ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్మకాలు జరిపిన టాప్-10 కార్లు
ప్రతి నెల కూడా అత్యధికంగా అమ్మకాలు జరిపిన టాప్-10 కార్లు అనగానే ప్రతి ఒక్కరు వరుసగా మారుతి సుజుకి వారి కార్లు ఉంటాయి అనుకుంటారు. కొంత మంది రెనో క్విడ్ మారుతి సుజుకి వారి అంచనాలు మించి అమ్మకాలు జరిపిందా...? అనే ఆలోచనలో కూడా ఉంటారు.
ఇవే కాకుండా 2016 ఫిబ్రవరిలో ఎక్కువగా ఎవరి కార్లు అమ్ముడుపోయాయి మరియు రెనో క్విడ్ ఏ స్థానంలో ఉంది వంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ శీర్షికను తప్పకుండా చదవాల్సిందే.

10. మారుతి సుజుకి సియాజ్
చాలా కాలం తరువాత టాప్-10 జాబితాలోకి మారుతి సుజుకి సియాజ్ కారు ఫిబ్రవరి అమ్మకాలతో మళ్లీ అడగుపెట్టింది. గత నెలలో దాదాపుగా 5,162 యూనిట్ల సియాజ్ అమ్మకాలు జరిగాయి.

09. హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ వారి ఇయాన్ కారు గత నెలలో 5,539 యూనిట్ల అమ్మకాలు జరిపి తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాది ఇదే నెలలో 7,200 యూనిట్లు అమ్మకాలు జరిపింది.

08. మారుతి సుజుకి బాలెనొ
మారుతి సుజుకి వారు గత ఏడాదిలో పరిచయం చేసిన కారు ఫిబ్రవరి 2016 లో 6,888 యూనిట్ల అమ్మకాలు జరిపింది. నెక్సా షో రూమ్ ద్వారా అందుబాటులో ఉన్న ఉత్తమ ఉత్పత్తిగా ఇది పేరుగాంచింది.

07. రెనో క్విడ్
రెనో ఇండియా విడుదల చేసిన ఎంట్రీలెవల్ బడ్జెట్ కారు తిరుగులేని అమ్మకాలు మరియు బుకింగ్స్‌న నమోదు చేసుకుంది. ఈ బుల్లి కారును బుక్ చేసుకున్న తరువాత ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది గత ఫిబ్రవరి నెలలో 7,544 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

06. హ్యుందాయ్ ఐ20
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చక్కటి డిజైన్ గల హ్యాజ్‌బ్యాక్ కార్లలో హ్యుందాయ్ వారి ఐ20 కారు ముందుంది. ఇది గత నెలలో 8,419 యూనిట్ల అమ్మకాలను జరిపి టాప్-10 జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ వారి మరొక కారు ఐదవ స్థానానికి ఎంపికైంది. ఈ జాబితాలో ఉన్న కార్లలో ప్రతి ఏడాది కూడా వృద్ది నమోదు చేసుకుంటున్న కారు ఇది ఒక్కటే. గ్రాండ్ ఐ10 కారు గత నెలలో 8,898 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

04. మారుతి సుజుక వ్యాగన్-ఆర్
మారుతి సుజుకికు చెందిన వ్యాగన్-ఆర్ కారు నాలుగవ స్థానంలో నిలిచింది. ఇది గత మాసంలో దాదాపుగా 14,209 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

03. మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి వారి స్విఫ్ట్ ప్రతి నెల కూడా మూడవ స్థానంలోనే ఉంటోంది. అయితే గత నెలలో మారుతి దాదాపుగా 15,475 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలను సాధించింది.

02. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
ఎప్పటిలాగే మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కారు రెండవ స్థానానికే పరిమితం అయ్యింది. దీని స్థానంలోకి ఏ కారు కూడా వచ్చే అవకాశమేలేకుండా ఉంది. గత నెలలో మారుతి సుజుకి దాదాపుగా 17,410 యూనిట్ల వరకు డిజైర్ అమ్మకాలను చేపట్టింది.

01. మారుతి సుజుకి ఆల్టో
టాప్-10 జాబితాలో మారుతి సుజుకి వారి టాప్-10లో ఉన్న కార్లలో ఇది ఆరవ ఉత్పత్తి. మారుతి సుజుకి గత నెలలో 21,286 యూనిట్ల అమ్మకాలు చేపట్టి ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఉంది.

- నిన్న కాక మొన్న వచ్చింది, మారుతి సుజుకి డిజైర్‌ను పడగొట్టింది: ఇక్కడ క్లిక్ చేయండి, మరింత చదవండి
- టాప్-10 జాబితాలో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి !
- మహీంద్రా మరియు ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా 21,000 బుకింగ్స్ కొల్లగొట్టారు.


Click it and Unblock the Notifications








