అనతి కాలంలోనే విపరీతంగా పెరిగిన బుగట్టి చిరాన్ బుకింగ్స్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన మరియు అత్యంత వేగంగా పరుగులు తీసే బుగట్టి కారుకు డిమాండ్ ఏర్పడింది. ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో నమోదైన బుగట్టి చిరాన్ ల డెలివరీ కోసం బుగట్టి సిద్దమవుతోంది.
ప్రపంచ దిగ్గజ హైపర్ కార్ల తయారీ సంస్థ బుగట్టి తమ చిరాన్ కు భారీ సంఖ్యలో నమోదు చేసుకుంది. బుగట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిరాన్‌ను విడుదల చేసిన కేవలం తొమ్మిది నెలల కాలంలోనే 220 చిరాన్‌లకు బుకింగ్స్ నమోదు చేసుకుంది. సంస్థ ముందుగా ప్రకటించిన మేరకు మొత్తం ఉత్పత్తి చేయనున్న 500 యూనిట్లలో ఇప్పటికే 220 వాటికి బుకింగ్స్ జరిగినట్లు బుగట్టి స్పష్టం చేసింది.

సుమారుగా 2.5 మిలియన్ డాలర్లు విలువ చేసే బుగట్టి చిరాన్‌లను ప్రపంచ వ్యాప్తంగా 280 యూనిట్లను విక్రయించడం అంత సామన్యమైన విషయం కాదని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాల కథనం.

బుగట్టి సిఇఓ జిటి స్పిరిట్‌తో మాట్లాడుతూ, కస్టమర్లను చేరుకోవడంలో నూతన మార్గాలను ఎంచుకుంటున్నట్లు మరియు కొత్తగా కార్లను ఎంచుకోవాలనుకునే వారికి వాటిని నడిపి డ్రైవింగ్ అనుభవాన్ని పొందడానికి టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది మార్చి నుండి బుగట్టి చిరాన్‌లకు టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పించనున్నారు.

డిజైన్, పనితీరు మరియు వేగంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండటం ద్వారా ఈ తరహా బుకింగ్స్ సామధ్యమయ్యాయని ఆయన తెలిపాడు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఈ తరహా విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

అయితే బుగట్టి ఈ హైపర్ కార్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది2017 నాటికి 65 యూనిట్లకు పెంచాలని చూస్తోంది. ప్రస్తుతం బుక్ చేసుకున్న వారికి వచ్చే మూడేళ్లలో డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2017 నుండి ఉత్పత్తి అయిన కార్లను డెలివరీకి సిద్దం చేయనుంది బుగట్టి.

- వొళ్లంతా లైట్లు ఒక్క కారులో 41,999 ల ఎల్ఇడి లైట్లు
- CNG వేరియంట్ జీతో ట్రక్కు విడుదల: ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు


Click it and Unblock the Notifications








