ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు: బిఎమ్‌డబ్ల్యూ ఐ8

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న లగ్జరీ హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్ల విభాగంలో బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ఐ8 కారు మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సెగ్మెంట్లో మొదటి స్థానంలో నిలిచిన జర్మనీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ వారి ఐ8 కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

అమ్మకాలు

అమ్మకాలు

బిఎమ్‌డబ్ల్యూ గత ఏడాదిలో దాదాపుగా 5,456 హైబ్రిడ్ సూపర్ కార్లను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ కార్లను అందిస్తున్న ఇతర సంస్థల విక్రయాలన్నింటి కన్నా ఇది ఎక్కువ.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారులో మూడు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ తో అనుసంధానమై ఉంటుంది.

విడుదల చేయు పవర్

విడుదల చేయు పవర్

ఇందులో ఉన్న 1.5-లీటర్ ఇంజన్ దాదాపుగా 357 బిహెచ్‌పి పవర్ మరియు అదనంగా ఎలక్ట్రిక్ మోటార్ 129 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం

వేగం

ఈ ఐ8 హైబ్రిడ్ కారు కేవలం 4.5 సెకడ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అది కేవం ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంతోనే పరుగులు పెడుతుంది. మరియు ఇంజన్‌తో కాకుండా ఎలక్ట్రిక్ ఇంజన్ ఆధారంగా గంటకు అత్యధికంగా 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులోని ఇంజన్ ‌నుండి విడుదలయ్యే పవర్‌ను వెనుక చక్రాలకు అందివ్వడానికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ సహాయపడుతుంది.

2-స్టేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్

2-స్టేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్

ఇది హైబ్రిడ్ సూపర్ కాబట్టి ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌కు 2-స్టేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్ కలదు.

 ఐ8 కారును మించిన కారు

ఐ8 కారును మించిన కారు

బిఎమ్‌డబ్ల్యూ వారు తమ ఐ8 హైబ్రిడ్ సూపర్ కారును మించిన కారును, (డిజైన్ పరంగా) జెనీవా మోటార్ షోలో మొదటి సారిగా ప్రదర్శించారు. ఇది డిజైన్ పరంగా ప్రస్తుతం టాప్ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఎంపికైన ఐ8 కారు కన్నా ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు: బిఎమ్‌డబ్ల్యూ ఐ8

ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ప్రొటోనిక్ కారు రెడ్ ఎడిషన్ పెయింట్ మరియు ఫోరెంజ్ ఆక్సెంట్స్ గ్రే మెటాలిక్ రూపంలో వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు: బిఎమ్‌డబ్ల్యూ ఐ8

ఈ కారు విజయవంతమైన అమ్మకాలు సాధించిన తరువాత బిఎమ్‌డబ్ల్యూ ఎజి బోర్డ్ మెంబర్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఐయాన్ రాబర్ట్‌స్టన్ మాట్లాడుతూ. ఇది ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి అమ్మకాలు సాధిస్తుందని తెలుసు. అయితే మా అంచనాలను మించి ఫలితాలను సాధించిందని తెలిపారు. .

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు: బిఎమ్‌డబ్ల్యూ ఐ8

బిఎమ్‌డబ్ల్యూ ఐ బ్రాండ్ లగ్జరీ హైబ్రిడ్ సూపర్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి ఉత్పత్తులు కూడా పోటీగా రాలేవని మరియు వచ్చినా కూడా ఈ ఐ బ్రాండ్ ముందు నిలబడలేవని తెలిపాడు.

వీల్ పెయింట్

వీల్ పెయింట్

ఈ బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ఎడిషన్ కారులోని డబ్ల్యూ-స్పోక్ 470 అల్లాయ్ వీల్స్‌కు ఆర్బిట్ గ్రే మెటాలిక్ మరియు వీటి హబ్స్‌కు అల్యూమినియం మ్యాట్ రంగు పూత పూశారు.

లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 పేరుతో ప్రత్యేకమైన కలర్‌ ఎడిషన్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ కారును లిమిటెడ్ ఎడిషన్‍‌‌గా మాత్రమే అందించనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు: బిఎమ్‌డబ్ల్యూ ఐ8

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లిమిటెడ్ ఎడిషన్ కారులో రెండు సార్లు ఎరుపు రంగుతో కుట్టబడిన ఇంటీరియర్ డెకరేషన్ కలదు. మరియు అక్కడక్కడ హై గ్రేడ్ కార్బన్ ఫైబర్‌ను వినియోగించారు.

ధర

ధర

ఇంత వరకు దీని ప్రత్యేకతల గురించి పొగడటమే కాని దీని ధర ఎంత వరకు ఉంటుందో తెలుసా ? బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారు ధర దాదాపుగా రూ. 2.29 కోట్లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు: బిఎమ్‌డబ్ల్యూ ఐ8
  • భారతదేశం యొక్క మొదటి బుల్లెట్ రైలు 'బ్లూ మ్యాప్' ; తెలుసుకోవాల్సిన 10 విషయాలు
  • బిఎమ్‌డబ్ల్యూ వారి అత్భుత ఉత్పత్తి: ఏకే-47 తో కాల్చినా కూడా చెక్కుచెదరదు.
  • ఇండియన్ మార్కెట్లోకి ఫెరారి 488 జిటిబి విడుదల ధర రూ. 3.88 కోట్లు

Article Published On: Monday, February 22, 2016, 15:45 [IST]
English summary
BMW i8: The Best Selling Hybrid Sports Car In The World
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+