ఇండోనేషియాలో స్పెషల్ ఎడిషన్ గో మరియు గో ప్లస్ లను విడుదల చేసిన డాట్సన్
డాట్సన్ దేశీయ మార్కెట్లోకి తాజాగా రెడి గో ఎంట్రీ లెవల్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జపాన్‌కు చెందిన డాట్సన్ ఇండోనేషియా మార్కెట్లోకి గో ప్లస్ పాన్కా స్పెషల్ వెర్షన్ మరియు గో పాన్కా స్పెషల్ వెర్షన్‌లను విడుదల చేసింది. రెండు మోడళ్లు కూడా డాట్సన్ గో ప్లస్ మరియు గో పాన్కా టి-స్టైల్ ఆధారంతో తయారైనవే. వీటి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో.....

ఇండోనేషియాలో విడుదలైన స్పెషల్ ఎడిషన్ ధరలు డాట్సన్ గో ప్లస్ పాన్కా స్పెషల్ ఎడిషన్ 6.34 లక్షలు మరియు డాట్సన్ గో పాన్కా స్పెషల్ ఎడిషన్ 5.70 లక్షలు (భారతీయ రుపాయల్లో) గా ఉన్నాయి.

డాట్సన్ వారి రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు కూడా లిమిటెడ్ ఎడిషన్ కేవలం 500 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు కూడా బాహ్యవైపున కొన్ని కాస్మొటిక్ మార్పులకు గురయ్యాయి. అధిక సంఖ్యలో ఏరోడైనమిక్ డిజైన్ మార్పులను పొందాయి. ముందు మరియు వెనుక వైపున ఉన్నబంపర్లకు క్రోమ్ పూత పూయబడి ఉంది. ఇక గో కారు ఫాక్స్ కార్బన్ ఫైబర్ రూఫ్ స్పాయిలర్‌ను మరియు క్రోమ్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది.

ఇంటీరియర్ పరంగా రెండు మోడళ్లు కూడా లెథర్ అప్ హోల్ట్స్రే, సింగిల్ డిఐఎన్ మ్యూజిక్ ప్లేయర్, రివర్స్ కెమెరా మరియు రెండు సెట్లు ట్వీటర్లు, స్పీకర్లు మరియు ఆంప్లిఫైయర్ కలదు.

సాంకేతిక వివరాల పరంగా చూస్తే రెండు పాన్కా స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌లలో 1.2 లీటర్ మూడు సిలిండర్ల ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 68బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. దీని ద్వారా పవర్ ముందు చక్రాలకు అందుతుంది.

ఇదే రీతిలో డాట్సన్ సంస్థ తమ రెండు ఉత్పత్తులకు మార్పులు చేర్పులు చేసి స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులుగా విడుదల చేస్తే మంచి అమ్మకాలు సాధించే అవకాశం ఉంది. అయితే డాట్సన్ వీటిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఏ విధమైన ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

1,388 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 33 లీటర్ల డీజల్‌తో ఛేదించిన రెనో లాజీ: ఇవి పాటిస్తే మీ కారు కూడా ఇస్తుంది


Click it and Unblock the Notifications








