ఇండియాలో వేగంగా అభివృద్ది చెందుతున్న కార్ల తయారీ సంస్థ: డాట్సన్
జపాన్‌కు చెందిన నిస్సాన్ సంస్థకు డాట్సన్ కార్లను ఉత్పత్తి చేసి అందించేది, అలా మొదలైన డాట్సన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌక కార్లను తయారు చేసే సంస్థకు ఎదిగింది. సరసమైన కార్లు అనే మంత్రంతో డాట్సన్ మార్చి 19, 2014 న దేశీయ మార్కెట్లోకి డాట్సన్ గో ఉత్పత్తితో అడుగుపెట్టింది.
డాట్సన్ సంస్థ గో మరియు గో ప్లస్ లతో పాటు ఈ మధ్యనే రెడి గో అనే అత్యంత సరసమైన కారును విడుదల చేసింది. దీని విడుదల చేసిన తరువాత డాట్సన్ ఈ ఏడాదిలో 188 శాతం అమ్మకాల వృద్దిని నమోదు చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం డాట్సన్ ఇప్పటి వరకు 4,297 యూనిట్ల రెడి గో కార్ల అమ్మకాలు జరిపింది.

నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి రెడి గో ను విడుదల చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా వినియోగదారుల నుండి సానుకూల స్పందన లభించింది.

విడుదల చేసిన కేవలం 23 రోజుల కాల వ్యవధిలోనే 3,000 యూనిట్ల వరకు అమ్ముడుపోయాయి. ఇంత తక్కువ కాలంలో ఈ విధమైన స్పందనకు కారణం వినియోగదారులు దీనిని బాగా నమ్మడమే అన్నారు. వారిని అర్థం చేసుకుని మరిన్ని కార్లను వెనువెంటనే డెలివరీ చేస్తామని తెలిపారు.

ఇండియన్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో డాట్సన్ ఇండియా తాజాగనే రెడి గో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఇది ప్రస్తుతం మారుతి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్, రెనో క్విడ్‌లకు పోటీగా నిలిచింది.

డాట్సన్ త్వరలో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు విభిన్నమైన స్టైల్‌ను కలిగి ఉన్న అర్బన్ క్రాస్ ను తమ నాలుగవ ఉత్పత్తిగా విడుదల చేయనుంది.

వీరి ఉత్పత్తుల విడుదల, డిజైన్, ఫీచర్లు మరియు ధర వంటి విషయాలు ఈ కార్ల సంస్థను దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న కార్ల బ్రాండ్‌గా నిలిపుతున్నాయి.

రెనో వారు తమ క్విడ్‌ను అభివృద్ది చేసిన వేదిక మీదనే ఈ రెడి గో ను రూపొందించారు. క్విడ్‌లో ఉన్నటువంటి మూడు సిలిండర్ల 800సీసీ ఇంజన్‌నే ఇందులో వినియోగించారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ముందు చక్రాలకు పవర్‌ను అందించే ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

లీటర్‌కు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల డాట్సన్ రెడి గో ప్రారంభ ధర రూ. 2.39 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

డాట్సన్ రెడి గో గురించి మీకు తెలియని పది ఆసక్తికరమైన విషయాలు
డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ...


Click it and Unblock the Notifications








