2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ఎక్స్2 కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన బిఎమ్‌డబ్ల్యూ
2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్2 కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. తమ లైనప్‌లోకి అతి త్వరలో వచ్చిన చేరనున్న ఈ ఉత్పిత్తి కతాంపాక్ట్ సెడాన్ ఫీచర్లతో చూపరులను ఆకట్టుకుంది. డిజైన్ పరంగా అర్బన్ ప్సోర్టివ్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంది.

ఈ సెడాన్‌ను ముఖ్యంగా స్పోర్టివ్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్లను కోరుకునే వారి కోసం అభివృద్ది చేసినట్లు బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ డిజైన్ ప్రతినిధి ఆడ్రియన్ వ్యాన్ హువైడింక్ తెలిపాడు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్2 కాన్సెప్ట్ బాడీ స్పోర్టివ్ డిజైన్ బాషలో రూపొందించారు.

వెనుక వైపున గరిష్ట ఎత్తులో ఉండే విధంగా డిజైన్ చేయబడింది.

ప్రోటోటైప్ ఎక్స్2 కాన్సెప్ట్ లో పెద్ద అల్లాయ్ చక్రాలను, అచ్చం ఎక్స్ శ్రేణికి చెందిన డిజైన్ తరహాలో బాడీ డిజైన్, గరిష్ట వీల్ బేస్, విశాలమైన రూఫ్ లైన్ వంటి వాటిని గమనించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎక్స్2 కాన్సెప్ట్‌కు సంభందించిన సాంకేతిక వివరాలను వెల్లడించలేదు.

2016 ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించబడిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్2 కాన్సెప్ట్

బాడీ మీద నుండి రెండు భాగాల్లో ఉన్న డోర్ల మీద అద్దాల మీదుగా వెనుక వైపున ఉన్న అద్దం మీద వరకు గ్రాఫిక్స్ డిజైన్ విస్తరించి ఉంది. ఈ డిజైన్ బిఎమ్‌డబ్ల్యూని మరింత ప్రత్యేకం చేసింది.

2016 ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించబడిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్2 కాన్సెప్ట్

2016 ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించబడిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్2 కాన్సెప్ట్

- పాక్‌తో యుద్దానికి సిద్దమైతే ఇండియన్ మిలిటరీ వద్ద ఉన్న బలం ఇదే
- ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
- భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!


Click it and Unblock the Notifications








