సీఇఎస్ వేదిక మీద బోల్ట్ ఇవి కారును ఆవిష్కరించిన షెవర్లే: ఫోటోలు
షెవర్లే కార్ల సంస్థ 2016లో లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో తమ బోల్ట్ ఇవి హ్యాచ్ బ్యాక్ కారును ప్రవేశ పెట్టింది.

షెవర్లే వారు ఈ బోల్ట్ ఇవి ఎలక్ట్రిక్ కారును 2016 చివరికల్లా ఉత్పత్తి చేయడానికి సిద్ద చేస్తున్నారు. దీని ధర దాదాపుగా 30,000 డాలర్లు వరకు ఉండనుంది. ఈ కారులోని లిథియం అయాన్ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 320 కిలో మీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణించవచ్చని తెలపారు.
ఈ బోల్ట్ ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రస్థానం నిన్నమొన్నటిది కాదులేండి. జనరల్ మోటార్స్ 1990లో తమ మొదటి షెవర్లే ఇవి 1 కారును ప్రవేశ పెట్టింది. అప్పటి నుండి వీటి విజయం పరంపర కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ షెవర్లే బోల్ట్ ఇవి కారును డెట్రాయిట్ కు దగ్గరలోని జనరల్ మోటార్స్ వారి ఓరియన్ తయారీ ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేయనున్నారు.
Also Read: చెన్నైలో ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు పోర్షే కార్లు వేలం: ప్రారంభ ధర రూ. 5 లక్షలు


Click it and Unblock the Notifications























