ఢకార్ ర్యాలీ చరిత్రలో నమోదైన మొదటి ప్రమాదం
2016 ఢకార్ ర్యాలీలో మొదటి సారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మహిళా రైడర్ ఈ ప్రమాదానికి కారకురాలుగా తెలిసింది. నూతన సంవత్సరం సందర్బంగా ఎంతో ఆనందంగా ప్రారంభమైన ఈ కార్ ర్యాలీ కొంత మందికి చేదు నిజంగా మిగిలి పోయింది. ఈ ప్రమాదంలో కొంత మంది గాయపడ్డారు కూడా.
మరింత చదవండి: భారతీయ మార్కెట్లోకి హస్కవర్నా స్పోర్ట్స్ మోటార్ సైకిల్స్
అర్జెంటీనాలో జరిగిన ఢకార్ ర్యాలీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ఒక మిని కూపర్ ర్యాలీ కారు కారణం అని తెలిసింది. అర్జెంటీనాలో బియోనస్ ఎరిస్ మరియు రొసారియో ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన 2016 ఢకార్ ర్యాలీలో 6.6 కిలోమీటర్ మైలు రాయి వద్ద ఈ ర్యాలీ కారు ప్రేక్షకుల మీదకు దూసుకెళ్లింది. 2016 జనవరిలో ప్రారంభమైన ఈ ఢకార్ ర్యాలీలో ప్రమాదానికి కారణం ఒక మహిళ. ఈమె చైనా నుండి మొదటి సారిగా పొల్గొన్నాదని తెలిపారు. ఈమె పేరు "గ్యు మైలింగ్".
మరింత చదవండి: ధరలు పెంచిన టాప్-10 కార్ల సంస్థలు: ఏ మేరకు పెరిగాయో తెలుసా ?
ఈ ప్రమాదంలో నలుగురు గాయపడినట్లు తెలిసింది. మరి ఇందులో ర్యాలీ కారును నడిపిన మహిళ కూడా ఉందా ? లేకపోతే ప్రేక్షకుల మాత్రమే గాయపడ్డారా అని తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం అనంతం ఢకార్ ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ. అత్యవసర పరిస్థితులలో ఏవయినా ప్రమాదాలు చోటు చేసుకుంటే సహాయక చర్యల కోసం నాలుగు మెడికల్ హెలికాఫ్టర్లు, మూడు మెడికల్ వాహనాలు మరియు ఎనిమిది లోకల్ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
దీనిని కూడా చదవండి: 2015 లో టాప్-10 బెస్ట్ స్కూటర్లు ఇవే
ఢకార్ ర్యాలీలో ప్రమాదాలు సర్వ సాధారణం . ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కష్టతరమైన ర్యాలీలలో ఢకార్ ర్యాలీ కూడా ఒకటి. కాని 2016 ఢకార్ ర్యాలీలో నమోదు అయిన మొదటి ప్రమాదం ఇది.



Click it and Unblock the Notifications








