డాట్సన్ రెడి గో విడుదల: ప్రారంభ ధర రూ. 2.38 లక్షలు

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ బడ్జెట్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ ఇండియన్ మార్కెట్లోని ఎంట్రీలెవల్ కార్ల సెగ్మెంట్లో మరింత పోటీని సృష్టిస్తు అత్యంత తక్కువ ధరతో రెడి గో కారును విడుదల చేసింది. రెడి గో ఎంట్రీ లెవల్ బడ్డెట్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 2.38 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది. డాట్సన్ సంస్థ 2016 ఏప్రిల్ 14 న నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొూబైల్ ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే నేడు దేశీయ మార్కెట్లోకి అధికారికంగా అమ్మకాల కోసం విడుదల చేశారు. రెడి గో యొక్క ధరలు మరియు పూర్తి వివరాల కోసం క్రింది కథనం మీద ఓ లుక్కేసుకోండి.

డాట్సన్ రెడి గో ధరలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)

డాట్సన్ రెడి గో ధరలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)

  • రెడి గో డి ధర రూ. 2,38,900 లు
  • రెడి గో ఎ ధర రూ. 2,82,649 లు
  • రెడి గో టి ధర రూ. 3,09,149 లు
  • రెడి గో టి (ఒ) ధర రూ. 3,19,399 లు
  • రెడి గో ఎస్ ధర రూ. 3,34,399 లు
  • డాట్సన్ రెడి గో ధరలు (ఎక్స్ షోరూమ్ ముంబాయ్)

    డాట్సన్ రెడి గో ధరలు (ఎక్స్ షోరూమ్ ముంబాయ్)

    • రెడి గో డి ధర రూ. 2,49,220 లు
    • రెడి గో ఎ ధర రూ. 2,94,859 లు
    • రెడి గో టి ధర రూ. 3,22,504 లు
    • రెడి గో టి (ఒ) ధర రూ. 3,33,197 లు
    • రెడి గో ఎస్ ధర రూ. 3,48,845 లు
    • డాట్సన్ రెడి గో డిజైన్

      డాట్సన్ రెడి గో డిజైన్

      డాట్సన్ సంస్థ 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన రెడి గో కాన్సెప్ట్‌చో పోల్చితే దీని డిజైన్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. యాంగులర్ ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్స్, మరియు అర్ధ సమాంతర చతుర్భుజ(ట్రెపిజాయిడల్) ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ దీనిిక మధ్యలో డాట్సన్ బ్యాడ్జ్‌ను అందించారు.

       డాట్సన్ రెడి గో విడుదల: ప్రారంభ ధర రూ. 2.38 లక్షలు

      ఫ్రంట్ గ్రిల్‌కు క్రింది భాగంలో చిన్న ఎయిర్ డ్యామ్‌గల బంపర్ కలదు, దీనికి రెండు చివరలా పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లను అందించారు.

      డాట్సన్ రెడి గో డిజైన్

      డాట్సన్ రెడి గో డిజైన్

      మన చూపుల్ని ఇట్టే ఆకట్టుకునేందుకు అన్నట్లుగా ముందు వైపు హెడ్ లైట్ల క్రింది నుండి కుడి మరియు ఎడమ వైపుల ఉన్న డోర్ల మీదకు అది విధంగా వెనుక ఉన్న టెయిల్ ల్యాంప్స్ క్రింది వైపు నుండి డోర్ల అడుగు భాగం మీదుగా లోనికి తొలచబడినట్లుగా గీతలను డిజైన్ చేశారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

      డాట్సన్ రెడి గో డిజైన్

      డాట్సన్ రెడి గో డిజైన్

      వెనుక వైపున కొంచెం కోణంతో వాలుగా ఉండేట్లు వెనుక వైపు అద్దాన్ని డిజైన్ చేసారు. అలాగే లోపలి వరకు వంచబడి తిరిగి బయటకు వచ్చేట్లుగా మెటల్ డిజైన్ కలదు, ఈ డిజైన్‌లోనే భాగంగా టెయిల్ ల్యాంప్స్‌ను ఇముడింపచేశారు.

      డాట్సన్ రెడి గో సాంకేతిక వివరాలు

      డాట్సన్ రెడి గో సాంకేతిక వివరాలు

      • ఇంజన్ సామర్థ్యం: 799 సీసీ
      • సిలిండర్లు: మూడు సిలిండర్లు
      • ఇంధన రకము: పెట్రోల్ మాత్రమే
      • ట్రాన్స్ మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
      • డాట్సన్ రెడి గో సాంకేతిక వివరాలు

        డాట్సన్ రెడి గో సాంకేతిక వివరాలు

        • డ్రైవ్ సిస్టమ్: ఫ్రంట్ వీల్ డ్రైవ్
        • పవర్: 53 బిహెచ్‌పి
        • టార్క్: 72 ఎన్ఎమ్
        • మైలేజ్ తయారీదారుని ప్రకారం: 25.17 కిమీలు (ఏఆర్‌‌ఏఐ ప్రకారం)
        • డాట్సన్ రెడి గో ప్రత్యేకతలు

          డాట్సన్ రెడి గో ప్రత్యేకతలు

          • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 28-లీటర్లు
          • గరిష్ట వేగం: గంటకు 140 కిలోమీటర్లు
          • 0-100 కిమీలు వేగం: 5.9 సెకండ్ల కాలంలోనే
          • భద్రత: టాప్ ఎండ్ వేరియంట్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్
          • వారంటీ: తయారీదారుని రెండేళ్ల వారంటీ
          • డాట్సన్ రెడి గో లభించు రంగులు

            డాట్సన్ రెడి గో లభించు రంగులు

            డాట్సన్ రెడి గో హ్యాచ్‌బ్యాక్ ఐదు విభిన్న రంగుల్లో లభించును.

            • లైమ్
            • రూబీ
            • సిల్వర్
            • వైట్
            • గ్రే
            • ఇంటీరియర్

              ఇంటీరియర్

              అన్నింటి పరంగా ఫర్వాలేదు అని డాట్సన్ రెడి గో డిజైన్ ఇంటీరియర్ పరంగా వచ్చేసరికి కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇంటీరిర్ స్పేస్ కూడా చాలా వరకు తక్కువగా ఉంది. ఇక ఇందులోని వినియోగించిన పరికరాల నాణ్యత కూడా అంతంతమాత్రంగానే ఉంది.

              పోటీ

              పోటీ

              డాట్సన్ రెడి గో ప్రస్తుతం ఇండియన్ ఎంట్రీ లెవల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ మరియు రెనో క్విడ్ వంటి ఉత్పత్తులతో పోటీపడనుంది.

              డాట్సన్ రెడి గో విడుదల: ప్రారంభ ధర రూ. 2.38 లక్షలు

              డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్

              (విడుదలకు ముందుగా డ్రైవ్‌స్పార్క్ బృందం డాట్సన్‌ రెడి గో కు నిర్వహించిన టెస్ట్ డ్రైవ్ వివరాలు)

Article Published On: Tuesday, June 7, 2016, 16:46 [IST]
English summary
Datsun redi-GO Launched In India, Prices Start At Rs. 2.38 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+