సరికొత్త షెవర్లే ట్రయల్‌బ్లేజర్ పరీక్షలకు చెందిన రహస్య ఫోటోలు
షెవర్లే ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ ఫేస్‌లిఫ్ట్ ట్రయల్‌బ్లేజర్ ఎస్‌యువిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశీయంగా విడుదల చేసే ముందు దీనికి అత్యంత రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహించారు.

షెవర్లే ఇండియాలో కాకుండా బయట దేశాలలో అందించిన విధంగా రెండు భాగాలుగా ఉన్న ప్రంట్ గ్రిల్, ఫాగ్ మరియు హెడ్ ల్యాంప్స్‌ను చాలా దగ్గర దగ్గరగా ఇముడింప చేశారు.

ఫేస్‌లిప్ట్ ట్రయల్‌బ్లేజర్‌కు వెనుక వైపు కూడా పూర్తిగా కప్పివేసారు, ఇందులో టెయిల్ ల్యాంప్స్‌ను వెనుక వైపున ఉన్న బంపర్‌లో డిజైన్ చేశారు. ఇక దీని టెయిల్ ల్యాంప్స్‌కు అందించిన డిజైన్ కూడా అద్భుతంగా ఉంది.

ఇంటీరియర్‌లోని విరాలు అంత స్పష్టంగా లేవు, సాంకేతిక వివరాల పరంగా ఇందులో 2.8 లీటర్ డ్యూరామ్యాక్స్ డీజల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 197 బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.
డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?


Click it and Unblock the Notifications








