తమ అన్ని కార్లలో పెట్రోల్ వేరియంట్లను పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

Written By:

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ దేశీయంగా నాలుగవ మిని క్లబ్ మ్యాన్ ను విడుదల చేసింది. మరియు వచ్చే ఏడాది చివరి నాటికి మెర్సిడెస్ తమ ఇండియా లైనప్‌లో ఉన్న అన్ని కార్లను కూడా పెట్రోల్ వేరియంట్లో పరిచయం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాంక్ ఎమాన్యుయేల్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయంగా ఉన్న అన్ని కార్లను కూడా పెట్రోల్ వేరియంట్లలో విడుదల చేయనుందని తెలిపాడు.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

ఇప్పటికే ఎక్స్3 మరియు ఎక్స్5 సిరీస్ లను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ఇండియా లైనప్‌లో పరిమిత స్థాయిలో మాత్రమే పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

మిని క్లబ్ మ్యాన్ విడుదల వేదిక మీద బిఎమ్‌డబ్ల్యూ ఈ సమాచారానికి సంభందించిన ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఫ్రాంక్ ఎమాన్యుయేల్ మాట్లాడుతూ, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ ప్రొడక్షన్ ప్లాంటులో మరో లైన్‌ను ప్రారంభించనుందని తెలిపాడు.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇంజన్‌లను ఫోర్స్ మోటార్స్ నుండి సేకరిస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు చెన్నైలో ప్రొడక్షన్ ప్లాంటు కలదు. ఈ ప్లాంటులో ఎనిమిది మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే మిని కార్లను దేశీయంగా ఉత్పత్తి చేసే ఆలోచన లేనట్లు బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

సుప్రీం కోర్టు ఢిల్లీ మరియు కేంద్ర రాజధానికి పరిధిలో 2000 కన్నా ఎక్కువ సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై విధించిన రద్దు కారణంగా బిఎమ్‌డబ్ల్యూ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ వంటి సంస్థల డీజల్ ఉత్పత్తుల అమ్మరాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

అయితే ఈ ఏడాది పర్యావరణ సుంకాన్ని 1 శాతం చెల్లించడానికి కార్ల తయారీ సంస్థలు అంగీకరించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది అగష్టులో పెద్ద డీజల్ వాహనాల అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసింది.

బిఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు

పెద్ద డీజల్ వాహనాల రద్దును తొలగించినప్పటికీ లగ్జరీ కార్ల విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ప్రస్తుతం 20 శాతం తక్కువ అమ్మకాలు నమోదవుతున్నట్లు ఫ్రాంక్ ఎమాన్యుయేల్ పేర్కొన్నాడు.

 
English summary
BMW India To Offer Petrol Variants For All Its Cars
Story first published: Tuesday, December 20, 2016, 11:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos