సమ్మర్‌కి సూపర్ ఆఫర్లను ప్రకటించిన షెవర్లే ఇండియా
షెవర్లే సంస్థ ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉంచిన వివిధ రకాల ఉత్పత్తుల మీద వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. అమెరికా ఆధారిత సంస్థ అయిన షెవర్లే సమ్మర్ ప్రత్యేకంగా వినియోగదారలను ప్రలోభపెట్లో అత్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మూడు మోడళ్ల మీద అత్భుతమైన డీల్స్‌ను అందించింది. మరిన్ని వివరాలకు క్రింద గల స్లైడర్లను అనుసరించండి.

షెవర్లే వారి బీట్ హ్యాచ్‌బ్యాక్ మీద దాదాపుగా 77,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు. ఎక్స్‌ఛ్చేంజ్ బోనస్‌ను కూడా ఈ సమ్మర్ ఆఫర్ల ద్వారా పొందవచ్చు.

అంతేకాకుండా బీట్‌ను ఈ సమ్మర్ ఆఫర్లలో కొనుగోలు చేసేవారికి బీట్ కారు మీదు మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు.

ఇక మెయింటెనెన్స్ పరంగా 40,000 కిలోమీటర్ల వరకు లేదా మూడు సంవత్సరాల పాటు ఉచితంగా మెయింటెనెన్స్ నిర్వహిస్తారు.

షెవర్లే వారి కాంపాక్ట్ సెడాన్ కారు అయిన సెయిల్ మీద దాదాపుగా 60,000 వరకు లాభ పడేట్లు ఆఫర్లను ప్రకటించింది. అంతే కాకుండా క్యాష్ బోనస్ మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది.

అమెరికా ఆధారిత తయారీ దారులైన షెవర్లే సెయిల్ మీద మొదటి ఏడాది ఉచితంగా ఇన్సూరెన్స్‌ను ప్రకటించింది.

షెవర్లే వారి మల్టీ పర్పస్ వెహికల్ అయిన ఎంజాయ్ మీద 60,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

షెవర్లే దీనిని మీద క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌ల రూపంలో ఆఫర్లను అందిస్తోంది. ఎంజాయ్ ఎమ్‌పివి మీద 60,000 రుపాయల వరకు ఆఫర్లతో పాటు మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నారు.

చివరి తేదీ
అన్ని ఆఫర్లు మరియు లాభాలను సమ్మర్ ఆఫర్ల క్రింద ఏప్రిల్ 30, 2016 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న షెవర్లే డీలర్ల వద్ద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. షెవర్లే ఇండియా వారు విడుదల చేసే మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

జపాన్‍లోని నాగసాకి మరియు హిరోషిమా నగరాలను అణు బాంబులతో అణువణువునా ధ్వంసం చేసిన బోయిుగ్ బి-29
షెవర్లే వారి అప్‌కమింగ్ ఎమ్‌పివి అయిన స్పిన్ కారు గురించి తెలుసుకోండి


Click it and Unblock the Notifications








