఎలైట్ ఐ20 కారును విక్రయాల నుండి వెనక్కి నెట్టింది. గత డిసెంబర్ నెలలో 10,379 ఐ20 కార్ల విక్రయాలు జరగగా, ఈ మద్యనే వచ్చిన బాలొనొ ఏకంగా 10,572 విక్రయాలను నమోదు చేసుకుంది.

మనోళ్లు ఎలైట్ ఐ20 కారును కాదని బాలెనొ కారును ఎందుకు ఎంచుకున్నారు అంటారు? ఎలైట్ ఐ20 కారుకు యమదూతగా వచ్చిన బాలెనొ కారు గురించి మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో కలవు. వాటిని చూసిన తరువాత ఏ కారు ఉత్తతమమో మీరు నిర్ణయించుకోండి.

ఇంజన్ స్పెసిఫికేన్స్ :

ఇంజన్ స్పెసిఫికేన్స్ :

  • బాలెనొ డీజల్ వేరియంట్ యొక్క ఇంజన్ 1248సీసీ, 4-సిలిండర్స్ కలవు, ఇది 74బిహెచ్‌‌పి మరియు 192ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • బాలెనొ పెట్రోల్ వేరియంట్ యొక్క ఇంజన్ 1197సీసీ, నాలుగు సిలిండర్లు కలవు ఇది 83బిహెచ్‌పి మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  •  ట్రాన్స్‌మిషన్ :

    ట్రాన్స్‌మిషన్ :

    ఈ రెండు ఇంజన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు. అయితే బాలెనొ డెల్టా పెట్రోల్ వేరియంట్ కారులో కంటిన్యుయస్లి వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ (సివిటి) అవకాశం కలదు.

     మైలేజ్ :

    మైలేజ్ :

    బాలెనొ పెట్రోల్ వేరియంట్ లీటర్ కు 21.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరియు బాలెనొ డీజల్ వేరియంట్ లీటర్ కు 27.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    బాలెనొ పెట్రోల్ వేరియంట్స్ ధరలు :

    బాలెనొ పెట్రోల్ వేరియంట్స్ ధరలు :

    • సిగ్మా ధర రూ. 4.99 లక్షలు
    • డెల్టా ధర రూ. 5.71 లక్షలు
    • జీటా ధర రూ. 6.31 లక్షలు
    • ఆల్ఫా ధర రూ. 7.01 లక్షలు
    • సివిటి ధర రూ. 6.76 లక్షలు
    •  బాలెనొ డీజల్ వేరియంట్స్ ధరలు :

      బాలెనొ డీజల్ వేరియంట్స్ ధరలు :

      • సిగ్మా ధర రూ. 6.16 లక్షలు
      • డెల్టా ధర రూ. 6.81 లక్షలు
      • జీటా ధర రూ. 7.41 లక్షలు
      • ఆల్ఫా ధర రూ. 8.11 లక్షలు
      • గమనిక అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ)

         ఫీచర్స్ :

        ఫీచర్స్ :

        అల్లాయ్ వీల్స్

        నావిగేషన్ సిస్టమ్

        వాయిస్ కమాండ్

        ఆపిల్ కార్‌ప్లే

        యల్ఇడి లైట్లు గల డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్

        దీని యొక్క టాప్ ఎండ్ వేరియంట్లో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది.

        రంగులు :

        రంగులు :

        బాలెనొ లభించు రంగులు

        • రే బ్లూ
        • ఫైర్ సాలిడ్ రెడ్
        • బ్లూ ఆబర్న్ ప్రీమియమ్
        • ప్రీమియమ్ మెటాలిక్ సిల్వర్
        • ఆర్క్‌టిక్ వైట్ పియర్ల్
        • గ్రానైట్ గ్రే
        •  కొలతలు :

          కొలతలు :

          • బాలెనొ యొక్క పొడవు-3,995 ఎమ్ఎమ్
          • వెడల్పు-1745 ఎమ్ఎమ్
          • ఎత్తు-1500 ఎమ్ఎమ్
          • వీల్ బేస్-2,520 ఎమ్ఎమ్
          • గ్రౌండ్ క్లియరెన్స్-180 ఎమ్ఎమ్ కలదు
          •  పోటి :

            పోటి :

            మారుతి సుజుకి బాలెనొ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్, వోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు గట్టి పోటిని ఇస్తోంది.

            భద్రత :

            భద్రత :

            మారుతి సుజుకి భద్రత విషయంలో ఒక పెద్ద అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మారుతి సుజుకి బాలెనొకు చెందిన అన్ని వేరియంట్లలో యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబియస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లను అన్ని బాలెనొ మోడళ్లలో అందించింది.

            పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్:

            పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్:

            పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

             డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

            డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

            డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

            మైలేజ్:

            మైలేజ్:

            మైలేజ్ పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్ పెట్రోల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్ డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్ డీజిల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్

             ఎలైట్ ఐ20 పెట్రోల్ వేరియంట్ల ధరలు

            ఎలైట్ ఐ20 పెట్రోల్ వేరియంట్ల ధరలు

            • 1.2 కప్పా విటివిటి ఎరా ధర రూ. 5.36 లక్షలు
            • 1.2 కప్పా విటివిటి మ్యాగ్నా ధర రూ. 5.9 లక్షలు
            • 1.2 కప్పా విటివిటి స్పోర్ట్స్ ధర రూ. 6.41 లక్షలు
            • కప్పా డ్యూయల్ విటివిటి మ్యాన్యువల్ ధర రూ. 6.71 లక్షలు
            • 1.2 కప్పా విటివిటి స్పోర్ట్స్(0) ధర రూ. 6.77 లక్షలు
            • 1.2 కప్పా విటివిటి ఆస్టా ధర రూ. 7 లక్షలు
            • 1.2 కప్పా డ్యూయల్ విటివిటి ఆస్టా(0) ధర రూ 7.19 లక్షలు
            •  ఎలైట్ డీజల్ వేరియంట్ల ధరలు:

              ఎలైట్ డీజల్ వేరియంట్ల ధరలు:

              • 1.4 యూ2 సిఆర్‌డిఐ ఎరా ధర రూ. 6.48 లక్షలు
              • 1.4 యూ2 సిఆర్‌డిఐ మ్యాగ్నా ధర రూ. 7.02 లక్షలు
              • 1.4 యూ2 సిఆర్‌డిఐ స్పోర్ట్జ్ ధర రూ. 7.56 లక్షలు
              • 1.4 యూ2 సిఆర్‌డిఐ స్పోర్ట్జ్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 7.86 లక్షలు
              • 1.4 యూ2 సిఆర్‌డిఐ స్పోర్ట్జ్(0) ధర రూ. 7.89 లక్షలు
              • 1.4 యూ2 సిఆర్‌డిఐ ఆస్టా ధర రూ. 8.11 లక్షలు
              • 1.4 యూ2 సిఆర్‌డిఐ ఆస్టా (0) ధర రూ. 8.3 లక్షలు
              • అన్ని ధరలు ఎక్స్ షో రూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
              • ఫీచర్స్ :

                ఫీచర్స్ :

                కన్వీనెన్స్ ఫీచర్లు అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేటివ్ సూపర్‌విజన్ క్లస్టర్ (బహుళ సమాచారాన్ని అందించే ఇన్ఫోటైన్‌మెంట్), మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ అడాప్టివ్ పార్కింగ్ గైడ్‌లైన్స్ డిస్‌ప్లే, రియర్ ఏసి వెంట్స్, రియర్ పార్సిల్ ట్రే, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఆటో ఫోల్డబిల్ ఎలక్ట్రిక్ మిర్రర్, సన్‌గ్లాసెస్ హోల్డర్, మ్యాప్ పాకెట్స్, యూఎస్‌బి, ఆక్-ఇన్ పోర్ట్, డోర్ ఆర్మ్‌రెస్ట్స్, వన్ టచ్ సిగ్నల్ సిస్టమ్, రియర్ వైపర్ అండ్ వాషర్, టికెట్ హోల్డర్ వంటి కంఫర్ట్ ఫీచర్లు దీని సొంతం.

                 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 లభించు రంగులు

                హ్యుందాయ్ ఎలైట్ ఐ20 లభించు రంగులు

                • మైస్టిక్ బ్లూ,
                • స్టార్ డస్ట్
                • ప్రిస్టైన్ బ్లూ
                • రెడ్ ప్యాసన్
                • స్లీక్ సిల్వర్
                • మిడాస్ గోల్డ్
                • పోలార్ వైట్
                • పోటి :

                  పోటి :

                  ఎలైట్ ఐ20 కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనొ, హోండా జాజ్, మారుతి స్విఫ్ట్, వోక్స్‌వ్యాగన్ పోలో, ఫియట్ పుంటో వంటి కార్లకు పోటిని ఇవ్వగలదు.

                   భద్రత ఫీచర్లు

                  భద్రత ఫీచర్లు

                  • ఫ్రండ్ డ్రైవర్ అండ్ కోప్యాసింజర్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్),
                  • ఫాలోమి హెడ్‌ల్యాంప్స్ (కారు లాక్ చేసిన తర్వాత కూడా కొంత సమయం పాటు వెలుగుతూ ఉండే లైట్స్),
                  • రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్,
                  • రియర్ డిఫాగ్గర్
                  •  భద్రత ఫీచర్లు

                    భద్రత ఫీచర్లు

                    స్మార్ట్ పెడల్,

                    పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ,

                    యాంటీ పించ్ పవర్ విండోస్ (డ్రైవర్ సైడ్ విండోకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే, అద్దం ఆటోమేటిక్‌గా క్రిందికి వచ్చేస్తుంది),

                    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ (చీకటి పడగానే ఆన్ కావటం, వెలుగు రాగానే ఆఫ్ కావటం) వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

                    తీర్పు:

                    తీర్పు:

                    ప్రస్తుతం మార్కెట్లో బాలెనొ మంచి డిజైన్ గల కారుగా పేరు పొందింది. మారుతి సుజుకి వారు అందించిన అత్భుత డిజైన్‌లలో ఇది ఒకటి. ఎలైట్ ఐ20 కారు కూడా చక్కటి డిజైన్‍‌ను కలిగి ఉంది. అయితే బాలెనొ డిజైన్‌తో ఎలైట్ ఐ20 పోల్చినపుడు మా ఓటు బాలెనొ కి మరి మీ నిర్ణయం....

                    ఎలైట్ ఐ20 స్థానాన్ని ఆక్రమించిన మారుతి సుజుకి బాలెనొ
                    1. 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు
                    2. వాటి వివరాలుభారతీయ మార్కెట్లో టాప్-20 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే
                    3. టాటా "జికా" రివ్యూ: భారతీయ మార్కెట్లో ఒక అద్బుతం

Most Read Articles

English summary
Baleno Overtakes Elite i20 In Sales For December 2015
Story first published: Monday, January 25, 2016, 11:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X