ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఐదు కొత్త కార్ల సంస్థ

By Anil

ఇండియన్ మార్కెట్లో ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతగా అంటే కొన్ని పెద్ద నగరాలలో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. ఇలాంటి సమయంలో బైకు లేదా బస్సుల్లో ఉన్న వారి ఓపిక నశించి కారు ఉంటే ఎంచక్కా బాగుటుంది అనుకునే ఉంటారు. లగ్జరీ కార్ల వైపు కొందరు బడ్జెడ్ కార్ల వైపు కొందరు మొగ్గు చూపుతూ వీరి నిర్ణయాలు ప్రతి ఏడాది కూడా గరిష్టం కార్ల అమ్మకాలకు దారితీస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న కార్ల సంస్థలు అన్ని రకాల కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. గత కొన్నేళ్ల క్రిందట దేశీయంగా ఆరంగ్రేటం చేసిన రెనో, నిస్సాన్, ఆడి మరియు ఫెరారి వంటి సంస్థలు కూడా మంచి ఆదరణ పొందాయి. దేశీయంగా కార్ల మార్కెట్ బలపడటంతో కొన్ని అంతర్జాతీయ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి అడుగుమోపనున్నాయి. దేశీయంగా కార్యకలాపాలు సాగించడానికి సిద్దంగా ఉన్న ఐదు సంస్థల గురించి క్రింది కథనంలో.....

1. దైహట్సు

1. దైహట్సు

బడ్జెట్ కార్లను తయారు చేస్తున్న సంస్థ ఇండోనేషియా మార్కెట్లో తక్కువ ధర ఉన్నకార్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయాలని చూస్తోంది. ఈ సంస్థ యొక్క కార్లు అందుబాటులోకి వస్తే అవి క్విడ్ మరియు ఆల్టో వంటి వాటికి పోటీగా నిలుస్తాయి.

2. కియా

2. కియా

మంచి పరిజ్ఞానంతో ఆటోమొబైల్ రంగంలో అడుగుపెట్టిన సంస్థ హ్యుందాయ్. అయినప్పటికీ ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ కార్ల విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగలేకపోతోంది. గత కొన్నేళ్ల క్రితమే హ్యుందాయ్ కియా మోటార్స్‌ను ఇండియన్స్‌కు పరిచయం చేయాలని నిర్ణఇంచుకుంది. కియా వారి వాహనాలు అందుబాటులోకి వస్తే మారుతి సుజుకి, దైహట్సు, డాట్సన్ మరియు రెనో సంస్థలకు చెందిన ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

3. లెక్సస్

3. లెక్సస్

మూడవ సంస్థ లెక్సస్ తమ కార్లను ఇండియన్ రోడ్ల మీద తిరగాలని ఆరాటపడుతోంది. లెక్సస్ సంస్థ టయోటా మోటార్స్‌ మాతృ సంస్థగా లగ్జరీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. లెక్సస్ సంస్థ మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి సంస్థలతో పోటీ పడనుంది.

4. అకురా

4. అకురా

టయోటా మరియు లెక్సస్ సంస్థల్లానే, అకురా కూడా హోండా మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఇండియాలో కార్యకలాపాలు సాగించాలని చూస్తోంది. ఇండియాలో ఖరీదైన కార్లను అందిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థల ఉత్పత్తులకు పోటీగా కార్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచ వ్యాప్తంగా అకురా సంస్థ ఎన్నో దేశాలలో ఒక బ్రాండ్‍‌గా ప్రాచుర్యం పొందింది.

5. జెనిసిస్

5. జెనిసిస్

హ్యుందాయ్ మోటార్స్ వారి సమధానం జెనిసిస్. లగ్జరీ కార్లను తయారు చేసే జెనిసిస్ సంస్థ 2020 నాటికి ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. కియా మోటార్స్‌కు చెందిన ఉత్పత్తులకు పోటీగా జెనిసిస్ కార్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద జెనిసిస్ మోటార్స్ లగ్జరీ ఉత్పత్తులను ప్రదర్శించింది.

దేశీయ మార్కెట్లోకి ఐదు కొత్త కార్ల సంస్థలు

చైనా నుండి ఇండియాకు వస్తున్న కార్లు

సారీ బెంట్లీ: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎస్‌యవి ఇదే

More from DriveSpark

Article Published On: Tuesday, May 31, 2016, 17:38 [IST]
English summary
Five Car Brands That May Soon Set Foot In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+