పండుగ సీజన్ నాటికి పెరగనున్న కార్ల ధరలు
భారత దేశపు వాహన పరిశ్రమలో ఉన్న అన్ని రకాల వాహనాల మీద ధరలను పెంచడానికి వాహన తయారీ సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే పండుగ సీజన్ నాటికి కొత్త ధరలతో వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

వాహన తయారీలో కావాల్సిన విడి భాగాలు, ముడి పదార్థాలు మరియు తయారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచే ఆలోచనలు చేసినట్లు తెలిసింది.
Also Read: కేవలం రెండే గంటల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు
ప్రస్తుతం వాహన తయారీకి అత్యంత ముఖ్యమైన ముడి పదార్థాలు స్టీల్, రబ్బర్, అల్యూమినియం మరియు కాపర్ వంటి వాటి ధరలు గత ఆరు నెలల కాలం నుండి స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. కేవలం కొద్ది సంస్థల మీద మాత్రమే కాకుండా అన్ని వాహన పరిశ్రమల మీద దీని ప్రభావం భారీ స్థాయిలో ఏర్పడుతోంది.
Also Read: భవిష్యత్ ప్రయాణం ఇలా ఉంటుందంటే నమ్మగలరా...?
ఈ విశయం గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ తమ ఉత్పత్తులను సరైన ధరకే అందుబాటులో ఉంచామని, త్వరలో తమ ఉత్పత్తుల మీద వినియోగదారులు స్వాగతించే విధంగా కొత్త ధరలను ప్రకటించనున్నారని తెలిపారు.
Also Read: విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడిపితే ఇవి పాటించండి
ఇండియాలో విభిన్న వాహన ఉత్పత్తులను తయారు చేసే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కూడా ఇదే సమాచారాన్ని ప్రకటించింది. ఏదేమైనప్పటికి వచ్చే పండుగ సీజన్ నాటికి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వాహనాల మీద ధరలు పెరగనున్నాయి. కాబట్టి కారు కొనాలనుకునే వారు ఆలోపు కొనుగోలు చేస్తే బాగుటుంది.


Click it and Unblock the Notifications








