కాంపాక్ట్ సెడాన్ విభాగంలోకి ఎసెన్షియాను విడుదల చేసిన షెవర్లే
షెవర్లే ఇండియా గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదక మీద తమ వాహన శ్రేణి నుండి సరికొత్త ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ కారును ప్రదర్శించింది. ఎసెన్షియాకు చెందిన ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

సాంకేతిక వివరాలు:
షెవర్లే వారు తమ బీట్ హ్యాచ్‌బ్యాక్ కారులో వినియోగించిన అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను వినియోగించినట్లు తెలిసింది. ఇందులో గల 1.2-లీటర్ ఎస్‌టిఇసి II పెట్రోల్ ఇంజన్ 77 బిహెచ్‌పి పవర్, 107 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.0-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 55 బిహెచ్‌పి పవర్ మరియు 142.5 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
Also Read: డాట్సన్ నుండి సరికొత్త గో క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్
డిజైన్:
సాధారణంగా మీరు గమనిస్తే షెవర్లే కార్లు విభిన్న డిజైన్‌లను పోలి ఉంటాయి. షెవర్లే ఈ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ కారుని కూడా కొంచెం అల్లరిగా, హుందాగా డిజైన్ చేశారని చెప్పవచ్చు. ముందు భాగంలో ముఖ్యమైన బాగాలు గ్రిల్‌ను డ్యూయల్ పోర్ట్‌గా మరియు హెడ్ లైట్లను ధీర్ఘవృత్తాకారంలో ఉండే విధంగా రూపొందించారు.
Also Read: బెస్ట్ సెడాన్ కారు: ఫియట్ లీనియా 125 ఎస్
సౌకర్యాలు మరియు ఫీచర్లు:
ఎసెన్షియా సెడాన్ కారులో సురక్షితంగా, సుఖవంతంగా ఐదు మంది ప్రయాణించవచ్చు మరియు లగేజ్ కోసం అధికంగా బూట్ స్పేస్‌ను కల్పించారు. ఆండ్రాయిట్ ఆటో మరియు ఆపిల కార్ ప్లే వంటి ఫీచర్లు గల మైలింక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.
Also Raed: హ్యుందాయ్ హెచ్‌ఎన్‌డి-10 కాన్సెప్ట్ ఎస్‌యువి
అందుబాటులోకి :
షెవర్లే సంస్థ ఈ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ కారును 2017 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మరియు దీని ధర దాదాపుగా 4.5 నుండి 5 లక్షల వరకు ఉండనుంది. ఇది మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మరియు హ్యుందాయ్ వారి జెంట్ సెడాన్ కారుకు తీవ్ర పోటిని సృష్టించనుంది.


Click it and Unblock the Notifications



































