కొత్త కారు కొంటున్నారా ? మే 2016కి గాను బడ్జెట్ కార్ల మీద భారీ ఆఫర్లు ప్రకటించిన కార్ల సంస్థలు

By Anil

మే 2016, గడవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఐదు రోజుల్లోపు కారు కొనాలనుకుంటున్నారా ? బడ్జెట్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కొన్ని ఎంచుకోదగ్గ కార్ల సంస్థలు కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి. క్రింది కథనం ద్వారా వాటి వివరాలు తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్

కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యందాయ్ దేశీయంగా ఉన్న తమ డీలర్ల ద్వారా తమ ఎంట్రీ లెవల్ కారు ఇయాన్ మీద 35,000 రుపాయల వరకు ఆఫర్ ప్రకటించింది.

ఎక్సెంట్

ఎక్సెంట్

హ్యుందాయ్ మోటార్స్ వారి కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్ మీదు 47,000 నుండి 72,000 రుపాయల వరకు ఆఫర్‌ను ప్రకటించింది.

శాంటా ఫి

శాంటా ఫి

హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఎస్‌యువి శాంటా ఫి మీదు గరిష్టంగా 1,00,000 రుపాయల వరకు లాభాలను ప్రకింటించింది.

గ్రాండ్ ఐ10

గ్రాండ్ ఐ10

ప్రతి మాసంలో కూడా గరిష్టంగా అమ్మకాలను నమోదు చేసుకుంటున్నటాప్-10 కార్ల విభాగంలో గ్రాండ్ ఐ10 ఎప్పుడూ స్థానం సాధిస్తూనే వచ్చింది. ఈ కారు మీద కూడా హ్యుందాయ్ మోటార్స్ 47,000 నుండి 72,000 వరకు ఆఫర్లను ప్రకటించింది.

హోండా మోటార్స్

హోండా మోటార్స్

హోండా మోటార్స్ తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ జాజ్ మీద సుమారుగా 40,000 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ మోటార్స్

ఫోర్డ్ మోటార్స్ అమ్మకాల పరంగా ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ నిర్మాణం పరంగా ఎంతో నాణ్యతతో కార్లను తయారు చేస్తోంది. అందులో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు ఆస్పైర్

మే 2016కి గాను బడ్జెట్ కార్ల మీద భారీ ఆఫర్లు ప్రకటించిన కార్ల సంస్థలు

ఫోర్డ్ మోటార్స్ తమ ఎకో స్పోర్ట్ మరియు ఆస్పైర్ వాహనాల మీద సుమారుగా 80,000 నుండి 1,00,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

డాట్సన్

డాట్సన్

నిస్సాన్ సంస్థ భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ కార్లను మాత్రమే ప్రవేశ పెడుతూ వస్తోంది జపాన్‌కు చెందిన డాట్సన్ సంస్థ. డాట్సన్ వారి గో ప్లస్ 7-సీటర్ వాహనాన్ని ఉచిత ఇన్సూరెన్స్ మరియు తక్కువ డౌన్ పేమెంట్‌తో అందిస్తున్నారు.

టయోటా ఎటియోస్ క్రాస్

టయోటా ఎటియోస్ క్రాస్

టయోటా మోటార్స్ యొక్క బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎటియోస్ క్రాస్ మీద టయోటా డీలర్లు 20,000 వరకు డిస్కౌంటును ప్రకించారు.

చివరి మాట

చివరి మాట

ఈ ఆఫర్ల ద్వారా ఈ నెల చివరిలోపు కారు కొనుగోలు చేసే వారికి మా ఈ కథనం ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ కథనంపై మీ వ్యాఖ్యలు మాకు తెలియజేయవచ్చు.

మరిన్ని కథనాల కోసం...

బడ్జెట్ బాయ్స్‌కు పక్కా కారు.....డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్: మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు

More from DriveSpark

Article Published On: Wednesday, May 25, 2016, 10:59 [IST]
English summary
Looking To Buy A New Car? Here Are The Best Car Discounts In May 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+