మారుతి సుజుకి వితారా బ్రిజా వేరియంట్లు మరియు ఫీచర్లు

By Anil

మారుతి సుజుకి వారి కాంపాక్ట్ ఎస్‌యువి మీద అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. వితారా బ్రిజా కు చెందిన టీజర్ ఇప్పటకే నెట్టింట్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి కి చెందిన ఫీచర్లు మరియు లభించు వేరియంట్ల గురించిన సమాచారం అత్యంత రహస్యంగా బహిర్గతమైంది.

వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి గురించి లభించిన పూర్తి వివరాలు క్రింది కథనంలో కలవు.

లభించు వేరియంట్లు

లభించు వేరియంట్లు

మారుతి సుజుకి వారి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి మార్కెట్లోకి ఆరు వేరియంట్లలో లభించనుంది.

  • ఎల్‌డిఐ
  • ఎల్‌డిఐ (ఒ)
  • విడిఐ
  • విడిఐ (ఒ)
  • జడ్‌డిఐ
  • జడ్‌డిఐ ప్లస్
  • వీటి ధర దాదాపుగా 6 నుండి 9 లక్షలు ఎక్స్ షోరూమ్ మధ్య ఉండనుంది. మరయు వీటిని నెక్సాషోరూమ్ నుండి మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు.

    ఎల్‌డిఐ వేరియంట్లో గల ఫీచర్లు

    ఎల్‌డిఐ వేరియంట్లో గల ఫీచర్లు

    • డబుల్ బ్యారెల్ హెడ్ ల్యాంప్స్,
    • బంపర్ మీద డిజైన్ చేబడిన సైడ్ ఇండికేటర్ ల్యాంప్స్
    • 15-అంగుళాలు గల స్టీల్ చక్రాలు
    • ఎస్‌యువి బాడీ క్లాడింగ్,
    • ముందు వైపున గల రెండు కిటికీలను పవర్‌తో ఆపరేట్ చేయవచ్చు
    • మాన్యువల్‌గా ఆపరేట్ చేయగలిగే ఎయిర్ కండీషనర్
    • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్
    • డెడ్ పెడల్
    • ఇంజన్ ఇమ్మొబిలైజర్
    • డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ మరియు ఇంకా ఎన్నో ఇందులో ఉన్నాయి
    •  ఎల్‌డిఐ (ఒ) లో గల ఫీచర్లు

      ఎల్‌డిఐ (ఒ) లో గల ఫీచర్లు

      ఎడి‌ఐ లోని ఫీచర్లతో పాటు ఇందులో అదనంగా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫోర్స్ పరిమితితో ఆటోమేటిక్ వెనక్కి వెల్లే సీటు బెల్ట్ వంటి భద్రత పరమైన ఫీచర్లు ఉన్నాయి.

      విడిఐ లో గల ఫీచర్లు

      విడిఐ లో గల ఫీచర్లు

      విడిఐ వేరియంట్ బ్రిజా లో ఎల్‌డిఐ (ఒ) లో గల ఫీచర్లకు అదనంగా నలుపు రంగులో గల రూఫ్ రెయిల్స్ మరియు స్కిడ్ ప్లేట్స్, బాడీ కలర్‌తో వచ్చిన డోర్ హ్యాండిల్స్ మరియు వీల్ కవర్స్, ఇందులోని క్యాబిన్‌లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్, కీ లెస్ ఎంట్రీ, వెనుక వైపున పవర్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రో మ్యాగ్నెట్ టెయిల్‌గేట్, ఫ్యాబ్రిక్ లైనింగ్ మరియు సెక్యురిటీ అలారమ్‌ వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

      విడిఐ (ఒ)

      విడిఐ (ఒ)

      మారుతి సుజుకి బ్రిజా లోని విడిఐ(ఒ) వేరియంట్లో విడిఐ కారులో గల ఫీచర్లతో పాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

      జడ్‌డిఐ వేరియంట్లో గల ఫీచర్లు

      జడ్‌డిఐ వేరియంట్లో గల ఫీచర్లు

      • 16-అంగుళాల అల్లాయ్ వీల్స్,
      • గన్ మెటల్ గ్రే రూఫ్ రెయిల్స్
      • సిల్వర్ ఫినిషింగ్ కలిగిన స్కిడ్ ప్లేట్లు
      • క్రోమ్ గ్రిల్
      • రియర్ వైపర్ మరియు వాషర్
      • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
      • పగట పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు
      • మంచు కురిసే వేళలో వెలిగే లైట్లు
      • జడ్‌డిఐ వేరియంట్లో గల ఫీచర్లు

        జడ్‌డిఐ వేరియంట్లో గల ఫీచర్లు

        • పియాన్ బ్లాక్ మరియు అల్యూమినియం ఫినిషింగ్‌తో రూపొందించిన క్యాబిన్
        • డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం
        • స్టీరింగ్ ద్వారా ఆడియోను కంట్రోల్ చేసే సదుపాయం
        • బ్లూటూత్ ద్వారా జరిగే నియంత్రణలు
        • మూడ్ లైట్ స్పీడో మీటర్
        • 60:40 నిష్పత్తిలో మడిచే వీలున్న వెనుక సీటు
        • లోపలివైపున క్రోమ్‌ పూత పూయబడిన హ్యాండిల్స్
        • మంచి నాణ్యత కలిగిన ఫ్యాబ్రిక్ సీట్లు
        • జడ్‌డిఐ ప్లస్ వేరియంట్లో గల ఫీచర్లు

          జడ్‌డిఐ ప్లస్ వేరియంట్లో గల ఫీచర్లు

          మారుతి సుజుకి బ్రిజా లోని జడ్‌డిఐ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆటో హెడ్ ల్యాంప్స్, మలుపు బట్టి వెలిగే టర్న్ ఇండికేటర్స్, డ్యూయల్ పెయింట్ జాబ్, ఆడియో-వీడియో న్యావిగేషన్, ఆపిల్ కార్ ప్లే గల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్, మ్యాప్ కేర్ గల ఇన్‌బిల్ట్ న్యావిగేషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, పుష్ స్టార్ట్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ అప్పర్ గ్లూవ్ బాక్స్ మరియు ఇంకా ఎన్నో భద్రతపరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

          మారుతి సుజుకి వితారా బ్రిజా వేరియంట్లు మరియు ఫీచర్లు
          1. మారుతి సుజుకి వారి ఇగ్నిస్ కారు గురించి పూర్తి వివరాలు
          2. 2016లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

Article Published On: Saturday, January 30, 2016, 18:16 [IST]
English summary
Maruti’s Brezza Variants And Features Leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+