ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శనకు దిగిన షెవర్లే స్పిన్
షెవర్లే సంస్థ భారతీయ మార్కెట్లోకి తమ సరికొత్త స్పిన్ ఎమ్‌పివి కారును ప్రవేశపెట్టాలని ఎంతో కాలం నుండి వేచి చూసింది. ఎట్టకేలకు గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక ద్వారా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త స్పిన్ ఎమ్‌పివి వాహనంలోని మూడు వరుసలలోని సీట్ల ద్వారా ఏడు మంది సురక్షితంగా మరియు సుఖవంతంగా ప్రయాణించవచ్చు.

డిజైన్:
షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారుకు ముందు వైపున గల హెడ్ లైట్లు బీట్ హ్యాచ్‌బ్యాక్ నుండి సేకరించారు. స్పిన్ ప్రక్కవైపున గల డోర్లు ఎటువంటి అనవసర డిజైన్‌లు లేకుండా సింపుల్‌గా, సాదాగా రూపొందించారు. వెనుకవైపున డిజైన్‌లో కూడా ప్లేన్‌గా మరియు టెయిల్ లైట్లు బాడీ డిజైన్‌లోకి ఒద్దికగా ఒదిగిపోయాయి.
Also Read: కన్నుల నిండా కనువిందు చేసిన కత్రినా కైఫ్
సాంకేతిక వివరాలు:
షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది
పెట్రోల్ ఇంజన్:
ఇంజన్ సామర్థ్యం 1.4-లీటర్
పవర్ 103 బిహెచ్‌పి
టార్క్ 131 ఎన్ఎమ్ అత్యధిక టార్క్
డీజల్ ఇంజన్:
ఇంజన్ సామర్థ్యం 1.3-లీటర్
పవర్ 76 బిహెచ్‌పి
టార్క్ 188 ఎన్ఎమ్ గరిష్ట టార్క్
రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి. ఇంజన్ నుండి విడుదలయ్యే మొత్తం శక్తి నేరుగా ముందు చక్రాలకు అందుతుంది.
Also Read: ఒక కొత్త ఆశ, విశ్వాసంతో తయారైన ప్రియస్ హైబ్రిడ్ కారు
అందుబాటులోకి:
షెవర్లే సంస్థ ఈ స్పిన్ ఎమ్‌పివి కారును 2017 నుండి అమ్మకాలకు మార్కెట్లోకి సిద్దం చేయనున్నారు. మరియు ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా మరియు నిస్సాన్ ఎవాలియా వంటి వాటికి పోటిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications


























