ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న పది కార్లు
ప్రతి మాసానికి మరియు ప్రతి ఏడాదికి ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ ద్వారా చాలా కథనాలే చదివి ఉంటారు. కాని ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 కార్ల గురించి ఎప్పడైనా విన్నారా ?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల కార్ల ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అందులో 2016 సంవత్సరం తొలి సంగంలో టాప్ 10 అమ్మకాలు సాధిస్తున్న పది కార్ల వివరాలు....

10. షెవర్లే సిల్వరాడో
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ యొక్క హెవీ డ్యూటి పికప్ ట్రక్ సుమారుగా 1998 కాలం నుండి ఉత్పత్తి అవుతున్న సిల్వరాడో వాహనం ప్రపంచ వ్యాప్తంగా 2016 మొదటి సగంలో జరిగిన అమ్మకాల్లో 10 స్థానంలో నిలిచింది. 2016 మొదటి సగంలో ప్రపంచ వ్యాప్తంగా 3,07,845 యూనిట్లు అమ్ముడుపోయాయి.

09. హోండా సిఆర్-వి
జపాన్‌కు చెందిన హోండా కార్ల తయారీ సంస్థ హోండా వారి సిఆర్-వి ఎస్‌యువి ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. 2016 మొదటి ఆరు నెలల కాలంలో సుమారుగా 3,33,597 యూనిట్లు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయాయి. హోండా మొదటి సిఆర్-వి ని 1995 లో విడుదలచేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ తరానికి చెందిన సిఆర్-వి అందుబాటులో ఉంది. ఐదవ తరానికి చెందిన సిఆర్-విని ప్రస్తుతం హోండా అభివృద్ది చేస్తోంది.

08. టయోటా క్యామ్రీ
1982 లో మొదటిసారి ఉత్పత్తైనా క్యామ్రీ ఇరుకైన బాడీతో స్లిమ్ముగా అందుబాటులోకి వచ్చింది. తరువాత 1991 నుండి విశాలమైన బాడీతో క్యామ్రీలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది టయోటా. 2016 మొదటి సగంలో ప్రపంచ వ్యాప్తంగా 3,39,611 యూనిట్లు అమ్ముడయ్యాయి.

07. టయోటా ఆర్‌ఎవి4
ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యువిని ఆర్ఎవి ను 1994 లో తయారు చేసింది టయోటా. ఇప్పుడు నాలుగవ తరానికి చెందిన ఆర్ఎవి వాహనం ఆర్ఎవి4 గా అందుబాటులో ఉంది. 2016 తొలి సగంలో సుమారుగా 3,46,791 యూనిట్ల ఆర్ఎవి4 వాహనాలు అమ్ముడయ్యాయి.

06. వోక్స్‌వ్యాగన్ పోలో
వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లో పెద్దగా ఫలితాలన సాధించలేకపోయినా, అంతర్జాకతీయంగా మంచి అమ్మకాలను సాధిస్తోంది. 1975 లో మొదటి పోలోను వోక్స్‌వ్యాగన్ తయారు చేసింది. 2010 లో వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యింది. గడిచిన 2016 మొదటి సగంలో ప్రపంచ వ్యాప్తంగా 3,58,602 యూనిట్లు అమ్ముడుపోయాయి.

05. హ్యుందాయ్ ఎలంట్రా
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఎలంట్రా ప్రపంచ వ్యాప్తంగా 3,63,490 యూనిట్ల అమ్మకాలు జరిపి ఐదవ స్థానంలో నిలిచింది. మొట్ట మొదటి ఎలంట్రాను 1992 లో ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఆరవ తరానికి చెందిన ఎలంట్రా అందుబాటులోకి రానుంది.

04. ఫోర్డ్ ఫోకస్
ఫోర్డ్ సంస్థ మొదటి ఫోకస్ కారును 1998 లో ఉత్పత్తి చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడవ తరానికి చెందిన ఫోకస్ అందుబాటులో ఉంది. దీనిని 2010లో విడుదల చేశారు. 2016 మొదటి ఆరు నెలల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 3,67,479 యూనిట్లు అమ్ముడుపోయాయి.

03. ఫోర్డ్ ఎఫ్ సిరీస్
ఫోర్డ్ మోటార్స్ ఈ ఎఫ్ సిరీస్ పికప్ ట్రక్కులను లైట్ మరియు హెవీ డ్యూటి అవసరాలకు రూపొందించారు. 1948 నుండి ఈ ఫోర్డ్ ఎఫ్ సిరీస్ ట్రక్కులు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్ సిరీస్‌లో ఎఫ్-150 అనే మోడల్ సుమారుగా 13 జనరేషన్లలో విడుదలైంది. 2016 మొదటి ఆరు నెలల్లో 4,78,384 యూనిట్లు అమ్ముడయ్యాయి.

2. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్
వోక్స్‌వ్యాగన్‌కు చెందిన గోల్ఫ్ కారు ప్రపంచపు రెండవ బెస్ట్ సెల్లింగ్ కారు. 206 మొదటి ఆరు నెలల కాలంలో సుమారుగా 5,00,630 యూనిట్ల గోల్ఫ్ కార్లు అమ్ముడుపోయాయి. వోక్స్‌వ్యాగన్ ఈ గోల్ఫ్ కార్లను 1974 నుండి ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.

1. టయోటా కరోలా
ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ కారుగా టయోటా వారి కరోలా నిలిచింది. 1977 వరకు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ కారుగా వోక్స్‌వ్యాగన్ బీటిల్ ఉండేది. ఆ తరువాత బీటిల్ స్థానాన్ని కరోలా ఆక్రమించుకుంది. కరోలా విడుదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా 40 మిలియన్ (40X10,00,000) కార్లు అమ్ముడుపోయాయి. 2016 మొదటి ఆరు నెలల కాలంలో 6,34,298 కార్లు అమ్ముడుపోయాయి.

పరిశీలన
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఉన్న ఐదు కార్లు ( సిఆర్-వి, క్యామ్రీ, పోలో, ఎలంట్రా మరియు కరోలా) దేశీయంగా అమ్మకాల్లో ఉన్నాయి. అంటే భారతీయ వినియోగదారులు ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను విరివిగా ఎంచుకుంటున్నారన్నమాట. అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే ఉత్పత్తలు ఇండియా వైపు అడుగులేస్తున్నాయి.

- ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్ 10 కార్లు
- కార్ మైలేజ్ - అపోహలు, వాస్తవాలు



Click it and Unblock the Notifications








