బిఎమ్‌డబ్ల్యూ ఎమ్2 గ్రాన్ కూపే విడుదలకు సన్నాహాలు

By Anil

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్2 గ్రాన్ కూపే మరియు 2 సిరీస్ గ్రాన్ కూపే మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్లోకి 2019 నాటికి విడుదల చేయనుంది. అయితే వీటి డిజైన్‌ల కోసమే ఎక్కువ సమయం తీసుకుంటునట్లు తెలిసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్2 గ్రాన్ కూపే

ఈ కొత్త మోడల్‌ను స్పోర్ట్స్ తరహాలో నాలుగు డోర్ల డిజైన్ 6 సిరీస్ గ్రాన్ కూపే లా లేదా స్పోర్ట్ లిఫ్ట్‌బ్యాక్ వంటి డిజైన్ కల్పించే ఆలచనలో బిఎమ్‌డబ్ల్యూ డిజైన్ ఇంజనీర్లు మరియు అధికారులు ఉన్నారు. లిఫ్ట్‌బ్యాక్ డిజైన్‌తో మరియు సాంస్కృతిక డిజైన్‌లో ఈ మోడల్ ఎంతో వాస్తవికతో ఉంటుంది.

ఇంజన్ వివరాలను పరిశీలిస్తే 2 సిరీస్ గ్రాన్ కూపే లో మూడు మరియు నాలుగు సిలిండర్ల టర్భో చార్జ్‌డ్ ఇంజన్‌తో రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 2 సిరీస్ కూపే మరియు క్యాబ్రియోలెట్ వంటి కార్ల తరహాలో పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

అంతేకాకుండా 2 సిరీస్ గ్రాన్ కూపే హైబ్రిడ్ రూపంలో, 1.5 లీటర్ మూడు సిలిండర్ల ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. వినియోగదారులు దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో ఆప్షన్‌తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.
Also Read: అధిక మైలేజ్ ఇవ్వగల 5 కాంపాక్ట్ సెడాన్ కార్లు
మరొక మోడల్ అయిన ఎమ్‌2 గ్రాన్ కూపే 3.0 లీటర్, ఆరు సిలిండర్ల టర్భోఛార్జ్‌డ్ ఇంజన్‌తో రానుంది. ఇది సుమారుగా 370 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. మొత్తం పవర్ వెనుక చక్రాలకు అందుతుంది.

ఫీచర్ల పరంగా ఇందులో దీని పోటిదారులకు సాధ్యం కాని విధంగా పొడవుగా నిర్మితమై ఉన్న ఇంజన్. ఇలా చేయడం ద్వారా దీని పోటీదారులైన ఆడి ఆర్ఎస్3 మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 వంటి వాటి కన్నా ఉత్తమమైన డ్రైవింగ్ వ్యవస్థను కలిగి ఉంది.

Article Published On: Monday, June 13, 2016, 17:53 [IST]
English summary
BMW M2 Gran Coupe To Be Launched In 2019; But Something’s Taking Time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+