సెప్టెంబర్ మాసంలో విడుదలకు సిద్దమైన కార్లు మరియు బైకులు

By Anil

ఇండియాలో పండుగ వాతావరణం ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఇదే మాసాన్ని వేదికగా చేసుకుని చాలా వరకు ఆటోమొబైల్ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతున్నాయి. పండుగ వాతావరణం నెలకొంటున్న సందర్భంగా అమ్మకాలు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తయరీ సంస్థలు తమ ఉత్పత్తులను విడుదల చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాయి.

 బజాజ్ పల్సర్ విఎస్400

బజాజ్ పల్సర్ విఎస్400

బజాజ్ ఆటో మొదటి సారిగా 2014 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సిఎస్400 అనే పేరుతో కాన్సెప్ట్‌న తయారు చేశారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను విస్400 పేరుతో ప్రొడక్షన్ రెడి ఉత్పత్తిని సిద్దం చేశారు. బజాజ్ ఆటో వారికి విఎస్ 400 బైకు ప్లాగ్‌షిప్ మోడల్‌గా నిలివనుంది.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

బజాజ్ విఎస్ 400లో 373.27సీసీ సామర్థ్యం గల మూడు స్పార్క్ ప్లగ్‌లు మరియు నాలుగు వాల్వ్‌‌లు గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 34.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. దేశీయ మార్కెట్లోకి దీనిని 1.7 నుండి 1.85 లక్షల మధ్య ధరతో విడుదల చేయనుంది.

 మోటో గుజ్జి వి9 రోమర్ మరియు బాబర్

మోటో గుజ్జి వి9 రోమర్ మరియు బాబర్

ఇటాలియన్ సంస్థ మోటో గుజ్జి సంస్థకు చెందిన వి9 రోమర్ మరియు బాబర్ అనే ఉత్పత్తులను పియాజియో సంస్థ దేశీయంగా జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. రెండు బైకులు కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌గా ఈ మాసంలో అందుబాటులోకి రానున్నాయి. రెండు బైకులు కూడా 850సీసీ సామర్థ్యం ఉన్న వి-ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఇది సుమారుగా 54బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

హోండా బ్రియో ఫేస్ లిఫ్ట్

హోండా బ్రియో ఫేస్ లిఫ్ట్

హోండా కార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ సరికొత్త ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ బ్రియోను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది. ఇందులో అభివృద్దిపరచబడిన డిజైన్‌తో పాటు కొత్త డ్యాష్‌బోర్డ్ లే అవుట్, సరికొత్త ఆడియో మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మీద నుండి మ్యూజిక్‌ను ఆపరేట్ చేసే బటన్ కలదు.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

బ్రియో హ్యాచ్‌బ్యాక్‌లో ముందు వైపు రీ డిజైన్ చేయబడిన బంపర్ మరియు ఫ్రంట్ గ్రిల్ కలదు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు ఆర్ఎస్ వెర్షన్‌లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందిస్తున్నారు. ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 88బిహెచ్‌పి పవర్ మరియు 109ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

హ్యుందాయ్ మోటార్స్ ఈ మాసంలో ఆటోమేటిక్ వెర్షన్‌ ఎలైట్ ఐ20 ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇందులో ఏ విధమైన డిజైన్ మార్పులు చోటు చేసుకోలేదు. కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ మాత్రమే పరిచయం అవుతోంది.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్‌లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల విటివిటి పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 99బిహెచ్‌పి పవర్ మరియు 132.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఫియట్ అర్బన్ క్రాస్

ఫియట్ అర్బన్ క్రాస్

శక్తివంతమైన కార్లను అందించే ఇటాలియన్‌కు చెందిన ఫియట్ ఇండియన్ మార్కెట్లోకి ఈ సెప్టెంబర్‌లో తమ అర్బన్ క్రాస్‌ను విడుదల చేయనుంది. ఫియట్ మోటార్స్ దీనిని మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

ఫియట్ ఈ అర్బన్ క్రాస్ లో 1.4-లీటర్ టిజెట్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తున్నారు. ఇది సుమారుగా 140బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ క్రాసోవర్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఇడి లైటింగ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, మరియు ఇంటీరియర్‌లో ఐదు అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆడియో న్యావిగేషన్ లతో పాటు అధునాతన డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్‌ కలదు.

టయోటా ఎటియోస్ మరియు లివా ఫేస్‌లిఫ్ట్

టయోటా ఎటియోస్ మరియు లివా ఫేస్‌లిఫ్ట్

టయోటా కిర్లోస్కర్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సెప్టెంబర్ 13, 2016 న తమ ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్ యొక్క ఎటియోస్ సెడాన్ మరియు లివా హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

టయోటా వారి ఈ రెండు ఉత్పత్తులు కూడా ముందు వైపున ఆంగ్లపు వి-ఆకారంలో ఉన్న నల్లటి హనీకోంబ్ ఇన్‌సర్ట్స్ గల ఫ్రంట్ గ్రిల్ కలదు. ముందు వైపున బంపర్ మరియు కారు వెనుక భాగాల డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఇంటీరియర్ మొత్తాన్ని నల్లటి రంగులో డిజైన్ చేశారు. పియానో బ్లాక్ రంగులో రూపొందించిన సెంటర్ కన్సోల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మరియు మునుపటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో డిజిటల్ డిస్ల్పే కలదు.

ఆడి ఏ4

ఆడి ఏ4

జర్మనీకు చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఏ4 సెడాన్‌ను ప్రదర్శించింది. మరియు ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏ4 సెడాన్‌ను సెప్టెంబర్ 8, 2016 న విడుదల చేయనున్నట్లు ఆడి ప్రకటించింది.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

డిజైన్ పంరంగా ఈ ఏ4 ముందు భాగంలో విశాలమైన సింగల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్ కలదు. ప్రస్తుతం ఇందులో 1.4-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తున్నారు. తర్వాత ఇందులో 2-లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కూడా అందివ్వనున్నారు.

జాగ్వార్ ఎక్స్ఎఫ్

జాగ్వార్ ఎక్స్ఎఫ్

బ్రిటీష్‌కు చెందిన ప్రీమియమ్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ఇండియన్ మార్కెట్లోకి రెండవ తరానికి చెందిన ఎక్స్ఎఫ్ ను ఈ సెప్టెంబర్ చివరిలో విడుదల చేయనుంది. ఇందులో పెద్ద మెష్ గ్రిల్, ఎక్కువ గాలిని గ్రహించే ఎయిర్ ఇంటేకర్ మరియు సరికొత్త హెడ్‌ ల్యాంప్స్ కలవు.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

ప్యూర్, ప్రెస్టేజ్ మరియు పోర్ట్ ఫోలియో అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్న ఇందులో 2-లీటర్ సామర్థ్యం నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇది సుమారుగా 177బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ప్రెస్టేజ్ మరియు పోర్ట్ ఫోలియో వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందివ్వనున్నారు.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అందించే తాజా ఆటోమొబైల్ వార్తలను తెలుగులో చదవడానికి మా ఫేస్‌బుక్ పేజిని లైక్ చేయండి మరియు తక్షణ అటోమొబైల్ వార్తలను ట్విట్టర్ ద్వారా పొందడానికి మమ్మల్ని ఫోలో అవ్వండి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వేదిక అందిస్తున్న కథనాలు మరియు వార్తల పట్ల మీ అభిప్రాయాలను మరియు సలహాలను మాతో పంచుకోగలరు..

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2016, 12:06 [IST]
English summary
Cars And Bikes Launching In September
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+