2016 సంవత్సరానికి గాను బేస్ వేరియంట్లలో ఉన్న బెస్ట్ కార్లు

By Anil

కారు కొనాలనే కల ప్రస్తుత కాలంలో చాలా మందికే ఉంటుంది. ఏ కారు కొనాలి అని నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం, తరువాత ఆ ఆఫర్ ఈ ఆఫర్ అని కార్ల సంస్థలు మీ చేత ఏదోవిధంగా కొనుగోలు చేయించేస్తారు. కాని ప్రతి మోడల్‌లో కూడా బెస్ట్ వేరియంట్ ఏది అని చాలా మందికి తెలియక తికమక పడుతుంటారు, కారణం ఒక్క కారు విడుదల అయితే అందులో కోకొల్లలు వేరియంట్లను పరిచయం చేసయడం.

అందుకోసం ప్రతి మోడల్‌లో కూడా ఉన్న అన్ని వేరియంట్లలో ధర, డిజైన్, మైలేజ్, ఎక్కువ మంది ఎంచుకోవడం, కొనుగోలు చేసిన వారి కథనం ఆధారంగా వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి మోడల్‌లో ఉన్న బెస్ట్ వేరియంట్‌ను ఎంపిక చేయడం జరిగింది. తద్వారా ఏ వేరియంట్‌ను ఎంచుకోవాలి అనే ఆలోచన ఇంతటి తీరిపోతుంది. క్రింది స్లైడర్లలో బెస్ వేరియంట్లో ఉన్న బెస్ట్ కార్ల గురించి ఇవ్వడం జరిగింది.

చిన్న కార్లు

చిన్న కార్లు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చిన్న కార్ల సెగ్మెంట్లో మూడు కార్లు ఉత్తమంగా నిలిచాయి. అందులో మారుతి సుజుకి వారి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ మరియు రెనో క్విడ్. ఈ మూడు వీటికివే నిరంతరం గట్టి పోటిని ఎదుర్కొంటున్నాయి.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ వారి ఎంట్రీలెవల్ వేరియంట్ ఇయాన్. ప్రస్తుతం హ్యుందాయ్ వారి ఇయాన్ పనితీరు మరియు సంస్థ పేరుకు తగ్గట్టుగా మంచి ఫలితాలను కూడా సాధిస్తోంది.

మారుతి ఆల్టో 800

మారుతి ఆల్టో 800

మారుతి సుజుకి వారి బెస్ట్ సెల్లింగ్ కారు ఆల్టో 800 ఈ సెగ్మెంట్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా అతి ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న ఏకైక కారు ఆల్టో 800. దీనికి వెచ్చించే డబ్బుకు తగ్గట్టుగా ఉంటుంది ఈ కారు.

రెనో క్విడ్

రెనో క్విడ్

మారుతి సుజుకి ఆల్టో 800 ద్వారా సృష్టించుకున్న సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి అన్నట్లుగా వచ్చింది ఈ క్విడ్. అనతి కాలంలో విపరీతమైన అమ్మకాలు మరియు బుకింగ్స్ సాధించి ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలలో మరింత పోటిని రగిల్చింది.

ధరలు

ధరలు

  • మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్‌టిడి ధర రూ. 2.57 లక్షలు
  • హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ ధర రూ. 2.75 లక్షలు
  • రెనో క్విడ్ ఎస్‌టిడి ధర రూ. 2.62 లక్షలు
  • అన్ని ధరలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి

    చిన్న కార్లకు ఓవరాల్ రేటింగ్

    చిన్న కార్లకు ఓవరాల్ రేటింగ్

    • మారుతి సుజుకి ఆల్టో 800 (ఎస్‌‌టిడి) 7.5/10
    • హ్యుందాయ్ ఇయాన్ (డి-లైట్) 7/10
    • రెనో క్విడ్ (ఎస్‌టిడి) 8/10
    • కాంపాక్ట్ సెడాన్

      కాంపాక్ట్ సెడాన్

      చిన్న కార్ల సెగ్మెంట్ మాదిరిగానే కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లలో కూడా చాలా వరకు మోడల్ ఉన్నాయి. అందులో ఉన్న ముఖ్యమైన వాటిలో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, మరియు హ్యుందాయ్ జెంట్ వీటితో పాటు ఈ సెగ్మెంట్లో కొనుగోలు చేయడానికి టాటా జెస్ట్, ఫోర్ట్ ఆస్పైర్ మరియు త్వరలో విడుదల కానున్న వోక్స్ వ్యాగన్ అమియో, టాటా కైట్ సెడాన్ వంటి కార్లు ఎంతో బాగుంటాయి.

      మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

      మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

      మేము ఈ విభాగంలో మొదటిగా ఎంచుకున్న కారు స్విఫ్ట్ డిజైర్ మేమే కాదు దేశ వ్యాప్తంగా కాంపాక్ట్ సెడాన్‌లలో ఎక్కువ మంది భారతీయులు ఎంచుకుంటున్న కారు కూడా ఇదే. డిజైర్ ను ఎంచుకోవడానికి చక్కటి మైలేజ్, మంచి ధర, అత్బుతమైన రీసేల్ వ్యాల్యు వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.

      హోండా అమేజ్

      హోండా అమేజ్

      డిజైర్ కారుకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గట్టి పోటిగా నిలిచిన కార్లలో హోండా అమేజ్ ఒకటి. 2016 కు చెందిన హోండా అమేజ్ ఈ సెగ్మెంట్లో ఎంతో ఉత్తమమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో చక్కటి పనితీరును కనబరిచే నూతన ఇంజన్‌ను పరిచయం చేశారు. డిజైన్ పరంగా కూడా దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

      హ్యుందాయ్ జెంట్

      హ్యుందాయ్ జెంట్

      హ్యుందాయ్ మోటార్స్ వారు కాంపాక్ట్ సెడాన్‌ల మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన జెంట్‌లో అధిక ఇంటీరియర్ స్పేస్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అది కూడా తక్కువ ధరలో. ఈ సెగ్మెంట్లో తానేంటో నిరూపించుకోవడానికి ఇందులో కొన్ని అదనపు ఫీచర్లను కూడా అందిస్తున్నారు.

      ధర వివరాలు

      ధర వివరాలు

      • మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ (ఎల్‌ఎక్స్ఐ) ధర రూ. 5.23 లక్షలు
      • హోండా అమేజ్ (ఇ ఎమ్‌టి) ధర రూ. 5.30 లక్షలు
      • హ్యుందాయ్ జెంట్( బేస్) ధర రూ. 5.21 లక్షలు
      • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

         కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న కార్ల ఓవరాల్ రేటింగ్

        కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న కార్ల ఓవరాల్ రేటింగ్

        • మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ (ఎల్‌ఎక్స్ఐ) 8/10
        • హోండా అమేజ్ (ఇ ఎమ్‌టి) 7.5/10
        • హ్యుందాయ్ జెంట్( బేస్) 7/10
        • సెడాన్‌లు

          ప్రతి సెగ్మెంట్లో పోటి ఉన్నట్లుగా ఇందులో కూడా భారీ పోటి ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సెడాన్ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటి మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లు వరుసగా మొదటి స్థానంలో ఉన్నాయి. వీటితో ఇంకా స్కోడా ర్యాపిడ్ మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి కార్లు కూడా ఉన్నాయి.

          హోండా సిటి

          హోండా సిటి

          హోండా మోటార్స్ ఇండియన్ కస్టమర్లను బాగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సెడాన్ సెగ్మెంట్లో తక్కువ ధరతో మంచి ఫీచర్లను అందించింది. ఉత్తమ మైలేజ్ దీని సొంతం. ఇందులోని బేస్ వేరియంట్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ పోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఇందులో కలవు.

          హ్యుందాయ్ వెర్నా

          హ్యుందాయ్ వెర్నా

          హ్యుందాయ్ వెర్నా హోండా సిటి కారుతో ప్రత్యక్షంగా రణరంగం ఆడుతోంది. ఫీచర్ల పరంగా సిటిని వెనక్కి నెట్టాలని చూస్తోంది వెర్నా. ఇందులో ముఖ్యందా విద్యుత్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే బాహ్యపు అద్దాలు, బాహ్యపు అద్దాల మీద టర్న్ ఇండికేటర్లు, ఛార్జింగ్ కోసం ప్రత్యేక పవర్ అవుట్ పుట్ కలదు అయితే ఇందులో మ్యూజిక్ సిస్టమ్ అందించలేక పోయారు.

          వోక్స్‌వ్యాగన్ వెంటో

          వోక్స్‌వ్యాగన్ వెంటో

          ప్రతి కారులో ఓ ప్రత్యేకత ఉంటుంది అయితే వెంటో యొక్క ప్రీమియమ్ డిజైనింగ్ వలన ఇది మరింత ప్రత్యేకతను పొందింది అని చెప్పవచ్చు. ఇది చూడ్డానికి ఎక్జ్సిక్యుటివ్ క్లాస్ తరహాలో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం, వెనుక వైపున ఫాగ్ ల్యాంప్స్, రేడియో, స్పీకర్లు వంటి కలవు. అయితే ఇందులో మ్యూజిక్ సిస్టమ్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మైలేజ్ వంటి వాటి వలన పోటిలో నెగ్గలేక పోయింది అని చెప్పవచ్చు.

          ధర వివరాలు

          ధర వివరాలు

          • హోండా సిటి (ఇ- పెట్రోల్) ధర రూ 7.96 లక్షలు
          • హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్ (బేస్) ధర రూ. 7.876 లక్షలు
          • వోక్స్‌వ్యాగన్ వెంటో (ట్రెండ్ లైన్ పెట్రోల్) ధర రూ. 7.85 లక్షలు
          • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

            సెడాన్‌ల సెగ్మెంట్లో ఉన్న కార్ల ఓవరాల్ రేటింగ్

            సెడాన్‌ల సెగ్మెంట్లో ఉన్న కార్ల ఓవరాల్ రేటింగ్

            • హోండా సిటి (ఇ- పెట్రోల్) 8/10
            • హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్ (బేస్) 7.5/10
            • వోక్స్‌వ్యాగన్ వెంటో (ట్రెండ్ లైన్ పెట్రోల్) 7/10
            • సబ్-కాంపాక్ట్ ఎస్‌యువిలు

              ఇండియన్ మార్కెట్లో వినియోగదారులు రకరకాల సెగ్మెంట్లకు చెందిన వాహనాలను ఎంచుకుంటున్నారు అనడానికి ఉదాహరణగా ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యు అని చెప్పవచ్చు. ప్రస్తుతం సబ్-కాంపాక్ట్ ఎస్‍‌యువిల సెగ్మెంట్లో ముందు స్థానంలో ఉన్న మూడు వాహనాలు మారుతి వితారా బ్రిజా, ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300. మారుతి వితారా బ్రిజాలో పెట్రోల్ వేరియంట్ ఇవ్వకపోవడం వలన ఇందులో కేవలం డీజల్ వేరియంట్లను మాత్రమే పోల్చడం జరిగింది

              మారుతి సుజుకి వితారా బ్రిజా

              మారుతి సుజుకి వితారా బ్రిజా

              మారుతి సుజుకి ప్రతి సెగ్మెంట్లో కూడా తమ ఉత్పత్తిని అందుబాటులో ఉంచింది. అన్ని సెగ్మెంట్లలో కూడా మారుతి వారి ఉత్పత్తులు పై చేయి సాధిస్తున్నాయి. అయితే తాజా మారుతి విడుదల చేసిన వితారా బ్రిజా కూడా ఇదే తరహా ఫలితాలను నమోదు చేసుకుంటోంది. మార్కెట్లోకి విడుదల చేసిన అనతి కాలంలోనే దాదాపుగా 20,000 పైచిలుకు బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది.

              వితారా బ్రిజా ఫీచర్లు

              వితారా బ్రిజా ఫీచర్లు

              ఇందులో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ మరియు ఆప్షనల్‌గా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు, సగటు ఇంధన సామర్థ్యం మరియు దూరానికి సరిపడు ఇంధనం వంటి వివరాలను అందిచే అత్భుతమైన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సిడి/డివిడి/రేడియో ప్లేయర్, యుఎస్‌బి, ఎయుఎక్స్-ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి వంటివి కలవు. అధిక ఫీచర్లు మరియు మలేజ్ రెండూ వితారా బ్రిజా సొంతం.

              ఫోర్డ్ ఎకో స్పోర్ట్

              ఫోర్డ్ ఎకో స్పోర్ట్

              బ్రిజా మార్కెట్లోకి రాక ముందు వరకు సబ్-కాంపాక్ట్ సెడాన్‌లలో ముందుండేది ఈ ఎకో స్పోర్ట్. డ్రైవర్లకు ఇది ఎంతో ఇష్టం ఎందుకంటే డ్రైవబులిటి ఇందులో చాలా బాగుంది. కాని ఇందులో బేస్ వేరియంట్లో ఎయిర్ బ్యాగులు మరియు బ్రిజా తరహా ఫీచర్లు ఇందులో లేవు.

              మహీంద్రా టియువి300

              మహీంద్రా టియువి300

              మహీంద్రా వారి వాహనాలు అనగానే పనితీరు ఇంజన్ గల వాహనాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఎటువంటి పరిస్థితులలో అయినా చక్కటి పనితీరు కనబరిచే ఇంజన్ ఈ టియువి300లో కలదు. బ్రిజా మరియు ఎకో స్పోర్ట్ వాహనాలలో లేని 7-సీటింగ్ సామర్థ్యం దీని సొంతం. కాని ఇందులో మహీంద్రా మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ బ్యాగులను అందివ్వలేకపోయింది.

              ధర వివరాలు

              ధర వివరాలు

              • మారుతి వితారా బ్రిజా ఎల్‌డిఐ ధర రూ. 6.99 లక్షలు
              • ఫోర్డ్ ఎకో స్పోర్ట్ (ఆంబియంట్) ధర రూ. 7.29 లక్షలు
              • మహీంద్రా టియువి300 (టి4) ధర రూ. 7.11 లక్షలు
              • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

                సబ్-కాంపాక్ట్ ఎస్‌యువి ల ఓవరాల్ రేటింగ్

                సబ్-కాంపాక్ట్ ఎస్‌యువి ల ఓవరాల్ రేటింగ్

                • మారుతి వితారా బ్రిజా ఎల్‌డిఐ 8/10
                • ఫోర్డ్ ఎకో స్పోర్ట్ (ఆంబియంట్) 8/10
                • మహీంద్రా టియువి300 (టి4) 7.5/10
                • కాంపాక్ట్ ఎస్‌యువిలు

                  భారీ ధరలకు మంచి పనితీరు గల ఇంజన్‌లతో అందుబాటులోఉన్న కాంపాక్ట్ ఎస్‌యులకు కూడా ఇండియన్ ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఎంతో అనువుగా ఉంది. ఈ సెగ్మెంట్లో రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా స్కార్పియో వాహనాలు ఎక్కువ అమ్మకాలు సాదిస్తున్నాయి. అంతే కాకుండా నిస్సాన్ టెర్రానో, మారుతి సుజుకి ఎస్-క్రాస్ వంటివి కూడా మోస్తారు ఫలితాలను సాధిస్తున్నాయి.

                  రెనో డస్టర్

                  రెనో డస్టర్

                  కాంపాక్ట్ ఎస్‌యువిల సెగ్మెంట్లో రెనో వారి డస్టర్ మంచి మార్కులు కొట్టేసింది. డిజైన్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంది. ఇండియన్ ఎస్‌యువిల మార్కెట్లో బాగా విజయవంతమైన డస్టర్ పనితీరు, క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్, ధర వంటివి అన్ని కూడా ఎక్కువగానే ఉన్నాయి. డ్రైవర్‌కు మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. అయితే రెనో మ్యూజిక్ సిస్టమ్ మరియు కొన్ని చిన్న ఇంటీరియర్ ఫీచర్లను డస్టర్‌లో అందివ్వలేకపోయింది.

                  హ్యుందాయ్ క్రెటా

                  హ్యుందాయ్ క్రెటా

                  కాంపాక్ట్ ఎస్‌యుల ప్రపంచంలోకి హ్యుందాయ్ తమ క్రెటా వాహనంతో భారీ స్థాయిలో విప్లవం తీసుకువచ్చింది. భద్రతకు సంభందించి యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు సౌర్యానికి సంభందించి ముందు వరుసలో ఆర్మ్ రెస్ట్ మరియు మ్యూజికి సిస్టమ్ వంటి కలవు.

                  మహీంద్రా స్కార్పియో

                  మహీంద్రా స్కార్పియో

                  మహీంద్రా అండ్ మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యు మరియు సబ్ కాంపాక్ట్ ఎస్‌యుల మార్కెట్లో ఆరగ్రేటం చేయడానికి ముఖ్య కారణం స్కార్పియో. స్కార్పియో వాహనం మార్కెట్లో విజయంవంతమైన తరువాత మహీంద్రా ఎక్కువగా ఈ సెగ్మెంట్లో వాహనాలను అందిస్తోంది. స్కార్పియోను 9-సీట్ల సామర్థ్యం మరియు మంచి మైలేజ్‌ను అందించింది. కాని ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగులు మరియు మ్యూజిక్/రేడియో వంటి ఫీచర్లు ఇందులో అందించలేకపోయింది.

                  ధర వివరాలు

                  ధర వివరాలు

                  • రెనో డస్టర్ ఆర్‌ఎక్స్‌ఇ ధర రూ. 8.47 లక్షలు
                  • హ్యుందాయ్ క్రెటా (బేస్) ధర రూ. 9.15 లక్షలు
                  • మహీంద్రా స్కార్పియో ఎస్‌2 (2.5M2DI) ధర రూ. 9.33 లక్షలు
                  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

                    కాంపాక్ట్ ఎస్‌యువిల ఓవరాల్ రేటింగ్

                    కాంపాక్ట్ ఎస్‌యువిల ఓవరాల్ రేటింగ్

                    • రెనో డస్టర్ ఆర్‌ఎక్స్‌ఇ 8/10
                    • హ్యుందాయ్ క్రెటా (బేస్) 8.5/10
                    • మహీంద్రా స్కార్పియో ఎస్‌2 (2.5M2DI) 7.5/10
                    • గత వారంలో ఎక్కువ మంది చదివిన కథనాలు....
                      • నిన్నకాక మొన్న వచ్చింది డిజైర్‌ను పడగొట్టింది
                      • భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు
                      • క్రెటా కారును కొనే ముందు ఇవి చూసుకోండి

More from DriveSpark

Article Published On: Wednesday, March 30, 2016, 12:46 [IST]
English summary
Best Base Variant Cars In India 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+