ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు

By Anil

కొత్త కార్లు కొనుగోళ్ల కన్నా వినియోగించిన (సెకండ్ హ్యాండ్) కార్ల అమ్మకాలు మరియు కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ కార్ల మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్ల సెల్లింగ్ మరియు బయింగ్ ఎక్కువ. కొత్త కారు కొనేముందు రీసేల్ వ్యాల్యూ బాగుందా అని ఆరా తీసి మరి కొంటారు. అయితే మీరు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? అయితే సెకండ్ హ్యాండ్ హ్యాండ్ కారు కొన్నప్పటికీ దానికి కూడా రీసేల్ వ్యాల్యూ బాగుండే వాటిని ఎంచుకుంటే మరీ బాగుంటుంది. నేటి కథనంలో మంచి రీసేల్ వ్యాల్యూ గల సెకండ్ హ్యాండ్ కార్లు గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

హ్యాచ్‌బ్యాక్ కార్లలో బెస్ట్ యూజ్డ్ కార్లు

హ్యాచ్‌బ్యాక్ కార్లలో బెస్ట్ యూజ్డ్ కార్లు

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ :

ఇది విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగి ఉంది. తద్వారా సౌకర్యవంతమైన ప్రయాణానికి ఎంతో అనువుగా ఉంటుంది. ఇక ముందు వైపు క్లియర్ వ్యూవ్ మరియు మంచి టర్నింగ్ రేడియస్ దీని సొంతం. కాబట్టి ఒక వేల సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకుంటే దీనిని కూడా తీసుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

  • ధర : 2 నుండు 2.5 లక్షలు
  • మైలేజ్: 16 నుండి 18 కిలోమీటర్లు
  • కిలోమీటర్లు: 30,000 నుండి 40,000
  • కారు వయస్సు: 4 నుండి 5 సంవత్సరాలు
  • సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ :

    సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ :

    కొత్త కార్లలోనే కాదు వినియోగించిన కార్లలో కూడా వినియోగదారులు రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులో డిజైన్, క్యాబిన్ స్పేస్, మైలేజ్ వంటివి ముఖ్యంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికి సమన్యాయం చేయగలిగే ఉత్పత్తి మారుతి వారి యూజ్డ్ స్విఫ్ట్ కారు. ఇందులో ఆడియో సిస్టమ్, పవర్ స్టీరింగ్ మరియు పవర్ విండోలు కూడా కలవు.

    సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

    సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

    • ధర : 3 నుండు 5 లక్షలు (మోడల్‌ను బట్టి)
    • మైలేజ్: 15 నుండి 17 కిలోమీటర్లు
    • కిలోమీటర్లు: 30,000 నుండి 50,000
    • కారు వయస్సు: 5 నుండి 10 సంవత్సరాలు
    • సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ ఐ20

      సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ ఐ20

      ప్రీమియమ్ హ్యాచ్‍‌బ్యాక్ సెగ్మెంట్లో కొత్త కార్ల మార్కెట్లోనే కాదు సెకండ్ హ్యాండ్ కార్లలో కూడా చోటు సాధించింది. హ్యుందాయ్ మోటార్స్ వారి రెండవ తరానికి చెందిన ఐ20 కార్లును కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్‌గా కొనుగోలు చేసినప్పటికీ మళ్లీ దీనిని రీసేల్ చేయవచ్చు.

      సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

      సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

      • ధర : 4 నుండు 4.5 లక్షలు (పెట్రోల్/డీజల్)
      • మైలేజ్: 14 నుండి 17 కిలోమీటర్లు
      • కిలోమీటర్లు: 30,000 నుండి 50,000
      • కారు వయస్సు: 3 నుండి 4 సంవత్సరాలు
      • సెడాన్ సెగ్మెంట్లో ఉత్తమ యూజ్డ్ కార్లు

        సెడాన్ సెగ్మెంట్లో ఉత్తమ యూజ్డ్ కార్లు

        సెకండ్ హ్యాండ్ అమేజ్ :

        హోండా మోటార్స్ ఇండయన్ మార్కెట్లోకి కొంచెం ఆలస్యంగా డీజల్ కార్లను అందుబాటులోకి తెచ్చింది. హోండా మోటార్స్‌లో ఉత్తమ పనితీరు కనబరిచే సెడాన్ కార్లలో అమేజ్ బాగుటుంది. ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కారు అయిన మారుతి డిజైర్‌కు దగ్గరి పోలికలు ఉంటాయి. అందులో ఉన్న విధంగా దీనిలో ఎక్కువగా క్యాబిన్ స్పేస్ కలదు.

        సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

        సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

        • ధర : 4 నుండు 5 లక్షలు
        • మైలేజ్: 12 నుండి 18 కిలోమీటర్లు (పెట్రోల్ లేదా డీజల్ వేరియంట్‌ను బట్టి)
        • కిలోమీటర్లు: 30,000 నుండి 40,000
        • కారు వయస్సు: 3 నుండి 4 సంవత్సరాలు
        • సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ డిజైర్

          సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ డిజైర్

          దేశ వ్యాప్తంగా బాగా నమ్మకదగిన కాంపాక్ట్ సెడాన్ కార్లలో మారుతి వారి స్విఫ్ట్ డిజైర్ కారు మొదటి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా మారుతి వారి విస్తరణ మరియు నమ్మకదగిన విడి పరికరాలు ఇలా ఎన్నో అంశాలు దీని విపరీతమైన అమ్మకాలకు కారణమయ్యాయి. కొత్త కార్లలాగే సెకండ్ హ్యాండ్ పరంగా కూడా దీనికి మంచి మార్కెట్‌ ఉంది.

          సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

          సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

          • ధర : 4 నుండు 5 లక్షలు
          • మైలేజ్: 14 నుండి 18 కిలోమీటర్లు
          • కిలోమీటర్లు: 40,000 నుండి 70,000
          • కారు వయస్సు: 4 నుండి 5 సంవత్సరాలు
          • సెకండ్ హ్యాండ్ హోండా సిటి

            సెకండ్ హ్యాండ్ హోండా సిటి

            ఇండియన్ మార్కెట్లో మిడ్ సైజ్ సెగ్మెంట్లో ఎక్కువ డింమాండ్‌ను సృష్టించింది. ఇది కొత్తగా కొన్నప్పుడు మాత్రమే కాదు సెకండ్ హ్యాండ్‌గా కొనుగోలు చేసినా కూడా తరువాత భవిష్యత్తులో మంచి రీ సేల్ వ్యాల్యూను కలిగి ఉంది. ఇక దీని డిజైన్, నాణ్యత మరియు ఉత్తమ పనితీరును కనబరుస్తుంది.

            సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

            సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

            • ధర : 2 నుండు 5 లక్షలు (మోడల్‌ను బట్టి)
            • మైలేజ్: 12 నుండి 15 కిలోమీటర్లు
            • కిలోమీటర్లు: 30,000 నుండి 70,000
            • కారు వయస్సు: 4 నుండి 7 సంవత్సరాలు
            • ఎస్‌యువి సెగ్మెంట్లో ఉత్తమ యూజ్డ్ కార్లు

              ఎస్‌యువి సెగ్మెంట్లో ఉత్తమ యూజ్డ్ కార్లు

              సెకండ్ హ్యాండ్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ :

              ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు సాధిస్తున్న ఎస్‌యువిలలో ఇదీ ఒకటి. సాలిడ్ డిజైన్ మరియు మంచి పనితీరు కనబరిచే తత్వం ఇందులో ముఖ్యమైన అంశాలు. సిటి మరియు హై వే డ్రైవింగ్‌లకు ఇది ఎంతో బాగా నప్పుతుంది. సబ్-నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువిలలో ఇది అమ్మకాలు సాధిస్తోంది.

              సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

              సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

              • ధర : 7.5 నుండు 10 లక్షలు
              • మైలేజ్: 12 నుండి 18 కిలోమీటర్లు
              • కిలోమీటర్లు: 20,000 నుండి 40,000
              • కారు వయస్సు: 2 నుండి 3 సంవత్సరాలు
              • సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి ఎర్టిగా

                సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి ఎర్టిగా

                ఏడు మంది సౌకర్యవంతంగా, బడ్టెట్‌లో కారును కొనుగోలు చేయాలనుకుటుంటే మారుతి సుజుకి వారి ఎర్టిగా ఎమ్‌పివిని ఎంచుకోవచ్చు. దీనిని సెకండ్ హ్యాండ్‌గా కొనుగోలు చేసినప్పటికీ ఆ తరువాత కూడా మంచి రీసేల్ వ్యాల్యూ కలిగి ఉంటుంది.

                సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

                సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

                • ధర : 7.5 నుండు 10 లక్షలు
                • మైలేజ్: 12 నుండి 16 కిలోమీటర్లు
                • కిలోమీటర్లు: 10,000 నుండి 40,000
                • కారు వయస్సు: 1 నుండి 4 సంవత్సరాలు
                • సెకండ్ హ్యాండ్ టయోటా ఇన్నోవా

                  సెకండ్ హ్యాండ్ టయోటా ఇన్నోవా

                  ఇండియన్ ఎమ్‌పివి మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు సాధిస్తున్న కార్లలో టయోటా ఇన్నోవా ఒకటి. అంతే కాదు ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ కోసం ఈ మధ్య కాలంలో దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. గరిష్ట దూరాలకు ఇందులో ప్రయాణం ఎంతో చక్కగా ఉంటుంది.

                  సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

                  సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

                  • ధర : 5 నుండు 10 లక్షలు
                  • మైలేజ్: 9 నుండి 11 కిలోమీటర్లు
                  • కిలోమీటర్లు: 35,000 నుండి 1,20,000
                  • కారు వయస్సు: 1 నుండి 8 సంవత్సరాలు
                  • సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్

                    సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్

                    టయోటా ఫార్చ్యూనర్ భద్రత, ఫీచర్లు, పర్ఫామెన్స్ పరంగా ఎంతో ఉత్తమమైన వాహనం. ఇప్పటికీ ఇండియన్ మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ కలదు. అంతే కాకుండా సెకండ్ హ్యాండ్‌గా దీనిని కొనుగోలు చేసినప్పటికీ తరువాత కూడా మంచి రీసేల్ వ్యాల్యూని కలిగి ఉంటుంది.

                    సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

                    సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకునేందుకు ఉపయోగపడే అంశాలు

                    • ధర : 14 నుండు 26 లక్షలు
                    • మైలేజ్: 8 నుండి 10 కిలోమీటర్లు
                    • కిలోమీటర్లు: 15,000 నుండి 1,20,000
                    • కారు వయస్సు: 3 నుండి 6 సంవత్సరాలు
                    • మరిన్ని కథనాల కోసం...

                      మీరు చెల్లించే డబ్బుకు సరైన విలువ గల బెస్ట్ కార్లు

                      దోషాలు ఉన్నా కూడా ఉత్తమంగా అమ్ముడుపోతున్న టాప్-5 కార్లు

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2016, 11:51 [IST]
English summary
Best Used Cars With Resale Value In India 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+