డాట్సన్ రెడి గో స్పోర్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు
జపాన్‌కు చెందిన అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థ డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి తమ లేటెస్ట్ రెడి గో హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్ట్ రూపంలో లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. సరికొత్త రెడి గో స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 3,49,479 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది.

డాట్సన్ ఇండియా ఈ ఏడాదిలో అందుబాటులోకి తెచ్చిన రెడి గో కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన మరియు 2016 రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ చేతులు మీదుగా ఈ లిమిటెడ్ ఎడిషన్ డాట్సన్ రెడి గో స్పోర్ట్‌ను విడుదల చేశారు.

రెడి గో స్పోర్ట్ విడుదల సందర్బంగా 2016 రియో ఒలంపిక్స్‌లో పతకం సాధించినందుకు గాను మొదటి రెడి గో స్పోర్ట్ కారును సాక్షి మాలిక్‌కు ప్రధానం చేసింది డాట్సన్ ఇండియా.

డాట్సన్ ఇండియా ఈ రెడి గో స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 799సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

రెడి గో స్పోర్ట్ మీద కొన్ని కాస్మొటిక్ మెరుగులు దిద్దింది డాట్సన్, నల్లటి ఫ్రంట్ గ్రిల్, నల్లటి వీల్ కవర్లు మరియు రూఫ్ స్పాయిలర్‌ను అందించింది.

ఇంటీరియలోని డ్యాష్ బోర్డ్‌ని పూర్తిగా నల్లటి రంగులోకి మార్చేశారు, ఈ స్పోర్ట్ వేరియంట్లో అదనంగా బ్లూటూత్ ఆడియో, వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, కీ లెస్ ఎంట్రీలతో పాటు రబ్బీ, వైట్, మరియు గ్రే అనే మూడు విభిన్న రంగుల్లో దీనిని అందుబాటులోకి తెచ్చింది.

డాట్సన్ ఇండియా ఈ స్పోర్ట్ మోడల్‌ను రెడి గో లోని టాప్ ఎండ్ ఎస్ వేరియంట్లోనే అందించారు. దీనిని దేశవ్యాప్తంగా ఉన్న 227 డీలర్ షిప్‌ల నుండి బుక్ చేసుకోవచ్చు.

- మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి విడుదల
- ప్రియస్ మీద ఆధిపత్య పోరుకు సిద్దమైన హ్యుందాయ్ ఇయానిక్
- అన్ని ఉత్పత్తుల మీద లక్ష రుపాయల వరకు తగ్గింపు


Click it and Unblock the Notifications








