ఉత్పత్తికి సిద్దమైన షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్
ఇండియన్ మార్కెట్లోకి పరిచయం అయిన సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో రోజు రోజుకీ పోటీ తీవ్రమవుతోంది. మరియు తాజాగా భారతీయులకు పరిచయం అయిన అమెరికా ఆధారిత కార్ల తయారీ సంస్థ షెవర్లే ఈ విభాగంలోకి తమ ఉత్పత్తిని ప్రవేశపెట్టనుంది. దానికి చెందిన మోడల్‌ను ఇప్పటికే ఉత్పత్తికి సిద్దం చేసింది. షెవర్లే వారి మొదటి కాంపాక్ట్ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

షెవర్లే ఇండియా తమ మొదటి కాంపాక్ట్ సెడాన్ కారు ఎసెన్షియా ఫస్ట్ లుక్ ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో విడుదల చేశారు.

షెవర్లే సంస్థ ఈ ఎసెన్షియాను 1.0 లీటర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా అందిస్తున్నారు.

ఈ రెండు ఇంజన్ ఆప్షన్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

షెవర్లే సంస్థ ఈ ఎసెన్షియాను ఐదు విభిన్న మోడళ్లలో విడుదల చేయనుంది. వీటిని వచ్చే 24 నెలల్లోపు విడుదల చేయనున్నారు.

షేవర్లే ఈ ఎసెన్షియాలో ప్రారంభ వేరియంట్లలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎయిర్ బ్యాగ్స్‌తో రానుంది, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లో మరిన్ని భద్రత ఫీచర్లు ఉండనున్నాయి.

ఇందులో ఐదు మంది వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

షెవర్లే ఈ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే దీని ధర రూ . 4.5 నుండి 7 లక్షల మధ్య ఉండవచ్చు

ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న స్విఫ్ట్ డిజైర్, టాటా జెస్ట్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు వోక్స్‌వ్యాగన్ అమియో వంటి వాటికి పోటీగా నిలవనుంది.

షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ ఇంటీరియర్ ముందు భాగం...

ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు
ఇండియన్ మార్కెట్లోకి ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్


Click it and Unblock the Notifications








