10,000 లు దాటిన డాట్సన్ రెడి గో బుకింగ్స్
జపాన్‌కు చెందిన ప్రముఖ అత్యంత సరసమైన కార్ల తయారు చేసే సంస్థ డాట్సన్ ఇండియన్ లైనప్‌లోకి విడుదల చేసిన సరికొత్త రెడి గో హ్యాచ్‌బ్యాక్ 10,000 లకు పైబడి బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. గత ఏడాదిలో కూడా రెనో వారు అందుబాటులోకి తెచ్చిన క్విడ్ బుకింగ్స్ సునామీని సృష్టించింది.

డాట్సన్ సంస్థ ఈ రెడి గో హ్యాచ్‌బ్యాక్‌ను మే 7, 2016 న దేశవ్యాప్తంగా విడుదల చేసింది.

దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.39 లక్షలుగా ఉంది. ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో అత్యంత సరసమైన కారు కూడా ఇదే.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిస్సాన్ మరియు డాట్సన్ వారికి సంయుక్తంగా 227 షోరూమ్‌లు ఉన్నాయి.

డాట్సన్ రెడి గో కారులో 799సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇది సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్ పరంగా దీనికి ఉన్న పోటీదారులతో పోల్చుకుంటే ఇది గరిష్టంగా లీటర్‌కు 25.17 కిలోమీటర్ల ఇవ్వగలదు.

వారంటీ పరంగా డాట్సన్ తమ రెడి గో మీద 2 సంవత్సరాలు లేదా అన్ లిమిటెడ్ కిలోమీటర్లుగా ప్రకటించింది.

డాట్సన్ ఆప్షనల్‌గా అదనపు రెండు లేదా మూడేళ్ల పాటు మరియు అన్ లిమిటెడ్ కిలోమీటర్లు పాటు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తోంది.

ఈ సందర్భంగా డాట్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతు, ఈ నెల నుండి బుకింగ్స్ చేసుకున్నవినియోగదారులకు దేశ వ్యాప్తంగా డెలివరీ ఇవ్వనున్నాము. ఇండియాలో ఉన్న యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన డాట్సన్ రెడి గో తన పదునైన డిజైన్ లక్షణాలతో వినియోహగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. అని తెలిపాడు.

ఒకే రోజున 50 డాట్సన్ రెడి గో కార్లు డెలివరీ
బడ్జెట్ బాయ్స్‌కు పక్కా కారు...డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్


Click it and Unblock the Notifications








