10 లక్షలలోపు ఉన్న ఉత్తమ డీజల్ సెడాన్ కార్లు
దేశీయ మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చినా వినియోగదారులు కోరుకునే విధంగా, వారి అభిరుచులకు తగ్గట్లుగా అందుబాటులో ఉన్న కార్లు అస్సలు లేవు. ఎంతో అందంగా ఉండే సెడాన్ కార్లను ఎక్కువగా కోరుకుంటారు, అయితే ధర ఎక్కువ కాబట్టి తక్కువ ధరతో అందుబాటులో ఉంటే బాగుండు అనుకుంటారు. తక్కువ ధరకే అందుబాటులో ఉంటే డీజల్ కార్లు అయితే మంచి మైలేజ్ ఇస్తాయని డీజల్ వేరియంట్లను కోరుకుంటారు.
అందుకోసం డ్రైవ్ స్పార్క్ తెలుగు ఇండియన్ మార్కెట్లో 10 లక్షల ధరలోపు అందుబాటులో ఉండే ఉత్తమ డీజల్ సెడాన్ కార్లను గురించి ఈ కథనం ద్వారా తెలియజేస్తోంది. పూర్తి వివరాల కోసం క్రింది కథనాల చదవండి.

5. వోక్స్ వ్యాగన్ వెంటో సెడాన్
వోక్స్ వ్యాగన్ వారి వెంటో సెడాన్ కారు చూడటానికి స్కోడా ర్యాపిడ్ కారు కుటుంబం నుండి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది. అయితే రెండూ కార్లు కూడా డిజైన్ పరంగా కాస్త తేడాగానే ఉంటాయి. వోక్స్ వ్యాగన్ వెంటో లోని డీజల్ వేరియంట్ 10.30 లక్షలు ఎక్స్ షోరూమ్‌తో ప్రారంభం అవుతుంది.

వోక్స్ వ్యాగన్ వెంటో సెడాన్
ఇందులో ఆప్షనల్‌గా డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్‌ను అందించారు. తాజాగా దీనిని ఫేస్ లిప్ట్ రూపంలో కూడా డిజైన్ చేస్తున్నారు. నూతన డిజైన్ మన ముందుకు రానుంది.

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
- ఇంజన్: 1498 సీసీ
- పవర్: 103 బిహెచ్‌పి
- టార్క్: 250 ఎన్ఎమ్
- మైలేజ్: 20.64 కిలోమీటర్/లీటర్
- గేర్‌బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్/7-స్పీడ్ ఆటోమేటిక్
- ధర: 9 లక్షలు ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ గా ఉంది
- ఇంజన్: 1498 సీసీ
- పవర్: 104 బిహెచ్‌పి
- టార్క్: 250 ఎన్ఎమ్
- మైలేజ్: 21.66 కిలోమీటర్/లీటర్
- గేర్ బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్/ 7-స్పీడ్ ఆటోమేటిక్
- ప్రారంభ ధర: రూ. 9.14 లక్షలు ఎక్స్ షోరూమ్
- ఇంజన్ 1396 సీసీ/1582 సీసీ
- పవర్: 89 బిహెచ్‌పి/ 126 బిహెచ్‌పి
- టార్క్: 220 ఎన్ఎమ్/ 260 ఎన్ఎమ్
- మైలేజ్: 24.8/23.9 కిలోమీటర్/లీటర్
- గేర్ బాక్స్: 6-స్పీడ్ మ్యాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్
- ప్రారంభ ధర: రూ. 9.28 లక్షలు ఎక్స్ షోరూమ్
- ఇంజన్: 1498 సీసీ
- పవర్: 99 బిహెచ్‌పి
- టార్క్: 200 ఎన్ఎమ్
- మైలేజ్: 26 కిలోమీటర్/లీటర్
- గేర్ బాక్స్: 6-స్పీడ్ మ్యాన్యువల్
- ప్రారంభ ధర: రూ. 8.23 లక్షలు ఎక్స్ షోరూమ్
- ఇంజన్: 1248 సీసీ
- పవర్: 89 బిహెచ్‌పి
- టార్క్: 200 ఎన్ఎమ్
- మైలేజ్: 28.09 కిలోమీటర్/లీటర్
- గేర్ బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్

4. స్కోడా ర్యాపిడ్
జర్మనీకు చెందిన స్కోడా సంస్థ అందుబాటులో ఉంచిన ర్యాపిడ్ సెడాన్ కారును ఎంచుకోవాలనుకుంటే మంచి నిర్ణయం. దీనికి అన్ని వైపులా అందించిన డిజైన్ ఏరోజుకారోజు నూతనంగా అనిపిస్తుంది. అలాంటి అత్భుతమైన డిజైన్‌తో రూపొందించారు. అంతే కాకుండా ఇందులో వినియోగించిన ఇంజన్ పరంగా కూడా ఇది ఎంతో ఉత్తమమైన కారు.

స్కోడా ర్యాపిడ్
స్కోడా ర్యాపిడ్ కారు కేవలం ఒక్క డీజల్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ సెడాన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. స్కోడా సంస్థ మార్కెట్లో భారీ స్థాయిలో ర్యాపిడ్ సెడాన్ కార్ల అమ్మకాలు సాధించింది. ఇది బాగా విజయవంతమైన కారు కూడా.

ధర, ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

3. హ్యుందాయ్ వెర్నా
ఇండియన్ మార్కెట్లో ఉన్న మరొక అత్భుతమైన సెడాన్ హ్యుందాయ్ వెర్నా. ప్రస్తుతం మార్కెట్లో భారీ అమ్మకాలు సాధిస్తోంది. ఇది రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. అదే విధంగా ఆప్షనల్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నాలోని టాప్ ఎండ్ వేరియంట్ అత్బుతమైన భద్రత ఫీచర్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్టానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఎన్నో ఇందులో ఉన్నయి.

ధర, ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

2. హోండా సిటి
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా వారి బెస్ట్ సెడాన్ కారు సిటి. ప్రారంభంలో ఇది ఇండియన్ మార్కెట్లోకి పెట్రోల్ వేరియంట్‌తో పరిచయం అయ్యింది. భారీ స్థాయిలో విజయం సాధించిన తరువాత ఇందులో డీజల్ వేరియంట్‌ను పరిచయం చేశారు.

హోండా సిటి
హోండా మోటార్స్ డీజల్ సిటి సెడాన్ వేరియంట్లో ఐ-డిటిఇసి పరిజ్ఞానాన్ని అందించారు. హోండా సిటి సెడాన్ కారు ఎక్కువ అమ్మకాలు సాధించడానికి ఈ అంశం ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పవచ్చు.

ధర, ఇంజన్ మరియు మైలేజ్

1. మారుతి సుజుకి సియాజ్
అన్ని సెగ్మెంట్లలో కూడా ఈ సెగ్మెంట్లో ఏ కారు లేదే అనుకుంటున్నారా ? ఈ సెగ్మెంట్లో కూడా ఒగ బెస్ట్ సెడాన్ కారు ఉంది. అయితే ఇది మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా ఇందులో వినియోగించిన స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే పరిజ్ఞానానికి ధన్యవాధాలు చెప్పాలి. ఎందుకంటే ఉత్తమ మైలేజ్ ఇవ్వడానికి ఇదే ముఖ్య కారణం.

మారుతి సుజుకి సియాజ్
మారుతి సుజుకి సియాజ్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ సీటు ఎత్తును సరిచేసుకునే అవకాశం వంటి ఫీచర్లు కలవు.

ధర, ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు
రోడ్డు ప్రమాదాలకు దారితీసే 25 కారణాలను వెల్లడించిన డ్రైవ్‌స్పార్క్
ఇండియన్ మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా విడుదల: ధర రూ. 13.84 లక్షలు


Click it and Unblock the Notifications








