మూడు మోడళ్లతో మన ముందుకు వస్తున్న బిఎమ్‌డబ్ల్యూ
ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బిఎమ్‌డబ్ల్యూ 2016 ఇండియన్ ఆటో పోలో ముచ్చటగా మూడు కార్లను ప్రదర్శించనుంది. అందులో సరికొత్త 7-సిరీస్ లగ్జరీ సెడాన్, అప్‌డేటెడ్ 3-సిరీస్ సెడాన్ మరియు ఎక్స్ 1 కాంపాక్ట్ ఎస్‌యువి మోడల్ కార్లను ప్రవేశపెట్టనుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఈ మధ్యనే గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో తమ ఆరవ తరానికి చెందిన 7-సిరీస్ కారును ప్రదర్శించింది. ఈ 7-సిరీస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు సెడాన్ రేంజ్‌లోనే ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా వారు ఈ 7-సిరీస్ లగ్జరీ కారును పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
బిఎమ్‌డబ్ల్యూ వారి రెండవ తరానికి చెందిన ఎక్స్ కారున ఈ 2016 ఢిల్లీ ఎక్స్ పోలో ప్రదర్శితం కానుంది. ముందు తరం కారుతో పోల్చగా ఇది ఎంతో స్పోర్టివ్ గా ఉంటుంది. ఇది ఐదు మరియు ఏడు సీట్ల ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఈ ఎక్స్ 1 కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో రానుంది.
బిఎమ్‌డబ్ల్యూ వారు తమ 3-సిరీస్ కారుకు కావాల్సిన అన్ని ఫీచర్లు కల్పించారు. ఈ ఎంట్రీలెవల్ కారును బిఎమ్‌డబ్ల్యూ 2012 లో ప్రదర్శించింది. స్పోర్టివ్ లుక్‌ను కలగిన ఈ కారు 2016 ఆటో ఎక్స్ పోకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications




























