కార్ల ఛార్జింగ్‌కు వైర్లతో పనిలేదు
ఆటోమొబైల్స్‌కు సంభందించిన అధునాతన పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడంలో బాష్ సంస్థ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన ఈ సంస్థ ఇప్పడు వాహన రంగంలో అత్యంత కీలకమైన ఛార్జింగ్ అంశాన్ని మరింత సులభ తరం చేసింది.

జర్మనీకి చెందిన ఆటోమొబైల్ విడి పరికరాల తయారీ మరియు సరఫరాలో తనదైన ముద్ర వేసుకున్న బాష్ సంస్థ raunhofer Society and GreenIng GmbH & Co.k అను సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్ లెస్ ఛార్జింగ్ కాన్సెప్ట్‌ను అభివృద్ది చేసింది.

వీరి కాన్సెప్ట్ ప్రకారం భౌతకంగా ఏ విధమైన విద్యుత్ తీగల అనుసంధానం లేకుండానే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ చేయవచ్చు. ముందుగా నిర్దేశించిన అయస్కాంత క్షేత్రంలో కారును పార్కింగ్ చేయడం వలన పర్యావరణ హితమైన మార్గం ద్వారా బ్యాటరీని రీచార్జ్ చేయవచ్చు.

ఇప్పుడు ఈ సంస్థ ఎదుర్కుటున్న సవాళ్లలో పునరుత్పాదక శక్తిని విద్యుత్‌శక్తిగా మార్చి కారుకు ఛార్జింగ్ చేయడం ఒకటి. సహజ సిద్దంగా విరివిగా లభించే పునరుత్పాదక ఇంధన వనరులైన గాలి, సూర్యరశ్మి మరియు నీటి ద్వారా శక్తిని సృష్టించి దానిని అయస్కాంత క్షేత్రం ద్వారా ఎటువంటి విద్యుత్ తీగల సహాయం లేకుండా వినియోగించే ప్రయోగంలో ఈ సంస్థ నిమగ్నమయ్యింది.

ఇలాంటి సాంకేతికను అభివృద్ది చేయడంలో పేరుగాంచిన సంస్థ BiLawE research project తో భాగస్వామ్యంగా బహిరంగ నిధులతో ఈ ప్రేరక పద్దతిలో ఛార్జింగ్ చేసే విధానాన్ని అభివృద్ది చేస్తున్నారు. ఈ విధానం ద్వారా పునరుత్పాదక ఇంధన వనరులను కూడా వినియోగించుకోనున్నారు.

వీరిరువురి భాగస్వామ్యంతో ద్వి-దిశాత్మక బ్యాటరీలను అభివృద్ది చేస్తున్నారు. ఇందులో అత్యంత శక్తివంతమైన మరియు వివేకవంతమైన చార్జింగ్ సిస్టమ్ ద్వారా వాహనం గ్రహించే వివిధ రకాల శక్తిని బ్యాటరీ ఛార్జింగ్ కోసం వినియోగించుకుంటుంది.

మరింత నిశితంగా ఈ బ్యాటరీ పనితీరు మీద దృష్టి పెడితే గాలి, ఎండ మరియు నీరు ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి వాహనంలో నిల్వ చేసుకుంటుంది. ఆ వనరుల నుండి శక్తి ఉత్పత్తి ఆగిపోతే నిల్వ ఉన్న శక్తిని వినియోగించుకుంటుంది.

ఈ ఛార్జింగ్ వ్యవస్థను వాణిజ్య సంభందిత వాహనాలకు అనుసంధానం చేయాలని ఈ బృందం చూస్తోంది. ఇది పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే వ్యాపారం పరంగా వీటిని తయారు చేయనున్నారు.

కారు ఇన్సూరెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు... పూర్తిగా వినియోగదారుల లాభదాయకమైన ఈ విధానం గురించి పూర్తి వివరాలు...


Click it and Unblock the Notifications








