2016 డెట్రాయిట్ ఆటో షో : ఎమ్2 కూపే కారును ప్రదర్శించిన బిఎమ్‌డబ్ల్యూ
బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ల సంస్థ 2016 డెట్రాయిట్ ఆటో షో లో తమ ఎమ్2 కూపే కారును ప్రదర్శించింది. అయితే దీనిని 2016 ఏప్రిల్ నుండి అమ్మకాలకు అందుబాటులో ఉంచనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్2 కూపే కారు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలు...
డెట్రాయిట్ ఆటో షోలో ప్రదర్శించబడిన ఎమ్2 కూపే కారు డిజైన్ పరంగా అక్కడ ఉన్న అన్ని లగ్జరీ కార్లకంటే ప్రత్యేత ఆకర్షణగా నిలిచింది. ఇందులో 3-లీటర్ల కెపాసిటి గల ఆరు సిలిండర్లు గల ఇంజన్ కలదు ఇది దాదాపుగా 364 బిహెచ్పి పవర్ మరియు 465 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరియు దీని ఇంజన్ వేడిని కంట్రోల్ చేయడానికి అదనపు కూలింగ్ సిస్టమ్‌ను కల్పించారు.
బిఎమ్‌డబ్ల్యూ ఎమ్2 కారు కేవలం 4.3 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది. దీనిలో గల ఇంజన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను కల్పించారు. ఈ కూపే కారు అత్యధికంగా గంటకు 250 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.
Also Read: బిఎమ్‌డబ్ల్యూకి చెందిన మరిన్ని కథనాలు
ఇకపోతే ఇందులో ఎలక్ట్రానికల్‌గా కంట్రోల్ చేయబడే లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ కలదు. ఇందులో ఉన్న డిసిటి గేర్ బాక్స్, బ్రేకులు, ముందు మరియు వెనుకవైపున గల ఆక్సిల్స్, క్రాంక్ షాఫ్ట్ మరియు ఇంజన్ పిస్టన్లు అన్ని కూడా బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కూపే నుండి గ్రహించి ఇందులో కల్పించారు.


Click it and Unblock the Notifications





































