"మారుతి బెస్ట్ డీలర్ షిప్" అవార్డును కైవసం చేసుకున్న హైదరాబాద్ వరుణ్ మోటార్స్
అఖిల భారత మారుతి సుజుకి డీలర్లకు సంభందించిన సమావేశాలు తాజాగా సింగపూర్‌లో జరిగాయి. ఈ సమావేశాల్లో హైదరాబాద్‌కు చెందిన వరుణ్ మోటార్స్ 2016 ఏడాదికి గాను బెస్ట్ డీలర్ ఇన్ ఇండియా అవార్ఢుకు ఎంపికయ్యింది. అంతకు ముందు 2015-2016 ఆర్థిక ఏడాదిలో సుమారుగా 27,000 కార్ల అమ్మకాలు జరిపింది.

2014 ఏడాదిలో కూడా వరుణ్ మోటార్స్ ఈ అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లలో 415 డీలర్‌షిప్‌లు ఈ పోటీలో పాల్గొన్నాయి. అందులో ఉత్తమ మారుతి సుజుకి డీలర్‌గా ఎంపికయ్యింది. వరుణ్ మోటార్స్ సాధించిన మొత్తం అమ్మకాల్లో 25,000 వరకు రెగ్యులర్ షోరూమ్‌లలో మరియు మిగిలిన 2,000 యూనిట్లు నెక్సా అవుట్‌లెట్ల నుండి అమ్మకాలు జరిగాయి.
Also Read: ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు
హైదరాబాద్ మొత్తం మారుతి సుజుకి కార్ల అమ్మకాలు 44 శాతం వాటా మరియు మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు 2.23 శాతం వరుణ్ మోటార్స్ నుండి జరిగాయి. వరుణ్ మోటార్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని బెంగళూరులో కూడా మరికొన్ని షోరూమ్‌లు తెరవనుంది. అంతే కాకుండా వచ్చే ఆర్థిక ఏడాదిలో సుమారుగా 60 కోట్ల రుపాయల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంది.

Also Read: ప్రపంచపు అతి పెద్ద విమానం, హైదరాబాద్ మీదుగా ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు చారిత్రక ప్రయాణం
అయితే దేశ వ్యాప్తంగా అత్యధికంగా మారుతి సుజుకి కార్ల అమ్మకాలు చేపట్టిన షోరూమ్‌లలో కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ఇండస్ మోటార్స్ 35,282 అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది మాత్రమే కాదు, సుమారుగా పదేళ్ల నుండి వరుణ్ మోటార్స్ ఇలాగే మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది.



Click it and Unblock the Notifications