ఆటో ఎక్స్ పో వేదిక మీద బీట్ ఆక్టివ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన షెవర్లే
జనరల్ మోటార్స్ ఆధ్వర్యంలో గల షెవర్లే సంస్థ గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో తమ బీట్ ఆక్టివా కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. షెవర్లే వారి సాఫ్ట్ రోడ్ వర్షెన్ గా గల హ్యాచ్‌బ్యాక్ కారు గురించి మరిన్ని వివరాలు

డిజైన్:
షెవర్లే వారి బీట్ ఆక్టివా కాన్సెప్ట్ కారు కొంచెం బీట్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ముందు మరియు వెనుకవైపున కొంచెం మొండి వైఖరి గల డిజైన్ కల్పించారు. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ గల బంపర్ మీద ప్రత్యేక క్లాడింగ్ రూపాన్ని అందించారు. ముందు బీట్ డిజైన్ కన్నా ఇది బెటర్‌గా అనిపిస్తుంది.
Also Read: 1.49 లక్షల ధరతో ముచ్చటగా మూడు బైకులు: వీటి దెబ్బతో ఎన్ఫీల్డ్ ఇంటికే
ఇంజన్ మరియు గేర్ బాక్స్ వివరాలు :
షెవర్లే ఇండియా సంస్థ తమ బీట్ ఆక్టివా కాన్సెప్ట్ కారులో బీట్ ముందు కారులో వినియోగించిన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 77 బిహెచ్‌పి పవర్ మరియు 107 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 56 బిహెచ్‌పి మరియు 142.5 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ విడుదల చేయగల 1-లీటర్ డీజల్ ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి.
షెవర్లే మోటార్స్ వారు ఈ కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టయోటా ఎటియోస్ క్రాస్, వోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్ మరియు ఫియట్ అవెంచురా వంటి కార్లకు పోటిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications











































