ముంబాయ్‌లో మాత్రమే 150 బుకింగ్స్ నమోదుచేసుకున్న డాట్సన్ రెడి గో
నిస్సాన్ భాగస్వామ్యంతో భాగంగా ఉన్న డాట్సన్ తమ మూడవ ఉత్పత్తి అయిన రెడి గో కారును 2016 ఏప్రిల్ 14 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును కొనుగోలు చేయాలుకుంటే వినియోగదారుల కోసం దేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్న డాట్సన్ షోరూమ్‌లలో టెస్ట్ డ్రైవ్ కోసం సిద్దం చేశారు. అయితే దీనిని విడుదల చేసిన అతి కొద్ది కాలంలో ముంబాయ్ నగరంలో 150 కార్లు బుకింగ్ అయినట్లు డాట్సన్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతానికి డాట్సన్ వీటికి సంభందించి బుకింగ్స్ ప్రాసెస్‌ను ఇంకా విడుదల చేయలేదు. అయితే ముంబాయ్ నగరంలో ఉన్న సుమారుగా 150 మంది వినియోగదారులు ఈ కారును చూడకుండానే సంభందింత డీలర్ల వద్ద బుకింగ్ చేసుకున్నారు. వచ్చే మే 1 నుండి వీటికి సంభందించి బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
జపాన్‌కు చెందిన డాట్సన్ సంస్థ తమ రెడి- గో కారును 2.44 లక్షలు ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. రెనో మరియు నిస్సాన్ వారి భాగస్వామ్యంతో అభివృద్దైన క్విడ్ మరియు డాట్సన్ వారి రెడి గో రెండు కార్లు సిఎమ్‌ఎఫ్-ఎ వేదిక ఆధారంగా రూపొందించారు. కాబట్టి వీటి ధరలు సుమారుగా ఒకే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెడి గో కారు క్విడ్, ఆల్టో 800 మరియు హ్యుందాయ్ ఇయాన్ వంటి కార్లలో పోటిపడనుంది.
డాట్సన్ సంస్థ ఈ రెడి గో ఎంట్రీ లెవల్ కారులో 0.8-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. అయితే దీని పనితీరుకు సంభందించిన వివరాలు డాట్సన్ విడుదల చేయలదు. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రానుంది. అయితే మైలేజ్ పరంగా ఇది మార్కెట్లో ఉన్న చిన్న కార్లతో పాటు సమానంగా ఇవ్వగలదని మా అంచనా.


Click it and Unblock the Notifications

































