వైజాగ్ నగరంలో కొత్త డీలర్ షిప్ ప్రారంభించిన షెవర్లే సంస్థ
ఆంధ్రప్రదేశ్‌లోని తీరానికి ఆనుకుని ఉన్న సుందరమైన నగరం విశాఖపట్నం మనం ముద్దుగా పిలుచుకునే వైజాగ్ నగరంలో షెవర్లే సంస్థ నూతన షోరూమ్‌ను ప్రారంభించింది.

ఆరేంజ్ షెవర్లే అనే పేరుతో సేల్స్, సర్వీసింగ్ మరియు స్పేర్స్ అనే మూడు విభాగాలు ఉండే విధంగా ఈ షెవర్లే షోరూమ్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాల పరంగా తొమ్మిదవ మరియు సర్వీసింగ్ పరంగా ఎనిమిదవ షేవర్లే షోరూమ్‌గా ఈ ఆరేంజ్ షెవర్లే ప్రారంభం అయ్యింది.
ఏలియన్స్ వాహక నౌకల గురించి ప్రయోగాలు చేసే ఏరియా 51 రహస్య ప్రదేశం గురించి కొన్ని వాస్తవాలు
ఈ కొత్త ఆరేంజ్ షోరూమ్‌ను #38-22-87, వరుణ్ అవెన్యూ, పాస్ట్ పోర్ట్ కార్యాలయం ఎదురుగా. మురళీ నగర్ జంక్షన్, జాతీయ రహదారి 5 మీద ఉన్నది. విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చిన షోరూమ్‌తో షెవర్లే సంస్థకు దేశ వ్యాప్తంగా 202 సేల్స్ మరియు 227 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నట్లు షెవర్లే ఇండియా తెలిపింది. వైజాగ్ ఆరేంజ్ షెవర్లే షోరూమ్ ప్రారంభం వేడుకలో జనరల్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఖాహిర్ ఖాజీమ్ మరియు ఆరేంజ్ షెవర్లే ఎమ్‌డి వై. రామకోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications








