మనం చెల్లించే సొమ్ముకు భారత్‌లో ఉన్న ఉత్తమ విలువైన కార్లు

By Anil

ఈ ఏడాది ఎలాగైనా కారు కొనేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారా...? అయితే మీరు చెల్లించే సొమ్ముకు సరైన కార్లు ఇండియన్ మార్కెట్లో ఏమున్నాయి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అందుకోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం నేడు ప్రత్యేక కథనం: ఇండియన్ మార్కెట్లో మనం చెల్లించే సొమ్ముకు సరైన విలువ గల కార్ల గురించి సెగ్మెంట్ల వారీగా విభజించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

 చిన్న కార్లు

చిన్న కార్లు

ప్రస్తుతం దేశీయ చిన్న మార్కెట్ వాటాలో ఎక్కువ శాతం టాటా నానో,టాటా జెన్ ఎక్స్, హ్యుందాయ్ ఇయాన్, మారుతి సుజుకి ఆల్టో 800 మరియు రెనో క్విడ్ కార్లు హవా ఎక్కువగా ఉంది.

 వీటి ధరలు

వీటి ధరలు

నానో నుండి క్విడ్ వరకు అందుబాటులో ఉన్న ఈ కార్ల ధరలు ప్రారంభం వేరియంట్ రెండు లక్షలు నుండి టాప్ వేరియంట్ వేరియంట్ ధర ఆరు లక్షల వరకు ఉన్నాయి.

 క్విడ్ ప్రత్యేకతలు

క్విడ్ ప్రత్యేకతలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న కార్లలో క్విడ్ లో భారీ స్థాయిలో ఫీచర్లను అందించింది. ముఖ్యంగా తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను అందించారు. మరియు ఏ ఎంట్రీ లెవల్ కార్లలో కూడా లేని విధంగా ఎస్‌యువి తరహా డిజైన్‌ను కల్పించారు. ధర పరంగా కూడా ఈ క్విడ్ చిన్న కార్లతో తీవ్రమైన పోటీని సృష్టించింది.

 చిన్న కార్ల పరంగా రేటింగ్

చిన్న కార్ల పరంగా రేటింగ్

  • టాటా నానో - 7.5/10
  • మారుతి సుజుకి మాల్టో 800 - 8/10
  • హ్యుందాయ్ ఇయాన్ - 7.5/10
  • రెనో క్విడ్ - 8.5/10
  •  చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్

    చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్

    చిన్న కార్లతో పాటు చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఉన్న కార్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కె10, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి సెలెరియో మరియు టాటా వారి టియాగో కారు కలదు. వీటి ఉత్తమంగా అమ్మకాలు సాధిస్తున్న విభాగం నుండి ఎంపిక చేయడం జరిగింది.

    ఆల్టో కె10

    ఆల్టో కె10

    ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న స్మాల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కె10 కారు ఉత్తమ అమ్మకాలు సాధిస్తోంది. దాదాపుగా 30 లక్షల కార్ల వరకు అమ్ముడుపోయాయి. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది నమ్మిన బ్రాండెడ్ కారుగా ఈ కె10 ను అభివర్ణించవచ్చు.

     టాటా టియాగో

    టాటా టియాగో

    టాటా మోటార్స్ వారు విడుదల ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు వారి చరిత్రలో అత్భుతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లో అందుబాటులో ఉంది. అంతే కాకుండా టాటా మోటార్స్ ఈ టియాగో కారులో హర్మాన్ సంస్థకు చెందిన మ్యూజిక్ సిస్టమ్, న్యావిగేషన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను అందించారు.

     మారుతి సుజుకి సెలెరియో

    మారుతి సుజుకి సెలెరియో

    ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఈ సెలెరియో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అయితే టాటా మోటార్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన టియాగో కారులో ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదు.

    తీర్పు

    తీర్పు

    మారుతి సుజుకి తమ సెలెరియో కారులో భద్రత పరంగా రెండు ఎయిర్ బ్యాగులను, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ముందు మరియు వెనుక వైపున పవర్ విండోలు మరియు ఇతర పీచర్లు కలవు.

    మనం చెల్లించే సొమ్ముకు భారత్‌లో ఉన్న ఉత్తమ విలువైన కార్లు

    ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని కార్లతో పోల్చితే టాటా టియాగో ఎక్కువ మార్కులు కొట్టేసింది అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా న్యానిగేషన్, మ్యూజిక్ సిస్టమ్ అదేవిధంగా భద్రత పరంగా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్స కార్నర్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ధర పరంగా కూడా అన్నింటికన్నా ఉత్తమైనది.

     ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న కార్ల రేటింగ్

    ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న కార్ల రేటింగ్

    • మారుతి సుజుకి ఆల్టో కె10 - 7.5/10
    • హ్యుందాయ్ ఐ10 - 7.5/10
    • మారుతి సుజుకి సెలెరియో - 8/10
    • టాటా టియాగో - 8.5/10
    • హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్

      హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్

      గత రెండేళ్ల కాలం నుండి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ వివిధ రకాల నూతన కార్లతో తీవ్ర పోటిని కలిగి ఉంది. అందులో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్, ఫోర్ట్ ఫిగో, మహీంద్రా కెయువి100, హోండా బ్రియో మరియు ఫియట్ పుంటో ఎవో వంటి కార్లు ఉన్నాయి.

      మారుతి సుజుకి స్విఫ్ట్

      మారుతి సుజుకి స్విఫ్ట్

      ఎన్నో సంవత్సరాల నుండి ఇండియన్ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న హ్యాచ్‌బ్యాక్‌ల విభాగంలో మారుతి సుజుకి వారి స్విఫ్ట్ కారు మొదటి స్థానంలో ఉంది. దీనికి పోటిగా నిలిచిన ఇతర కార్లలోని ఫీచర్లు ఇందులో ఉన్నప్పటికీ శక్తివంతమైన ఇంజన్ మరియు నమ్మదగిన పనితీరు కనబరిచే స్పేర్ పార్ట్స్ వలన ఇది విశేషాదరణ పొందింది.

      హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

      హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

      ఐ10 కు కొనసాగింపుగా అందుబాటులోకి వచ్చిన ఈ గ్రాండ్ ఐ10 చూడటానికి ముందు వైపున చక్కని డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మారుతి సుజుకితో పోల్చితే ఇది అత్బుతమైన రంగుల్లో లభిస్తుంది, పని తీరు మరియు ఫీచర్లు పరంగా స్విఫ్ట్ మరియు గ్రాండ్ ఐ10 కారు రెండూ ఒకే కోవకి చెందినవని చెప్పవచ్చు.

      ఫోర్డ్ ఫిగో

      ఫోర్డ్ ఫిగో

      భద్రత మరియు అంతర్జాతీయ నిర్మాణ శైలిలో డిజైన చేయగల ఫోర్డ్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను అందించింది. ప్రపంచ స్థాయి నాణ్యత మరియు ఫీచర్లు బయటి వైపు అద్దాలను పవర్ ద్వారా అపరేట్ చేయడ, స్మార్ట్ ఫోన్ ద్వారా వినియోగించుకోబడే మైఫోర్డ్‌డాక్, మ్యూజిక్ ప్లేయర్, శాటిలైట్ న్యావిగేషన్ మరియు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఇందులో కలవు.

      హోండా బ్రియో

      హోండా బ్రియో

      జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఈ హ్యాచ్‌బ్యాక్‌ల సెగ్మెంట్లో తన బ్రియో కారును అందుబాటులో ఉంచింది. దీని భద్రతను దృష్టిలో ఉంచుకుని హోండా ఇంజనీర్లు ప్రత్యేకమైన బాడీని డిజైన్ చేశారు తద్వారా ఇంటీరియర్ లోపల ఎక్కువ విశాలమైన స్థలాన్ని కల్పించారు.

      మనం చెల్లించే సొమ్ముకు భారత్‌లో ఉన్న ఉత్తమ విలువైన కార్లు

      ఐదు మంది ప్రయాణించే సౌకర్యం ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలదు తద్వారా దీనితో పోటిపడుతున్న చాలా కార్లను ఇది వెనక్కి నెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో మహిళలు ఈ బ్రియో కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

      మహీంద్రా కెయువి100

      మహీంద్రా కెయువి100

      మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏడాది ప్రారంభంలో కెయువి100 వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. విడుదల సమయం నుండి ఇప్పటి వరకు సుమారుగా 37,000 ల పైబడి బుకింగ్స్ నమోదు చేసుకుంది. హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేయాలనుకునే మీకు ఒక ఎస్‌యువి వాహనం కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా ? అయితే ఈ కెయువి100 వాహనాన్ని ఎంచుకోవచ్చు ఇది రెండు అంశాల పరంగా ఎంచుకోవచ్చు.

      మహీంద్రా కెయువి100

      మహీంద్రా కెయువి100

      మహీంద్రా సంస్థ ఈ కెయువి100 లో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, గరిష్ట స్టోరేజ్ సామర్థ్యం, ఆరు మంది కూర్చునే సౌలభ్యం, ఉత్తమ పనితీరు కోసం పవర్ మరియు ఎకో మోడ్, పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు, మరియు ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా పరిచయం చేసింది.

      ఫియట్ పుంటో ఎవో

      ఫియట్ పుంటో ఎవో

      చిన్న చిన్న ప్రమాదాలకు ఇది ఏ మాత్రం జంకదు. దీని బాడీని ఫియట్ సంస్థ ఎన్నో భద్రత ప్రమాణాలతో తయారు చేసింది. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ కారును వినియోగించినపుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారైన దీని ఇంటీరియర్ మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. పని తీరు ఫర్వాలేదనిపిస్తుంది.

      తీర్పు

      తీర్పు

      తీర్పు పరంగా చూస్తే ఫియట్ పుంటో ఎవో, హోండా బ్రియో కార్లు ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి, ఫోర్ట్ ఫిగో మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 రెండూ ఒకే ధరతో ఉన్నాయి. అయితే మహీంద్రా కెయువి100 వాహనాన్ని మారుతి సుజుకి స్విఫ్ట్‌తో పోల్చితే 20,000 రుపాయల వరకు తక్కువకే లభిస్తుంది.

      మనం చెల్లించే సొమ్ముకు భారత్‌లో ఉన్న ఉత్తమ విలువైన కార్లు

      ఈ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మనం చెల్లించే సొమ్ముకు సరైన విలువను కలిగిన కార్లు రెండే, అవి మహీంద్రా కెయవి100 మరియు మారుతి సుజుకి స్విఫ్ట్. బెస్ట్ డిజైన్, తక్కువ ధరకు లభించే స్పేర్ పార్ట్‌లు మరియు మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న కారు స్విప్ట్ అలా కాకుండా ఎస్‌యువి ఫీచర్లతో అందుబాటులో ఉన్న కెయువి100 కూడా ఉత్తమమే.

      హ్యాచ్‌బ్యాక్ కార్ల రేటింగ్

      హ్యాచ్‌బ్యాక్ కార్ల రేటింగ్

      • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 - 7.5/10
      • మారుతి సుజుకి స్విఫ్ట్ - 8/10
      • ఫోర్డ్ ఫిగో - 7.5/10
      • హోండా బ్రియో - 7.5/10
      • ఫియట్ పుంటో ఎవో - 7.5/10
      • మహీంద్రా కెయువి100 - 8.5/10
      • ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

        ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

        హ్యాచ్‌బ్యాగ్ సెగ్మెంట్ తరువాత ఇండియన్ మార్కెట్లో ఎక్కువ ప్రభావం ఉన్న సెగ్మెంట్ ప్రీమియమ్ హ్యాచ్‍‌బ్యాక్. ఈ సెగ్మెంట్లో ప్రతి తయారీదారు కూడా ఒక ఉత్పత్తిని అందించింది. అందుకోసం ఈ విభాగంలో కూడా ఓ మోస్తారు పోటి మొదలైంది.

        అందుబాటులో ఉన్న కార్లు

        అందుబాటులో ఉన్న కార్లు

        ఈ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ప్రస్తుతం మారుతి సుజుకి బాలెనొ, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్. మూడు ఉత్పత్తుల మధ్య తీవ్ర పోటి కలదు. మరి ఇందులో ఏ కారు ఉత్తమ ప్రీమియమ్ హ్యాచ్‌‌బ్యాక్ కారు ఎంపిక అవుతుందో తరువాత స్లైడర్లలో గమనిద్దాం రండి.

        మారుతి సుజుకి బాలెనొ

        మారుతి సుజుకి బాలెనొ

        మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్‌బ్యాక్ కారును రౌండెడ్ డిజైన్ ఫిలాసఫీతో రూపొందించారు. భారీ స్థాయిలో అమ్మకాలు సాధించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

        మారుతి సుజుకి బాలెనొ

        మారుతి సుజుకి బాలెనొ

        ఇందులో శక్తివంతమైన 1.3-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ కలదు. మరియు ఇందులో ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రో మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా కలవు.

        హ్యుందాయ్ ఎలైట్ ఐ20

        హ్యుందాయ్ ఎలైట్ ఐ20

        ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందుబాటులో కలదు. హ్యుందాయ్ మోటార్స్ ఈ ఎలైట్ ఐ20 కారును ఫ్లూయిడిక్ డిజైన్ ఫ్లాట్ ఫాం ఆధారంగా డిజన్ చేశారు. ఒ సారి ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది.

        హోండా జాజ్

        హోండా జాజ్

        హోండా మోటార్స్ సంస్థకు చెందిన జాజ్ ఇంటీరియర్ మరియు ఫీచర్ల పరంగా మారుతి వారి బాలెనొ మరియు ఎలైట్ ఐ20 కార్లతో తీవ్రంగా పోటి పడుతోంది. అయితే జాజ్ వద్ద ఉన్న అరుదైన ఫీచర్లలో జాజ్ టాప్ ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్ పెడల్ షిఫ్టర్స్‌తో అందుబాటులో ఉంది.

        తీర్పు

        తీర్పు

        డిజైన్, ఫీచర్లు, పనితీరు, మార్కెట్లో అమ్మకాలు మరియు ధర వంటి అన్ని అంశాలలోను మారుతి సుజుకి వారి బాలెనొ కారు ఈ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లో ఎంతో ఉత్తమమైన కారు.

        ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ రేటింగ్

        ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ రేటింగ్

        • హ్యుందాయ్ ఎలైట్ ఐ20 - 7.5/10
        • హోండా జాజ్ - 7.5/10
        • మారుతి సుజుకి బాలెనొ - 8/10
        • ప్రస్తుతం చిన్న కార్లు, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు, హ్యాచ్‌బ్యాక్ మరియు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ల సెగ్మెంట్లలో ఉన్న కార్లలో చెల్లించే ధరకు సమానమైన కార్ల గురించి వివరించాం. త్వరలో సెడాన్ ఎమ్‌పివి మరియు ఎస్‌యువి సెగ్మెంట్లలో ఇదే విధంగా ఉత్తమ వాహనాల గురించి అందిస్తాము. అంత వరకు డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

          మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.....

          ఇండియాలో వినియోగిస్తున్న వివిధ రకాల నెంబర్ ప్లేట్లు మరియు వాటి వివరణలు

          రెనో క్విడ్ కారుకు పోటీగా ఎహెచ్ మోడల్ కారును తీసుకువస్తున్న హ్యుందాయ్ మోటార్స్

          మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.....

          గత ఆర్థిక సంవత్సరంలో భారీ అమ్మకాలను చవిచూసిన టాప్-10 మోడళ్లు

          హ్యుందాయ్‌ను అధిగమించిన రెనో క్విడ్ ఇప్పుడు మారుతి వంతు

More from DriveSpark

Article Published On: Friday, April 22, 2016, 9:49 [IST]
English summary
Best Value For Money Cars In India 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+