ఈ ఏడాదికి చివరి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు: తెలివిగా ఎంచుకోవడానికి సరైన అవకాశం
నవంబర్ మరియు డిసెంబర్ నెలలకు గాను మార్కెట్లోని ప్యాసింజర్ కార్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ కోసం అన్ని వివరాలు క్లుప్తంగా...
పెద్ద నోట్ల రద్దు కారణంతో చిన్న చిన్న చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ఎందుర్కుంటున్నప్పటికీ వాహనాల కొనుగోలు దారులకు బాగా కలిసొచ్చింది. వాహనాన తయారీ సంస్థలు, ఇ-కామర్స్ సంస్థలు, బ్యాంకులు మరియు డీలర్లు ఇలా అందరూ ఒక్కసారిగా ప్యాసింజర్ కార్లపై తమ ఆఫర్లను ప్రకటించాయి.

2016 ఏడాది ముగియనుండటం మరియు వచ్చే ఏడాది ధరలు పెరిగే అవకాశం ఉండటంతో భారీ ఆఫర్లున్న ఈ పరిణామంలో నచ్చిన కారును ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. బడ్జెట్ ఆధారంగా అందుబాటులో ఉన్న కార్లు మీ కోసం...

మారుతి ఆల్టో
తమ లైనప్‌లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఇచ్చే ఏకైక సంస్థ మారుతి సుజుకి. మారుతి తమ ఆల్టో లోని 800 మరియు కె10 మోడల్ కార్ల మీద ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో 800 లోని ఎల్ఎక్స్ఐ వేరియంట్ మీద మరియు ఆల్టో కె10 లోని అన్ని వేరియంట్ల మీద నవంబర్ మరియు డిసెంబర్ ఆఫర్లున్నాయి.

- ఆల్టో 800 (ఎల్ఎక్స్ఐ & ఎల్ఎక్స్ఐ సిఎన్‌జి): తగ్గింపు రూ. 20,000 లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ, 30,000 లుగా ఉంది.
- ఆల్టో కె10 అన్ని వేరియంట్ల మీద: రూ. 20,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు 30,000 రుపాయలు ఎక్స్‌చ్చేంజ్ బోనస్.
- ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ: క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 30,000 లు
- ఆటోమేటిక్ వేరియంట్లు: క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 30,000 లు, అదనపు బోనస్ రూ. 5,000లుగా ఉన్నాయి.
- సిఎన్‌జి వేరియంట్ల మీద: ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 30,000 లు
- డీజల్ వేరియంట్ల మీద: రూ. 65,000 ల వరకు తగ్గింపు.
- మ్యాన్యువల్ వేరియంట్: గిఫ్ట్ చెక్ డిస్కౌంట్ రూ. 20,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 45,000 లు
- ఆటోమేటిక్ వేరియంట్: గిఫ్ట్ చెక్ డిస్కౌంట్ రూ. 20,000 లు, ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 45,000 లు మరియు అదనపు తగ్గింపు ధర రూ. 5,000లుగా ఉన్నాయి.
- సిఎన్‌జి వేరియంట్: గిఫ్ట్ చెక్ డిస్కౌంట్ రూ. 20,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 45,000 లు
- ఎల్ఎక్స్ఐ: క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 50,000 లు
- విఎక్స్ఐ, విఎక్స్ఐ ఆటోమేటిక్, జడ్ఎక్స్ఐ: క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 50,000 లు
- స్విఫ్ట్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు: క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000 లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్్ బోనస్ రూ. 25,000 లు
- స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు: క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000 లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్్ బోనస్ రూ. 25,000 లు
- అన్ని వేరియంట్ల మీద: క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000 లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 30,000 లు
- డీజల్ వేరియంట్ల మీద: రూ 35,000 లు వరకు.
- పెట్రేల్ వేరియంట్: క్యాష్ బ్యాక్ రూ. 10,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూ. 20,000 లు
- సిఎన్‌జి వేరియంట్: ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 20,000 లు
- అన్ని వేరియంట్ల మీద రూ. 50,000 ల వరకు ఆఫర్లు కలవు.
- క్యాష్ డిస్కౌంట్ రూ. 7,500 లు మరియు విభిన్న వేరియంట్ల ఆధారంగా రూ 33,000 ల వరకు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ కలదు.
- క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000 లు
- ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 25,000 -30,000 వరకు (వేరియంట్ ఆధారంగా)
- ప్రభుత్వ ఉద్యోగులకు: పెట్రోల్ ఎక్సెంట్ మీద రూ. 7,000 మరియు డీజల్ ఎక్సెంట్ మీద రూ. 12,000 లు
- క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 లు
- ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 50,000 లు మరియు
- అదనపు డిస్కౌంట్ రూ. 10,000 లు

మారుతి సెలెరియో
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను తమ సెలెరియో ద్వారా పరిచయం చేసింది. ఇప్పటికీ అమ్మకాల్లో మంచి మారుతి మంచి భాగస్వామిగా ఉంది. సిటి మరియు ప్రాంతీయ రహదారులకు సెలెరియో ఆటోమేటిక్ మంచి ఎంపిక.

సెలెరియోలోని వేరియంట్ల వారిగా ఆఫర్లు

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు కొత్తగా కారు కొనే వారికి అదే విధంగా కొత్త కారును నడిపే వారికి ఫ్రంట్ రోడ్ వ్యూవ్ చాలా స్పష్టంగా ఉండటం వంటి కారణాలతో భారీ సక్సెస్ సాధించింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఇది మూడు లేదా నాలుగవ స్థానాల్లో నిలుస్తోంది.

వేరియంట్ల పరంగా ఆఫర్లు

మారుతి సుజుకి రిట్జ్
మారుతి వారి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ టాల్ బాయ్ డిజైన్‌లో ఉంటుంది. ఇందులో శక్తివంతమైన ఇంజన్ కోసం స్విఫ్ట్ మరియు డిజైర్‌లలో వినియోగించిన ఇంజన్‌లను పరిచయం చేసింది.

రిట్జ్ లోని వేరియంట్ల ఆధారంగా ఆఫర్లు

మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు డిజైర్
ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ మరియు కాంపాక్ట్ సెడాన్ రెండూ కూడా మారుతికి చెందినవే. ఈ రెండు ఒకే వేదిక మీద తయారైనవి. స్విఫ్ట్ మరియు డిజైర్ రెండూ తోబుట్టువులాగే ఉంటాయి. వీటి మీద కూడా మారుతి ఆఫర్లనందిస్తోంది.

స్విఫ్ట్ మరియు డిజైర్ లోని వేరియంట్ల పరంగా ఆఫర్లు

మారుతి సుజుకి సియాజ్
మారుతి సుజుకి ఈ సియాజ్ సెడాన్‌ను హైబ్రిడ్ పరిజ్ఞానంతో పరిచయం చేసింది, ప్రస్తుతం ఉన్న సిటి మరియు సెడాన్ లతో పోల్చితే అత్యుతమ మైలేజ్ ఇవ్వగలదు. స్మార్ట్ వెహికల్ బై సుజుకి అనే మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఇందులో అందించింది.

సియాజ్ లోని వేరియంట్ల పరంగా ఆఫర్లు

మారుతి సుజుకి ఎర్టిగా
ప్రస్తుతం దేశీయ విపణిలోని ఎమ్‌పివి సెగ్మెంట్లో అత్యంత సరసమైన ఉత్పత్తి ఎర్టిగా. కుటుంబ సమేతంగా దూర ప్రాంత ప్రయాణాలకు అనువైన ఇందులో ఏడు మంది ప్రయాణించవచ్చు. కాంపాక్ట్ డిజైన్ శైలిలో ఉండటం వలన సిటిలో కూడా దీని చక్కగా నడపవచ్చు.

ఎర్టిగా లోని వేరియంట్ల వారిగా ఆఫర్లు

హ్యుందాయ్ మోటార్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు
ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ మీద క్యాష్ డిస్కౌంట్లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ విసృతమైన నెట్‌వర్క్ ద్వారా అత్యుత్తమ సర్వీస్ లభిస్తుంది. మరియు ఒక ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ అలాగే మూడేళ్ల వారంటీ కలదు.

హ్యుందాయ్ ఇయాన్ లోని అన్ని వేరియంట్ల మీద రూ. 7,500 లు క్యాష్ డిస్కౌంట్స్ మరియు రూ. 20,000 ల వరకు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ కలదు.

హ్యుందాయ్ ఐ10
అత్యుత్తమ పనితీరు కనబరిచే హ్యుందాయ్ ఐ10 ఇప్పటికీ సిటింగ్ రైడింగ్ కోసం విరివిగా ఎంచుకోబడుతోంది. ప్రస్తుతం కొరియాకు చెందిన హ్యుందాయ్ ఆ ఐ10 కారును ఐదేళ్ల క్రితం ధరలో అందుబాటులో ఉంచింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
ధృడ నిర్మాణంతో, సమర్థవంతమైన పనితీరును కనబరిచే హ్యాచ్‌బ్యాక్ కోసం వెతికే వారికి గ్రాండ్ ఐ10 ఉత్తమ ఎంపిక అని మా అభిప్రాయం. ఈ హ్యాచ్‌బ్యాక్‌ను విభిన్నమైన రంగుల్లో ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ దీని మీద మూడేళ్ల పాటు వారంటీ మరియు మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తోంది.

ఆఫర్లు

హ్యుందాయ్ ఎక్సెంట్
కాంపాక్ట్ సెడాన్‌కు హ్యుందాయ్ మోటార్స్ వద్ద ఉన్న సమాధానం ఎక్సెంట్, దీనిని ధృడమైన బాడీ నిర్మాణ విలువలతో గ్రాండ్ ఐ10 వేదిక మీద నిర్మించారు. నాణ్యమైన ఇంటీరియర్స్ అందివ్వడం హ్యుందాయ్ సక్సెస్ అయ్యింది.

ఆఫర్లు

హ్యుందాయ్ వెర్నా
గతంలో ప్రీమియమ్ సెడాన్‌గా మంచి పాపులారిటీని దక్కించుకున్న వెర్నా ఇప్పుడు కొద్దికొద్దిగా పట్టుకోల్పోతోంది. అయితే సరికొత్త వెర్నాను ఫేస్‌లిఫ్ట్ రూపంలో 2017 నాటికి విడుదల చేయడానికి హ్యుందాయ్ సిద్దమవుతోంది.



Click it and Unblock the Notifications








